E-Paper
Advertisement

Redmi Note 13 Pro Discount: బంగారం లాంటి ఆఫర్.. 200 MP కెమెరా ఫోన్‌పై బిగ్గెస్ట్ డిస్కౌంట్.. ఇప్పుడు ఎలా చేయాలి!

Redmi Note 13 Pro Discount: బంగారం లాంటి ఆఫర్.. 200 MP కెమెరా ఫోన్‌పై బిగ్గెస్ట్ డిస్కౌంట్.. ఇప్పుడు ఎలా చేయాలి!
Advertisement

Redmi Note 13 Pro Discount: చైనీస్ టెక్ మేకర్ Xiaomi బ్రాండ్ Redmi నోట్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియాలో ఫుల్ డిమాండ్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కస్టమర్‌లు తక్కువ ధరలలో ఆకర్షణీయమైన ఫీచర్లను చూస్తారు. మీరు మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తున్నట్లయితే Redmi Note 13 Pro 5G బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. అంతే కాకుండా ఈ ఫోన్ ప్రత్యేకమైన డీల్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా 200MP ట్రిపుల్ కెమెరా ఉన్న ఫోన్ ధర 20 వేల రూపాయలుగా ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Redmi బ్రాండింగ్ ఫోన్ బేస్ 8GB RAM+128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 నుండి రూ.21,999కి తగ్గింది. మరోవైపు 8GB RAM+ 256GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర రూ.26,999 నుండి రూ.23,999కి తగ్గుతుంది. బ్యాంక్ ఆఫర్ కారణంగా రెండింటిపై రూ. 3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్ బ్లూ, గ్రే, పింక్ వంటి మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.

Advertisement

అమెజాన్‌లో Redmi Note 13 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్ గురించి మాట్లాడితే SBI క్రెడిట్ కార్డ్, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలు చేయడం ద్వారా రూ. 3,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఇది కాకుండా మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా Mi.comలో రూ. 3,000 తగ్గింపును కూడా లభిస్తుంది. కస్టమర్‌లు తమ పాత ఫోన్‌ని ఎక్స్‌ఛేంజ్ చేస్తే భారీ బెనిఫిట్ పొందుతారు.

Also Read: డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. వన్‌ప్లస్ బిగ్ గిఫ్ట్.. అన్నీ ఫోన్లపై భారీగా ఆఫర్లు!

Advertisement

Redmi Note 13 Pro 5G స్మార్ట్‌ఫోన్‌‌లో 6.67 అంగుళాల FHD+ AMOLED డాట్‌ డిస్‌ప్లే ఉంటుంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఫోన్ Qualcomm Snapdragon 7s Gen 2 5G ప్రాసెసర్‌తో బెస్ట్ పర్ఫామెన్స్ అందిస్తుంది. ఫోన్ బ్యాక్ ప్యానెల్‌లోని ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 200MP Samsung ISOCELL HP6 ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. అలానే 16MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

Tags

Related News

రూ.6 వేలకే ఇలాంటి హోమ్ థియేటరా.. భారత్‌లోకి పోర్ట్రానిక్స్ సరికొత్త సౌండ్ సిస్టమ్!

అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?

Airtel యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ప్రచారంలో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన టెలికాం దిగ్గజం

కొత్త Air Purifier కొనేముందు తప్పక చూడాల్సిన 5 ముఖ్యమైన ఫీచర్లు ఇవే!

ఈ స్మార్ట్‌వాచ్ దెబ్బకు మార్కెట్ షేకవ్వాల్సిందే.. భారీ అప్‌గ్రేడ్‌తో Galaxy Watch 9!

ఛార్జర్ లేదా? డోంట్ వర్రీ.. ఫోన్ బ్యాటరీ ఫుల్ చేయడానికి ఈ ఒక్క కేబుల్ చాలు!

అమెజాన్ బంపరాఫర్.. ‘వన్‌ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!

Big Stories

Advertisement
×