E-Paper
Advertisement

వరుణ్ తేజ్ కి ప్రమాదం..స్పందించిన నిహారిక..సర్జరీ సక్సెస్ అంటూ

వరుణ్ తేజ్ కి ప్రమాదం..స్పందించిన నిహారిక..సర్జరీ సక్సెస్ అంటూ
Advertisement

Niharika: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై ఈమె ఇప్పటికే రెండు సినిమాలను నిర్మించగా ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక మూడో సినిమా తన అన్నయ్య వరుణ్ తేజ్ (Varun Tej)తో ప్రకటించిన సంగతి తెలిసిందే. బరి (Bhari)అనే టైటిల్ తో ఈ సినిమా వాలీబాల్(Volley Ball) నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలియజేశారు అయితే ఈ సినిమా షూటింగ్స్ త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు.

వరుణ్ తేజ్ మోకాలికి ఫ్రాక్చర్..

ఇలా వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈయన ప్రమాదానికి గురి అయ్యారని ఈ ప్రమాదం కారణంగా తన మోకాలికి చిన్న ఫ్రాక్చర్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. అయితే తాజాగా ఈ విషయంపై నిహారిక(Niharika) అధికారకంగా స్పందించారు. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ అధికారక సోషల్ మీడియా ఖాతా నుంచి ఈ విషయం పట్ల స్పందిస్తూ.. అన్నయ్య వరుణ్ తేజ్ బరి సినిమా కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మోకాలికి చిన్న ఫ్రాక్చర్ అయ్యిందని తెలిపారు.

వరుణ్ తేజ్ సర్జరీ సక్సెస్..

Advertisement

ఇక ప్రస్తుతం ఈయనకు సర్జరీ జరిగిందని సర్జరీ కూడా సక్సెస్ ఫుల్ అయిందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలు వరుణ్ తేజ్ ఉన్నారని తెలిపారు. త్వరలోనే తన అన్నయ్య ఆరోగ్యంగా తిరిగి వస్తారని ఈమె ఆశిస్తున్నట్లు తెలిపారు. అలాగే తన అన్నయ్యకు ప్రమాదం జరిగిందనే విషయం తెలిసినటువంటి అభిమానులు చూపించిన ప్రేమ వారికి మద్దతుగా నిలిచిన వారందరికీ ఈ సందర్భంగా ఈమె ధన్యవాదాలు తెలియజేశారు. వరుణ్ తేజ్ కు జరిగిన ప్రమాదం గురించి నిహారిక అధికారికంగా తెలియజేయడంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అభిమానులు వరుణ్ తేజ్ గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం కొరియన్ కనకరాజు అనే సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు తన చెల్లెలు నిహారిక నిర్మాణంలో కమిటీ కుర్రాళ్ళు సినిమా దర్శకుడు యదు వంశీ దర్శకుడిగా బరి అనే సినిమాని ప్రకటించి ఇటీవల ఘనంగా పూజా కార్యక్రమాలను జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ ఇలా ప్రమాదానికి గురి కావడంతో కొద్దిరోజులు ఆలస్యంగానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా గ్రామీణ క్రీడా నేపథ్యంలో ఉండబోతుందని, అదే విధంగా ఈ సినిమాని 2027 సంక్రాంతి బరిలో రాబోతుందని నిహారిక తెలియజేశారు.

Also Read: షూటింగ్ మొదలవ్వకుండానే ఓటీటీ డీల్ క్లోజ్.. అనిల్ రావిపూడి అన్ స్టాపబుల్ క్రేజ్!

Related News

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

ఎవరీ సాత్విక.. ఒక్క టీజర్ తోనే ఊహించని క్రేజ్!

Big Stories

Advertisement
×