E-Paper
Advertisement

Vivo X300 Series: వచ్చేనెల వివో కొత్తఫోన్లు లాంచ్.. జీస్ ట్రిపుల్ కెమెరా టెక్నాలజీతో పిచ్చెక్కించే క్లారిటీ!

Vivo X300 Series: వచ్చేనెల వివో కొత్తఫోన్లు లాంచ్.. జీస్ ట్రిపుల్ కెమెరా టెక్నాలజీతో పిచ్చెక్కించే క్లారిటీ!
Advertisement

Vivo X300 Series: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త. వచ్చే నెలలో వివో నుంచి.. వివో X300 5G, వివో X300 Pro 5G ఫోన్స్ లాంచ్ కానుంది. అదే రోజును ఈ ఫోన్ ధర, సేల్స్ సమాచారం వెల్లడవుతుందని సమాచారం. ఈ రెండు ఫోన్‌లను అక్టోబర్‌లో చైనాలో ఆవిష్కరించగా.. ఇప్పుడు భారతదేశంలో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు:

వివో X300 సిరీస్.. భారత్‌లో వచ్చేనెలలో విడుదల కానున్నట్లు కంపెనీ ప్రకటించింది. Vivo X300, Vivo X300 Pro లైనప్‌లోని 2 వేరియంట్‌లుగా ఉంటాయని అంచనా. ఈ రెండు ఫోన్లలో Zeiss ట్యూనింగ్‌తో ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు ఉన్నాయని ధృవీకరించారు. గతంలో కంపెనీ చైనాలో తన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక డిసెంబరులో విడుదల కానున్న.. X300 సిరీస్‌ను ప్రత్యేకమైన రెడ్ కలర్ ఎంపికలో కొనుగోలు చేయవచ్చని వివో కంపెనీ తెలిపింది.

నాణ్యతగల ఇమేజ్ క్వాలిటీ:

Advertisement

రాబోతున్న X300 సిరీస్ కోసం టెలిఫొటో ఎక్స్‌టెండర్ కిట్ గురించి కూడా కంపెనీ ప్రస్తావించింది. దీనితో వచ్చే జీస్ 2.35x టెలికాన్వర్టర్ లెన్స్ ఇమేజ్ క్వాలిటీని మిస్ చేయకుండా మరింత ఆప్టికల్ జూమ్‌ను అందిస్తుందట. ఈ కిట్ వేగంగా లెన్స్ గుర్తింపు, NFC మద్దతుతో డిజిటల్ యాక్టివేషన్, కెమెరా యాప్ టెలికాన్వర్టర్ మోడ్‌తో అనుకూలతను అందిస్తుంది. 3ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్, ప్రో ఇమాజింగ్ VS1, V3+ ఇమేజింగ్ ప్రాసెసర్లతో పాటు, భారత్‌లో Vivo X300 సిరీస్‌కు శక్తినిస్తుంది. ఈ X300 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేసే OriginOS 6పై రన్ అవుతాయని సంస్థ పేర్కొంది.

ఇతర వివరాలు ఇలా..

ఇక వివో X300 ప్రో.. ఫోన్లలో జీస్ ద్వారా ఆప్టిమైజ్ చేయబడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని తెలిపింది. దీనిలో 200-మెగాపిక్సెల్ HPB APO టెలిఫొటో కెమెరా, 50-మెగాపిక్సెల్ సోనీ LYT-828 ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ శాంసంగ్ JN1 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌ ఉంటుంది. 50-మెగాపిక్సెల్ శాంసంగ్ JN1 ఫ్రంట్-ఫేసింగ్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. అయితే, సాధారణ మోడల్ 50-మెగాపిక్సెల్ శాంసంగ్ JN1 అల్ట్రావైడ్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 200-మెగాపిక్సెల్ HPB మెయిన్ కెమెరా, OIS తో 50-మెగాపిక్సెల్ సోనీ LYT-602 టెలిఫొటో కెమెరాతో వివో X300 ప్రో రానుంది.

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×