E-Paper
Advertisement

Vivo Y18t – Y18i: బడ్జెట్ కింగ్ మేకర్స్.. వివో నుంచి రెండు స్మార్ట్‌‌ఫోన్లు ఆగయా..!

Vivo Y18t – Y18i: బడ్జెట్ కింగ్ మేకర్స్.. వివో నుంచి రెండు స్మార్ట్‌‌ఫోన్లు ఆగయా..!

Vivo Y18t – Y18i: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివోకి మార్కెట్‌లో క్రేజ్ మామూలుగా లేదు. వివో కంపెనీ నుంచి కొత్త ఫోన్ రిలీజ్ అవుతుందంటే చాలు ఫోన్ ప్రియులు ఎగబడి కొనేందుకు ముందుంటారు. అంతటి క్రేజ్ ఉంది మరి ఈ కంపెనీ ఫోన్లకు. అందువల్లనే వివో కూడా ఫోన్ ప్రియుల టేస్ట్‌కు తగ్గట్టుగా అదిరిపోయే ఫీచర్లు, కెమెరా సెన్సార్లతో బడ్జెట్ ధరలో కొత్త కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే చాలా ఫోన్లు రిలీజ్ చేసి మార్కెట్‌లో హవా కొనసాగిస్తోంది.

ముఖ్యంగా వివో ఫోన్ అంటే కెమెరా కోసమే కొనుక్కోవాలని అంతా భావిస్తుంటారు. అలాంటి క్వాలిటీ గల సెన్సార్‌లతో కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. ఇదిలా ఉంటే Vivo త్వరలో మరో రెండు కొత్త సరసమైన స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అవి Y18t, Y18i పేర్లతో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి గత కొంతకాలంగా కొన్ని లీక్‌లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఇటీవల IMEI డేటాబేస్‌లో గుర్తించబడ్డాయి. అయితే ఇప్పుడు ఆ రెండు ఫోన్లలో Vivo Y18iకి సంబంధించి మరికొన్ని లీక్‌లు బయటకొచ్చాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

Also Read: ఫోన్ల పండగ.. వివో నుంచి 5G ఫోన్లు.. ఈసారి మతిపోగొట్టారు!

Mysmartprice Vivo Y18i స్మార్ట్‌ఫోన్‌ను Geekbench, BIS, TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ ప్లాట్‌ఫారమ్‌ల వెబ్‌సైట్‌లో ఒకేసారి లిస్ట్ చేసింది. ఈ లిస్టింగ్‌లో కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లు కూడా వెల్లడయ్యాయి. Y18i స్మార్ట్‌ఫోన్ అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో మోడల్ నంబర్ V2414తో లిస్ట్ చేయబడింది. Geekbenchలో లిస్ట్ అయిన స్పెసిఫికేషన్ల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ 1.8GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో లిస్ట్ చేసింది. దీని ప్రకారం చూస్తే ఇది Unisoc T612 ప్రాసెసర్‌గా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

అంతేకాకుండా ఇది 4GB RAM తో టెస్ట్ చేయబడింది. అయినప్పటికీ ఈ ఫోన్ లాంచ్ సమయంలో ఎక్కువ RAM, అధిక స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లను కలిగి ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ Geekbench ప్లాట్‌ఫారమ్‌లో సింగిల్-కోర్, మల్టీ-కోర్ టెస్ట్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్ వరుసగా 419, 1,461 పాయింట్లను స్కోర్ చేసింది. ఇదిలా ఉంటే BIS, TUV, EE ప్లాట్‌ఫార్మ్‌లు మాత్రం Vivo Y18i గురించి ఎలాంటి సమాచారాన్ని అందించలేదు. ఇక ఈ స్పెసిఫికేషన్ల బట్టి ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా అంచనా వేయబడింది. ప్రస్తుతం కంపెనీ Vivo Y18i అలాగే Vivo Y18t గురించి ఎలాంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే రానున్న రోజుల్లో వీటి గురించి మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Tags

Related News

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాకర్లు ఎలా దొంగిలిస్తున్నారో తెలుసా?

ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా ‘నెట్‌ఫ్లిక్స్’ ఉచితం!

50MP కెమెరా, 6,500mAh బ్యాటరీతో Motorola Edge 70 Pro+ లాంచ్.. ధర వింటే షాకే!

డిజైన్ అదిరింది.. 5x పెరిస్కోప్ కెమెరాతో Xiaomi 17T లాంచ్, సేల్స్ ఎప్పటి నుంచంటే?

Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

Big Stories

×