Vivo T5 Pro 5G: వీవో T5 సిరీస్‌లో రెండో ఫోన్‌గా T5 ప్రో 5Gని బుధవారం భారత మార్కెట్ లో లాంచ్ అయింది. ఏప్రిల్ 21న ఫ్లిప్ కార్ట్, వీవో ఆన్‌లైన్ స్టోర్ లో సేల్స్ స్టార్ట్ అవుతాయి. న్యూ వీవో T5 ప్రో 5G టు కలర్స్, త్రీ RAM, స్టోరేజీ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. 9,020mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా ఉండే ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కామ్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
వీవో టీ5 ప్రో 5జీ బేస్ వేరియంట్ ధర రూ. 29,999 నుంచి స్టార్ అవుతుంది. ఇందులో 8GB RAM, 128GB స్టోరేజీ ఉంటుంది. ఇందులో, హై ఎండ్ 8GB RAM + 256 GB స్టోరేజీ కాన్ఫిగరేషన్ ధర రూ. 33,999గా ఉంది. చివరగా, 12GB RAM, 256 GB స్టోరేజీ ఫోన్ ధర రూ. 39,999. అయితే హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు కార్డులపై రూ. 3,000 వరకు బ్యాంకు డిస్కౌంట్, ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లను అందిస్తోంది. వీవో ఫోన్లపై రూ. 3,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తుంది. ఈ కొత్త హ్యాండ్‌సెట్ ఏప్రిల్ 21 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, వీవో ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్ సెట్ కాస్మిక్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ రంగులలో లభిస్తుంది.
వీవో T5 ప్రో 5G ఆండ్రాయిడ్ 16 బేస్డ్ కలర్‌ఓఎస్ 16 పై పనిచేసే డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్. ఈ ఫోన్‌లో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే స్క్రీన్ ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్, 2,160Hz PWM డిమ్మింగ్, 449 ppi పిక్సెల్ డెన్సిటీ, స్లీప్ కంఫర్ట్ మోడ్, యాంటీ మోషన్ సిక్‌నెస్ మోడ్‌తో బ్లూ లైట్, ఫ్లికర్ సర్టిఫికేషన్‌లతో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 + IP69 రేటింగ్‌లతో వస్తుంది.
ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్‌సెట్
వేపర్ ఛాంబర్ (VC) కూలింగ్ సిస్టమ్
12GB RAM, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్
ఈ హ్యాండ్ సెట్ డ్యూయల్ రియర్ కెమెరాతో లభిస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2-మెగాపిక్సెల్ బోకె కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్, బ్యాక్ కెమెరాలతో 4K వీడియోలను రికార్డు చేయవచ్చు. ఈ హ్యాండ్ సెట్ లో 9,020mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉంది. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్‌బీ టైప్ సి పోర్ట్‌ను సపోర్టు చేస్తుంది.