E-Paper
Advertisement

Vivo X300 5G Price Drop: ఫొటోగ్రఫీ లవర్స్‌‌కు అద్భుతమైన అవకాశం.. వివో కెమెరా ఫోన్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్!

Vivo X300 5G Price Drop: ఫొటోగ్రఫీ లవర్స్‌‌కు అద్భుతమైన అవకాశం.. వివో కెమెరా ఫోన్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్!

Vivo X300 5G Price Drop: హై క్వాలిటీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుచ్చే బ్రాండ్ వివో. ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్‌లో కంపెనీ విడుదల చేసే కొన్ని మోడళ్లు DSLR స్థాయి ఫొటోగ్రఫీ అనుభూతిని అందిస్తాయి. ఇప్పుడు అలాంటి ఓ హైఎండ్ ఫోన్‌పై భారీ ధర తగ్గింపు అందుబాటులోకి వచ్చింది.

Vivo X300 5G స్మార్ట్‌ఫోన్‌పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ధర తగ్గింపుతో ప్రీమియం ఫోన్ కొనాలని చూస్తున్నవారికి ఇదొక గొప్ప డీల్‌గా చెప్పవచ్చు. ఈ ఫోన్‌పై రూ.7,600 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో పాటు, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై అదనపు ఆఫర్లు కూడా ఉన్నాయి.

ఈ వివో X300 5G వెనుకవైపు ZEISS బ్రాండింగ్‌తో కూడిన 200MP ప్రైమరీ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే, వివో ZEISS 2.35x టెలిఫొటో ఎక్స్‌టెండర్‌ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. అలాగే 6040mAh భారీ బ్యాటరీ, 90W ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది డ్యూయల్ చిప్‌సెట్ టెక్నాలజీ కారణంగా రోజువారీ వినియోగంతో పాటు గేమింగ్‌లోనూ మెరుగైన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.

వివో X300 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో ప్రస్తుతం రూ.75,999 ధరకు లభిస్తోంది. ఇది 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్. HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లేదా HDFC క్రెడిట్ కార్డులతో చెల్లింపు చేస్తే ఫ్లాట్ రూ.7,600 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

ఈ ఫోన్ సమ్మిట్ రెడ్, ఎలైట్ బ్లాక్, మిస్ట్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అదనంగా, పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే గరిష్టంగా రూ.51,900 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. అయితే ఈ ఎక్స్‌ఛేంజ్ విలువ ఫోన్ బ్రాండ్, కండిషన్, ప్లాట్‌ఫామ్ పాలసీలపై ఆధారపడి ఉంటుంది.

వివో X300 5Gలో 200MP ZEISS సూపర్ మెయిన్ కెమెరా ఉంది. ఇది తక్కువ కాంతిలోనూ అద్భుతమైన డీటెయిల్స్, ఎడ్జ్ టూ ఎడ్జ్ షార్ప్‌నెస్‌ను అందిస్తుంది. పెద్ద 1/1.4 అంగుళాల సెన్సార్, OIS, 16-in-1 పిక్సెల్ బిన్నింగ్, ZEISS T కోటింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే 50MP అల్ట్రా వైడ్, 50MP ZEISS పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాలు ఉన్నాయి. ఇవి 20x టెలిఫొటో మాక్రోతో పాటు మెరుగైన కలర్ అక్యూరసీని అందిస్తాయి.

ఇక ఈ ఫోన్ డిస్‌ప్లే విషయానికి వస్తే.. దీనిలో 6.31 అంగుళాల ఫ్లాట్ LTPO AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 4500 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్, అల్ట్రా స్లిమ్ బెజెల్స్‌, కంటి భద్రత కోసం ప్రత్యేక డిమ్మింగ్ టెక్నాలజీతో ప్రీమియం విజువల్ అనుభూతిని ఇస్తుంది. పెర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 9500 V3+ ప్రాసెసర్, LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ ఉన్నాయి. అలాగే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి హైఎండ్ ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×