E-Paper
Advertisement

Vivo Y38 5G : వివో నుంచి బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు మాములుగా లేవు మామ

Vivo Y38 5G : వివో నుంచి బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు మాములుగా లేవు మామ
Advertisement

Vivo Y38 5G : వివో ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీల్లో ఒకటి. కంపెనీ త్వరలోనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. 5G సెగ్మెంట్‌లో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తున్నట్లు వివో వెల్లడించింది. 5G నెట్వర్క్ వినియోగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో Vivo Y38 5Gని మిడ్ రేంజ్‌బడ్జెట్‌లో మార్కెట్‌లోకి తీసుకురానున్నారు. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకోండి.

Vivo కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo Y38 5G త్వరలో మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 5G స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ SIGలో రావచ్చు. అంతేకాకుండా ఫోన్ CQC, బెంచ్‌మార్క్ ప్లాట్‌ఫారమ్ గీక్‌బెంచ్ నుండి సర్టిఫికేషన్ పొందింది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ 5.1 తో రాబోతోంది. ఫోన్‌లో 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

Advertisement

Also Read : నాలుగు 50MP కెమెరాలతో షియోమీ స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్!

ఈ న్యూ స్మార్ట్‌ఫోన్ Qualcomm చిప్‌సెట్‌తో వస్తోంది . ఇది Snapdragon 4 Gen 2 SoCపై రన్ అవుతుంది. 8GB ర్యామ్ ఉంటుంది.  ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో రాబోతోంది. స్కోర్‌ల గురించి మాట్లాడితే.. సింగిల్ కోర్ టెస్ట్‌లో ఫోన్ 3092 పాయింట్లు సాధించగా, మల్టీకోర్ టెస్ట్‌లో 7035 పాయింట్లు సాధించింది.

Advertisement

ఇంటర్నెట్‌లోని సమచారం ఆధారంగా.. Vivo Y38 5G స్మార్ట్‌ఫోన్ మే నెలలో లాంచ్ కావచ్చు.  ఫోన్ Vivo Y28 5G సక్సెసర్‌గా వివో ఇండియా వెల్లడించింది. Vivo Y28 5G స్మార్ట్‌ఫోన్ 6.56 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది HD+ రిజల్యూషన్‌ను అందిస్తుంది. దీని రిఫ్రెష్ రేట్ 90Hzగా ఉంది. ఫోన్ వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్‌ని కలిగి ఉంది. ఫోన్‌లో MediaTek డైమెన్షన్ 6020 SoC ఉంది. దీనితోపా టుగా 8 GB వరకు RAM అందించబడుతుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌‌పై నడుస్తుంది. దీనిపై ఫన్‌టచ్ ఓఎస్ 13 లేయర్ ఉంటుంది.

Also Read : శ్యామ్‌సంగ్ నుంచి సరికొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే!

ఇక Vivo Y38 5G స్మార్ట్‌ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. అంతేకాకుండా  2MP సెకండరీ కెమెరా కూడా ఉంది. అద్భుతమైన సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమోరా ఉంది.  ఈ ఫోన్ 5000mAh పవర్‌ఫుల్ బ్యాటరీని కలిగి ఉంది.  ఫోన్ ధర గురించి ఎటువంటి వివరాలు కంపెనీ వెల్లడించలేదు.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×