E-Paper
Advertisement

Vivo T5 5G 2026 Smartphone: వివో టి5 5జి త్వరలో లాంచ్.. ఫీచర్లు ఒక్కసారి చూడండి

Vivo T5 5G 2026 Smartphone: వివో టి5 5జి త్వరలో లాంచ్.. ఫీచర్లు ఒక్కసారి చూడండి
Advertisement

Vivo T5 5G 2026 Smartphone: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ప్రత్యేక గుర్తింపుతో ముందుకు సాగుతున్న సంస్థల్లో వివో ఒకటి. వినియోగదారుల అవసరాలను తగినట్లు, వారికి అనుకూలంగా కొత్త మోడల్లలో తీసుకొచ్చిన ఈ బ్రాండ్‌కు ఉన్న ప్రధాన బలం. కెమెరా నాణ్యత నుంచి డిస్‌ప్లే పనితీరు వరకు వివో వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా నిలబెట్టు కుంది. ఇప్పుడు సరికొత్తగా వివో టి5 5జిని టెక్ ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్దమైంది. దీని వివరాలు, ఫీచర్లు గురించి తెలుసుకుందాం.

అమోలేడ్ డిస్‌ప్లే

Advertisement

ఈ మోడల్‌లో 6.67 ఇంచుల అమోలేడ్ డిస్‌ప్లేను ఉపయోగించారు. 120Hz రిఫ్రెష్ రేట్ వలన డిస్‌ప్లేలో కనిపించే ప్రతి కదలిక కూడా ఎంతో మృదువుగా, సున్నితంగా ఉంటుంది. ఫుల్ హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్ విజువల్స్‌ను మరింత స్పష్టంగా చూపిస్తుంది. బయటి వాతావరణంలో కూడా స్పష్టంగా కనిపించేందుకు 2000 నిట్స్ ప్రకాశం ఉపయోగపడుతుంది. 480Hz టచ్ రెస్పాన్స్ వలన గేమింగ్ సమయంలో డివైస్ వెంటనే స్పందిస్తుంది. వాటర్‌డ్రాప్ నాచ్ ఉన్నప్పటికీ మొత్తం డిస్‌ప్లే భాగం అప్‌డేటెడ్ లుక్‌ పూర్తిగా నిలబెట్టుకుంటుంది.

స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్

Advertisement

పనితీరు విషయానికి వస్తే స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్ ఈ ఫోన్ యొక్క గుండె. ఈ ప్రాసెసర్ వేగవంతమైన పనితీరు, స్థిరమైన సామర్థ్యం కోసం రూపొందించబడింది. భారీ అనువర్తనాలు, యాప్‌ల మధ్య వేగంగా మారడం, మధ్యస్థాయి గేమింగ్ ఏదైనా చేసినా డివైస్ ఆలస్యం లేకుండా స్పందిస్తుంది. 8జిబి ర్యామ్‌తో పాటు అదనంగా 8జిబి విస్ట ర్యామ్ ఇవ్వడం పరికరాన్ని మరింత వేగంగా మారుస్తుంది. నిల్వ స్థలంగా ఉన్న 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ వినియోగదారులకు తగినంత ఫోటోలు, వీడియోలు, ఫైళ్ళను నిల్వ చేయడానికి సరిపోతుంది.

కేక పుట్టిస్తున్న కెమెరా

కెమెరా వ్యవస్థలో వివో తన ప్రత్యేకతను చూపుతుంది. వెనుక భాగంలో 50ఎంపి ప్రధాన కెమెరా, 8ఎంపి లోతు గుర్తించే లెన్స్, 13ఎంపి అదనపు లెన్స్ ఇవి అంతా కలిసి ఏ వెలుతురు ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా క్లిరిటీగా ఉండే విధంగా చిత్రాలు అందిస్తాయి. రాత్రి సమయంలో కూడా ఫోటోలు ఫుల్ క్లారిటీతో తగ్గకుండా నైట్ మోడ్ పని చేస్తుంది. పోర్ట్రెయిట్ మోడ్, డ్యూయల్ వ్యూ వీడియో, ప్రో మోడ్ వంటి అవకాశాలు ఫోటోలను, వీడియోలను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. ముందుభాగంలోని 32ఎంపి కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ అన్నీ కూడా క్లారిటీగా కనిపించే విధంగా తయారు చేశారు.

Also Read: Samsung Galaxy S25 Edge: 200 మెగాపిక్సెల్స్ అంటే ఏమిటో చూపించిన ఫోన్.. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ రివ్యూ

సూపర్ కనెక్టివిటీ

కనెక్టివిటీ అంశంలో ఈ ఫోన్ 5జి, 4జి వోల్ట్, డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వి5.4 వంటి అన్ని ఆధునిక అవకాశాలను కలిగి ఉంది. జిపిఎస్, గ్లోనాస్, బీడౌ, గెలీలియో వంటి నావిగేషన్ వ్యవస్థలు వినియోగదారుల స్థానాన్ని ఖచ్చితంగా చూపేందుకు సహాయపడతాయి. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి రెండు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా 3.5mm ఆడియో జాక్‌ను కూడా ఉంచడం వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా చేశారు.

బ్యాటరీ 7500mAh

ఈ ఫోన్‌లోని అత్యంత పెద్ద శక్తి దాని బ్యాటరీ. 7500mAh బ్యాటరీ పవర్ కెపాసిటీ ఉన్నందున ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజు మొత్తం కూడా నిలబడగలదు. గేమింగ్, వీడియోలు, సోషల్ మీడియా అన్నీ ఎంతసేపైనా ఉపయోగించినా బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుందనే భయం ఉండదు. అదనంగా 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఉండటం డివైస్‌ను కొన్ని నిమిషాల్లోనే తిరిగి సిద్ధం చేస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్  ఆండ్రాయిడ్ 16

ఆపరేటింగ్ సిస్టమ్ విషయంలో ఆండ్రాయిడ్ 16 ఆధారంగా నడిచే ఫన్‌టచ్ ఆపరేటింగ్ సిస్టమ్ 16 వేగంగా స్పందించే ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. అనవసరమైన యాప్‌లు లేకుండా, అవసరమైన ఫీచర్లు వినియోగదారుకు సులభంగా చేరేలా ఈ సిస్టమ్ రూపొందించబడింది.

ధర, లాంచింగ్ డేట్

ఆగస్టు 11, 2026న మార్కెట్లోకి రాబోతున్న వివో టి5 5జి, శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో పాటు అప్‌డేటెడ్ లుక్‌ను అందిస్తూ ఈ వర్గానికి కొత్త స్థాయిని తీసుకురానుందని అంచనా. ధరపై కంపెనీ ఇంకా అధికారిక స్పష్టత ఇవ్వలేదు. మీరు గేమర్ అయినా, విద్యార్థి అయినా, ఉద్యోగి అయినా రోజువారీ అవసరాల నుంచి భారమైన పనుల వరకు వినియోగదారులు కోరుకు ఒక మంచి పర్‌ఫెక్ట్ ఫోన్ అని చెప్పొచ్చు.

Related News

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

Big Stories

Advertisement
×