E-Paper
Advertisement

Vivo 5G Smartphone: ప్రీమియం ఫీచర్లతో వివో ఎక్స్200ఎఫ్‌ఈ ఎంట్రీ… ఈ ఫోన్‌కి బ్యాటరీనే హైలెట్ రా మావా..

Vivo 5G Smartphone: ప్రీమియం ఫీచర్లతో వివో ఎక్స్200ఎఫ్‌ఈ ఎంట్రీ… ఈ ఫోన్‌కి బ్యాటరీనే హైలెట్ రా మావా..
Advertisement

Vivo 5G Smartphone: వివో సంస్థ ఇటీవల విడుదల చేసిన ఎక్స్200ఎఫ్ఈ 5జి (Vivo X200FE 5G) స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫోన్ ముఖ్యంగా స్పీడ్, కెమెరా, డిస్‌ప్లే అనుభవం, బ్యాటరీ బ్యాకప్‌ వంటి నాలుగు కీలక అంశాలలో భారీ స్థాయిలో అప్‌గ్రేడ్‌ను అందిస్తూ, మిడ్‌రేంజ్ విభాగంలో వినియోగదారుల దృష్టిని మొత్తం ఆకర్షిస్తోంది. యువత ఎక్కువగా కోరుకునే అప్‌డేటెడ్ లుక్, పవర్‌ఫుల్ బ్యాటరీ అన్ని అవసరాలకూ ఎక్స్200ఎఫ్ఈ 5జి సరైన సమాధానంగా నిలిచింది.

డిజైన్ విషయానికి వస్తే..

Advertisement

డిజైన్ విషయానికి వస్తే, ఫోన్ చాలా స్లిమ్‌గా, అప్‌డేటెడ్ లుక్‌తో ఉంటుంది. వెనుక భాగం గ్లాస్ ఫినిష్‌తో రూపొందించబడింది కాబట్టి ఇది చేతికి ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఆకర్షణీయమైన కెమెరా మాడ్యూల్ డిజైన్ పాయింట్‌లో కూడా దీనిని ముందు ఉంచుతుంది.

6.67 అంగుళాల అమోలేడ్ డిస్‌ప్లే

Advertisement

ఇక డిస్‌ప్లే గురించి మాట్లాడితే, ఇందులో 6.67 అంగుళాల అమోలేడ్ డిస్‌ప్లే ఇచ్చారు. దీని ద్వారా స్క్రీన్ విజువల్స్ చాలా ప్రీమియంగా, రంగులు అత్యంత స్పష్టంగా కనిపిస్తాయి. వీడియోలు చూసినా, హై-గ్రాఫిక్స్ గేమ్స్ ఆడినా ప్రతి ఫ్రేమ్ చాలా క్లీన్‌గా, స్పష్టంగా కనిపిస్తుంది. ఎండలో కూడా స్క్రీన్ లైటింగ్ తగ్గిపోవడం ఉండదు.

12జిబి ర్యామ్ సామర్థ్యం

పర్‌ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్‌లో కొత్త జనరేషన్ ప్రాసెసర్‌ను అమర్చారు, కాబట్టి ఫోన్ వేడెక్కే సమస్య కనిపించదు. గంటల తరబడి గేమ్ ఆడినా ల్యాగ్, హీట్, ఫ్రేమ్ డ్రాప్ వంటి సమస్యలు ఉండవు. అలాగే, దీనిలో 12జిబి ర్యా్మ్ సామర్థ్యం ఉంది. ఇంత పెద్ద ర్యామ్ ఉండటం వలన పెద్ద యాప్‌లు లేదా వీడియో ఎడిటింగ్ వంటి పనులు చేసినా ల్యాగ్ కనిపించదు. స్టోరేజ్ కూడా తగినంతగా ఉంది. ముఖ్యంగా, దీని నెట్‌వర్క్ క్యాప్చరింగ్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది, 5జి స్పీడ్ చాలా వేగంగా ఉంటుంది.

Also Read: Infinix Smartphone: స్మార్ట్‌ఫోన్ లెవెల్ మార్చిన మోడల్… 7700mAh బ్యాటరీతో ఇన్ఫినిక్స్ స్ట్రాంగ్ ఎంట్రీ

సూపర్ కెమెరా

కెమెరా సెక్షన్‌కి వస్తే, చేతిలో పట్టుకుని క్లిక్ చేయగానే క్లారిటీ ఫోటోలు వచ్చేలా కెమెరా సెటప్‌ని ఇచ్చారు. డే టైమ్‌లో ఫొటోలు తీస్తే కలర్స్ ఓవర్‌గా కాకుండా, ఫేడ్‌గా కాకుండా, బాలెన్స్‌డ్‌గా వస్తాయి. స్కిన్ టోన్స్ కూడా ఎక్కువగా ఆర్టిఫిషియల్‌గా కాకుండా సహజంగా చూపించే విధంగా డిజైన్ చేశారు. హ్యాండ్ షేక్ ఉన్నా కూడా ఫోటోలు బ్లర్ కాకుండా ఉండటానికి స్టెబిలైజేషన్ బాగా హెల్ప్ అవుతుంది. లో లైట్‌లో కూడా కెమెరా పనితనం మెరుగ్గా ఉంది.

6500mAh పవర్‌ఫుల్ బ్యాటరీ

ఈ ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణ 6500mAh పవర్‌ఫుల్ బ్యాటరీ. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజు మొత్తం వాడుకున్నా సాయంత్రం వరకు బ్యాకప్ ఉంటుంది. యూట్యూబ్ చూసినా, గేమింగ్ చేసినా, సోషల్ మీడియా స్క్రోలింగ్ చేసినా లో పవర్ ఫీల్ ఉండదు. వేగంగా ఛార్జ్ అయ్యే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది.

అందుబాటులో ధర

వివో ఎక్స్200ఎఫ్ఈ 5జి (Vivo X200FE 5G) స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్‌లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ సిరీస్‌లో బేస్ వేరియంట్ అయిన 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజ్ మోడల్ ధరను రూ. 20,999 గా నిర్ణయించారు. మధ్యస్థాయి వేరియంట్ అయిన 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజ్ ధర రూ. 29,999 కాగా, హై-ఎండ్ వేరియంట్ అయిన 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ. 37,999 గా అందుబాటులో ఉంది. డైలీ వర్క్ ఎక్కువగా చేసే ఉద్యోగులకు, ఆల్ టైం ఆన్‌లైన్‌లో ఉండే స్టూడెంట్స్, ట్రావెలర్స్, కంటెంట్ క్రియేటర్స్ అందరికీ ఈ ఫోన్ బెస్ట్ ఎంపిక అవుతుంది.

Related News

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

Big Stories

Advertisement
×