E-Paper
Advertisement

సామాన్యుల బడ్జెట్‌లోకి దిగొచ్చిన శాంసంగ్ ప్రీమియం ఫోన్లు.. ఆఫర్లు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

సామాన్యుల బడ్జెట్‌లోకి దిగొచ్చిన శాంసంగ్ ప్రీమియం ఫోన్లు.. ఆఫర్లు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Galaxy S25 Series: ఈ మధ్యే మార్కెట్లోకి వచ్చిన శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ధరలను చూసి చాలామంది.. ఇంత ధర ఉంటే ఎప్పటికీ కొనలేము ఏమో అని నిరుత్సాహ పడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ దిమ్మతిరిగే ఆఫర్లు. తాజాగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి S26 సిరీస్‌ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సంస్థ తమ పాత మోడల్ అయిన S25 సిరీస్ ధరలను భారీగా తగ్గించేసింది. లగ్జరీ ఫోన్లను బడ్జెట్ ధరలోనే సొంతం చేసుకునే అవకాశం మిడిల్‌క్లాస్ ఫ్యామిలీస్‌కు కల్పించింది.

Samsung Galaxy S25

ఒకప్పుడు గెలాక్సీ S25 కొనాలంటే దాదాపు రూ.81,000 పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కంపెనీ ఏకంగా ఈ ధరను తగ్గించేయడంతో, 128GB వేరియంట్ కేవలం రూ.56,999కే దొరుకుతోంది. ఒకవేళ ఎక్కువ స్టోరేజ్ కావాలంటే.. రూ.62,999కి 256GB మోడల్‌ను సొంతం చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే.. ఈ రేటుకు ఇలాంటి ప్రీమియం ఫోన్ దొరకడం అంటే లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి.

Also Read: OnePlus 13Rపై రూ.10,000 తగ్గింపు.. నిమిషాల్లోనే హోమ్ డెలివరీ, ఎలాగో తెలుసా?

Samsung Galaxy S25 FE

తక్కువ ధరలో అల్ట్రా లెవల్ ఫీచర్లు కోరుకునే వారికి గెలాక్సీ S25 FE ఎప్పుడూ ఫేవరెట్. ఇప్పుడు దీని ధరపై ఏకంగా రూ.15,000 తగ్గింది. దీంతో రూ.59,999 ఉన్న ఫోన్ ఇప్పుడు కేవలం రూ.44,999కే అందుబాటులోకి వచ్చేసింది. మంచి కెమెరా, సూపర్ స్పీడ్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Samsung Galaxy S25 Ultra

శాంసంగ్ ఫోన్లలో కింగ్ లాంటి అల్ట్రా మోడల్ ధర ఇప్పుడు రూ.లక్ష లోపే ఉంది. లాంచింగ్ అప్పుడు రూ.1,29,999 ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు రూ.99,999కే లభిస్తోంది. ఏకంగా రూ.30,000 తగ్గిందంటే మామూలు విషయం కాదు. AI ఫీచర్లు, అదిరిపోయే డిస్‌ప్లే, ప్రొఫెషనల్ కెమెరా కావాలనుకునే వారు ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కొనేయొచ్చు.

ఎక్కడ కొనాలి?

ఈ కొత్త ధరలు శాంసంగ్ అఫీషియల్ సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. కొత్త ఫోన్లు వచ్చినా సరే.. S25 సిరీస్‌‌కు ఉన్న క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదు. అందుకే.. తక్కువ ధరలో మంచి బ్రాండెడ్ ఫోన్ కోసం చూస్తున్న వారు ఈ డీల్స్‌ను అస్సలు వదులుకోవద్దు.

Also Read: హానర్ కొత్త ఫోన్ల రచ్చ మొదలైంది.. 7000mAh బ్యాటరీ, 200MP కెమెరా ఫీచర్లు చూస్తే దిమ్మ తిరుగుద్ది!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

నథింగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు!

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

Big Stories

×