E-Paper
Advertisement

Raju Weds Rambai OTT : ఓటీటీలో భారీ వ్యూస్ తో తుక్కురేగ్గొడుతున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’

Raju Weds Rambai OTT : ఓటీటీలో భారీ వ్యూస్ తో తుక్కురేగ్గొడుతున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’
Advertisement

Raju Weds Rambai OTT : చిన్న సినిమాగా వచ్చి దుమ్మురేపిన ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమా ఈరోజు మన మూవీ సజెషన్. ఈ సినిమా బిగ్ స్క్రీన్ పైనే కాదు ఓటీటీలోనూ అదరగొడుతోంది. రిలీజ్ అయ్యింది మొదలు ట్రెండింగ్ లోకి వచ్చింది. అంతేనా తాజాగా వ్యూస్ పరంగా ఓ మైలురాయిని దాటింది. మరి ఇంతకీ ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డు ఏంటి ? ఆ మూవీ కథేంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.

ఈటీవీ విన్ లో అందుబాటులో

తెలుగు సినిమాల్లో లో బడ్జెట్ మూవీస్ కూడా సంచలనాలు సృష్టిస్తున్నాయి కదా. అలాంటి ఒక స్మాల్ బడ్జెట్ జెమ్ ‘రాజు వెడ్స్ రాంబాయి’. నిజ జీవిత ఘటనల ఆధారంగా వచ్చిన రొమాంటిక్ డ్రామా ఇది. థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు చాలా మందికి తెలియకపోయినా, పాజిటివ్ మౌత్‌ టాక్ తో దూసుకుపోయింది. కేవలం 2.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 20 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు OTTలో స్ట్రీమింగ్ అవుతూ మళ్లీ ట్రెండింగ్‌లో ఉంది. సాయిలు కాంపాటి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అఖిల్ రాజ్ (రాజు పాత్రలో), తేజస్విని రావు (రాంబాయి పాత్రలో) లీడ్ రోల్స్‌లో నటించారు. ప్రధాన విలన్‌గా చైతు జొన్నలగడ్డ (సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు) కనిపించాడు. ఇక ఇప్పుడు ఈటీవీ విన్ లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుండగా, 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలు దాటింది. ఏ-లిస్ట్ స్టార్స్ లేకుండా ఇంత హైప్ రావడం రికార్డే. అలాంటిది ఇలా భారీ వ్యూస్ తో ఈ మూవీ మరో మైలు రాయిని దాటింది.

Advertisement

Read Also :  తల్లీ కూతుర్లతో డెడ్లీ డెత్ గేమ్… సొంతింట్లోనే ఒళ్లు గగుర్పొడిచే సంఘటనలు… మగదిక్కు లేనింట్లో మతిపోగొట్టే క్రైమ్

స్టోరీలోకి వెళ్తే…

తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట చుట్టూ తిరుగుతుంది. రాజు అనే అబ్బాయి మ్యారేజ్ కి బ్యాండ్ కొడుతూ ఉంటాడు. మరోవైపు రాంబాయి కాంపౌండర్ కూతురు. రాంబాయి తండ్రి వెంకన్న ఖమ్మం-వరంగల్ సరిహద్దులోని ఒక మారుమూల గ్రామానికి చెందిన వాడు. సరదాగా ఉండే రాజు, రాంబాయిల మధ్య ప్రేమ చిగురిస్తుంది. రాంబాయి తండ్రి బ్యాండ్ కొట్టే వాడితో తన కూతురు రిలేషన్ ను అస్సలు ఒప్పుకోడు. గవర్నమెంట్ జాబ్ ఉన్నవాడికే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలనేది ఆయన ఆశ. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు వెంకన్న. ఈ విషయం తెలిసినప్పటికే రాజు – రాంబాయి ప్రేమించుకుంటారు. ఈ విషయం రాంబాయి తండ్రికి తెలిశాక కథ ఊహించని మలుపు తిరుగుతుంది. వెంకన్న రాజుతో పెళ్ళికి ఎందుకు అభ్యంతరం చెప్పాడు? తరువాత హీరో హీరోయిన్లు తీసుకున్న నిర్ణయాల పర్యవసానం ఏంటి? కథ ఎలా ముగుస్తుందనేది సినిమాలో చూడాల్సిందే. సినిమాలో పరువు హత్యలు, సామాజిక ఒత్తిడి, ఫ్యామిలీ డ్రామా ఇవన్నీ ఇంటెన్స్‌గా చూపించారు. చివరి అరగంటలో షాకింగ్ ట్విస్ట్ ఉంటుంది. అది ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఒక ఎమోషనల్ రోలర్‌కోస్టర్. థియేటర్లలో మిస్ అయిన వాళ్లకి ఓటీటీలో పర్ఫెక్ట్ ఛాన్స్.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×