E-Paper
Advertisement

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

Vivo T3 Ultra: భారతదేశంలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వివో ఫోన్‌ది ప్రత్యేక శైలి. కొత్త ఫోన్లను అతి తక్కువ ధరలో అందించడంలో ఈ కంపెనీ ఎప్పుడూ ముందుంటుంది. సామాన్యులను దృష్టిలో పెట్టుకుని అదిరిపోయే ఫీచర్లతో కొత్త మొబైళ్లను దేశీయ మార్కెట్‌లో పరిచయం చేస్తుంది. ఇందులో భాగంగానే Vivo గతవారం భారతీయ మార్కెట్లో Vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. రిలీజ్ అనంతరం ఈ ఫోన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫోన్ సేల్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు.

ఈ తరుణంలో ఫోన్ సేల్‌కి వచ్చేసింది. సెప్టెంబర్ 19 నుండి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్‌లలో దేశంలో సేల్‌కి అందుబాటులోకి వచ్చింది. Vivo T3 Ultra 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అమర్చారు. Vivo T3 Ultra ధర, ఆఫర్‌లు, దాని స్పెసిఫికేషన్‌ల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Vivo T3 Ultra Specifications

Vivo T3 Ultra స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 2800×1260 పిక్సెల్‌ల 1.5K రిజల్యూషన్‌తో వస్తుంది. అదే సమయంలో 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇంకా 480Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ పొందింది. అలాగే 4500 nits పీక్ + బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇది Immortalis-G715 GPUతో కూడిన ఆక్టా కోర్ Mediatek డైమెన్సిటీ 9200+ 4nm ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8GB / 12GB LPDDR4X RAM + 128GB / 256GB ఇంబిల్ట్ స్టోరేజ్ ఉంది.

అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారిత Funtouch OS 14లో పనిచేస్తుంది. ఫోన్‌లో సేఫ్టీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5500mAh బ్యాటరీని అందించారు. ఇక కెమెరా సెటప్ విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ZEISS ఆప్టిక్స్, OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ SONY IMX921 కెమెరాను కలిగి ఉంది. అలాగే 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఇక ముందు భాగంలో 50-మెగాపిక్సెల్ ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.  వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం ఈ ఫోన్ IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, Dual 4G VoLTE, WiFi 6, బ్లూటూత్ 5.3, GPS వంటి పోర్ట్‌లు ఉన్నాయి.

Vivo T3 Ultra Price

Vivo T3 Ultra మొత్తం మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999 గా ఉంది. అదే సమయంలో 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,999, 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే దీనిపై భారీ బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి.

HDFC బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే ఫ్లాట్ రూ. 3000 తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపుతో వివో టి3 అల్ట్రా 5జీ ఫోన్ ధర మరింత తగ్గుతుంది. ఇది కాకుండా నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది. దాదాపు 6 నెలల పాటు అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×