BigTV English

SpiceJet staffer arrested: జైపూర్ ఎయిర్‌పోర్టు.. సీఐఎస్ఎఫ్ జవాన్ చెంప ఛెళ్లుమనిపించిన స్పైస్ జెట్ ఉద్యోగి..

SpiceJet staffer arrested: జైపూర్ ఎయిర్‌పోర్టు.. సీఐఎస్ఎఫ్ జవాన్ చెంప ఛెళ్లుమనిపించిన స్పైస్ జెట్ ఉద్యోగి..

SpiceJet staffer arrested: ఈ మధ్యకాలం ఎయిర్‌పోర్టులో రకరకాల ఘటనలు చోటు చేసుకుంటున్నా యి. తాజాగా స్పైస్ జెట్ ఉమెన్ ఉద్యోగి ఒకరు.. సీఐఎస్ఎఫ్ జవాన్‌ చెంప ఛెళ్లు మనిపించింది. ఆ ఘటనతో తోటి ఉద్యోగులు షాకయ్యారు. అసలేం జరిగిందంటే..


నిత్యం రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టులో జైపూర్ ఒకటి. అయితే ఎయిర్‌లైన్స్ సిబ్బందిని తప్పని సరిగా ఎంట్రీ గేట్ వద్ద స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుంది. డ్యూటీలో భాగంగా స్పైస్ జెట్ మహిళా ఉద్యోగిని ఏఎస్ఐ గిగిరాజ్ తనిఖీ చేయబోయారు. కాకపోతే ఆ సమయంలో మహిళా గార్డు ఎవరులేరు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు పట్టరాని కోపంతో మహిళా ఉద్యోగి రెచ్చిపోయింది.

ఈలోగా మహిళా జవాన్ వచ్చి ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా సరే పట్టరాని కోపంతో జవాన్ చెంప ఛెళ్లు మనిపించింది. ఈ ఘటనతో అక్కడున్నవారు షాకయ్యారు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఓ ట్రావెల్ తన సెల్‌ఫోన్‌లో ఈ సన్నివేశాన్ని రికార్డు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయ్యింది.


ALSO READ: మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదకు బిగ్ రిలీఫ్..నిర్దోషిగా ప్రకటన!

సీఐఎస్ఎఫ్ జవాన్‌పై చేయి చేసుకున్న స్పైస్ జెట్ ఉద్యోగి పేరు అనురాధ. ఈమె స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌ లో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. చివరకు జవాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనురాధను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఘటనపై స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ వాదన మరోలా ఉంది. మహిళా ఉద్యోగిని సీఐఎస్ఎఫ్ జవాన్ తనిఖీ చేయడం దురదృష్టకరమని తెలిపింది. ఆ సమయంలో మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురి చేశారని, ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ కంపెనీ వెర్షన్.

నెల రోజుల కిందట అంటే జూన్ ఆరున చండీఘర్ ఎయిర్‌పోర్టులో ఇలాంటి తరహా ఘటన జరిగింది. బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనారనౌత్‌ను ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ జవాను చెంప దెబ్బకొట్టిన విషయం తెల్సిందే. అప్పట్లో ఈ వ్యవహారంపై నానా రచ్చ జరిగింది.

 

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×