E-Paper
Advertisement

పర్పుల్ లుక్‌, 10,000mAh భారీ బ్యాటరీ.. అబ్బా ఏముంది మావా ఈ Vivo Y600 Pro స్మార్ట్‌ఫోన్!

పర్పుల్ లుక్‌, 10,000mAh భారీ బ్యాటరీ.. అబ్బా ఏముంది మావా ఈ Vivo Y600 Pro స్మార్ట్‌ఫోన్!
Advertisement

Vivo Y600 Pro: రోజంతా రీల్స్ స్క్రోల్ చేయాలన్నా, ఆన్‌లైన్ గేమ్స్ ఆడాలన్నా మొబైల్‌లో ఇంటర్నెట్ ఎంత అవసరమో.. ఛార్జింగ్ కూడా అంతే అవసరం కదా. ఇలాంటి వారి కోసం ప్రముఖ వివో సంస్థ సరికొత్త ఫోన్‌ను తీసుకురానుంది. మొబైల్‌ను పదే పదే ఛార్జింగ్ పెట్టుకునే సమస్య లేకుండా భారీ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్న ‘Vivo Y600 Pro’ను మరికొద్ది రోజుల్లో చైనా మార్కెట్‌లో విడుదల చేయనుంది. తాజా లీక్స్ ప్రకారం చూసుకుంటే.. ఈ ఫోన్ ఫీచర్లు వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.

90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్..

ఈ ఫోన్ గురించి అందరూ మాట్లాడుకోవడానికి మెయిన్ రీజన్ దీని బ్యాటరీ. ఈ Vivo Y600 Proలో ఏకంగా 10000mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. ఇక రెండు మూడు రోజుల పాటు ఛార్జర్ ఎక్కడుందో వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. మరి అంత పెద్ద బ్యాటరీ ఫుల్ అవ్వడానికి రోజంతా పడుతుందా? అంటే.. అస్సలు కాదు. దీనికోసం 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. దీనివల్ల కొన్ని నిమిషాల్లోనే చాలా వేగంగా ఛార్జింగ్ ఎక్కితుంది.

Advertisement

Read Also: సామాన్యుల బడ్జెట్‌లోకి దిగొచ్చిన శాంసంగ్ ప్రీమియం ఫోన్లు.. ఆఫర్లు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

కళ్లు తిప్పుకోలేని లుక్..చూడగానే నచ్చేలా ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు. ముఖ్యంగా పర్పుల్ కలర్‌లో రాబోతున్న ఈ ఫోన్ చాలా క్లాస్‌గా ఉంటుందట. వెనుక వైపు రౌండ్ షేప్‌లో ఉండే కెమెరా సెటప్ ఫోన్‌కు కొత్త అందాన్ని ఇస్తోంది. ఇక స్క్రీన్ విషయానికి వస్తే.. దీనిలో OLED డిస్‌ప్లే వాడుతున్నారు. దీనివల్ల కలర్స్ చాలా స్పష్టంగా, కళ్లకు ఇంపుగా కనిపిస్తాయి. ఫోన్‌లో ఎక్కువగా స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎక్కడా లాగ్ లేకుండా చాలా స్మూత్‌గా సాగిపోతుంది.

50 మెగాపిక్సల్ కెమెరా..

Advertisement

Vivo Y600 Pro ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరాను ఇస్తున్నారు. దీంతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా మంచి ఫొటోలు వస్తాయని లీక్స్ చెబుతున్నాయి. ఇక ఫోన్ స్పీడ్ కోసం ఇందులో పవర్‌ఫుల్ మీడియాటెక్ ప్రాసెసర్‌ను వాడుతున్నారు. దీనివల్ల ఎన్ని యాప్స్ వాడినా ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు.

ధర ఎంత ఉండొచ్చు?

ఇంత మంచి ఫీచర్లు ఉన్నాయి కదా.. ధర భారీగా ఉంటుందేమో అనుకుంటారు చాలామంది. కానీ, తాజా లీక్స్ ప్రకారం చూసుకుంటే ఈ ఫోన్ భారత్‌లో రూ.24,000 లోపు ఉండే అవకాశం ఉంది. మే నెలలో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉన్న ఈ ఫోన్.. మంచి బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వారికి కచ్చితంగా నచ్చుతుంది.

Also Read: ఓరి నాయనా.. iPhone 15 Proపై ఏకంగా రూ.59,000 తగ్గింపు, ఎక్కడ కొనుగోలు చేయాలంటే?

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×