BigTV English

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Tirumala Prasadam row: తిరుమల ప్రసాదం వ్యవహారంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయిందా? నెక్ట్స్ చంద్రబాబు సర్కార్ ఏం చేయబోతోంది? ఎవరిపై వేటు వేయబోతోంది? టీటీడీ ఛైర్మన్లపైనా లేక ఈవోల పైనా? వాళ్ల కెరీర్ ముగిసినట్టేనా?  శారదా పీఠం ఎందుకు సైలెంట్‌గా ఉంది?  దేశవ్యాప్తంగా దీనిపై చర్చపైనే జరుగుతోంది.


తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపిన వార్తలపై అయోధ్యలోని రామజన్మభూమి ట్రస్ట్ రియాక్ట్ అయ్యింది. శ్రీరామ్ ప్రధాన పూజారి ఆచార్య సతేంద్ర దాస్ ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు. దీనిపై తన మనసులోని బాధను వ్యక్తం చేశారాయన.

ఇది ముమ్మాటికీ సనతన ధర్మంపై జరిగిన కుట్రగా వర్ణించారాయన. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా చూడాలన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసే ఘటనగా పేర్కొన్నారు. దీనిపై అంతర్జాతీయంగా కుట్ర జరిగిందా? లేక దేశంలోనే జరిగిందా? అనేదానిపై దర్యాప్తు జరగాలని, దోషులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నది ఆయన ప్రధాన డిమాండ్.


మరోవైపు టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు నోరు విప్పారు. ప్రసాదాల నాణ్యత విషయంలో ఎన్నోసార్లు ఛైర్మన్, ఈవో దృష్టికి తెచ్చానన్నారు. శ్రీవారి ప్రసాదాల్లో జంతువుల కొవ్వును వినియోగించడం అపచారంగా వర్ణించారు.

ALSO READ: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

గత ఐదేళ్లు మహా పాపం జరిగిందంటూ మీడియో ముందు గోడు వెల్లబోసుకున్నారాయన. ల్యాబ్ రిపోర్ట్ చూశానని, జంతువుల కొవ్వు ఉన్నట్లు తేలిందన్నారు. నందిని డెయిరీ నెయ్యిని వినియోగించు కునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభంగా పేర్కొన్నారు.

2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ రమణ దీక్షితుల హవా కొనసాగింది. 2021లో ఆయనను టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించింది ప్రభుత్వం. దాదాపు మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వరకు ఆ పదవిలో ఉన్నారు.

ప్రసాదం వ్యవహారం ఆయన మెడకు చుట్టుకుంటుందా? తనపై రాకుండా ఉండేందుకు మీడియా ముందుకొచ్చారా? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో రైజ్ అవుతున్నాయి. గతంలో చంద్రబాబు సర్కార్ లో పింక్ డైమండ్ కోసం దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపారాయన. ఆ విషయాన్ని అప్పటి ప్రతిపక్ష నేత జగన్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఆయనకు టీటీడీ పదవి ఇచ్చిన విషయం తెల్సిందే.

మరోవైపు విశాఖ శారదా పీఠాదిపతి స్వరూపానందేంద్ర స్వామి విషయానికొద్దాం. వైసీపీ ప్రభుత్వంలో ఈ స్వామిదే హవా. ప్రతీనెలా జగన్ శారదా పీఠానికి వచ్చిన స్వామి ఆశీస్సులు తీసుకునేవారు. దీని వెనుక చాలా తతంగం ఉందని పొలిటికల్ సర్కిల్స్‌లో రకరకాల వార్తలు లేకపోలేదు.

గతంలో ఈ స్వామి తిరుమల వచ్చారంటే అధికారులు హడలిపోయేవారు. తిరుమలలో అడుగుపెట్టిన నుంచి వెళ్లే వరకు అధికారులు టెన్షన్ పడేవారు. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి కేవలం 45 నిమిషాల్లో చేరుకునేవారట. ఆయన ఎంత వేగంగా ట్రావెల్ చేశావారో అర్థం చేసుకోవచ్చు. తిరుమల ప్రసాదం వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత శారదా పీఠం నుంచి ఎలాంటి  రియాక్షన్ రాలేదు. ఇందులో స్వామి వాటా ఉందా అనే టాక్ జోరుగా సాగుతోంది.

 

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×