E-Paper
Advertisement

పవర్ బ్యాంక్ వాడుతున్నారా? పేలడానికి ముందు కనిపించే ఈ 5 సంకేతాలు ఇవే

పవర్ బ్యాంక్ వాడుతున్నారా? పేలడానికి ముందు కనిపించే ఈ 5 సంకేతాలు ఇవే
Advertisement

Power Bank Explosion Signs: నేటి స్మార్ట్‌ఫోన్ యుగంలో పవర్ బ్యాంక్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. ప్రయాణాల్లో ఉన్నా లేదా కరెంట్ లేకపోయినా మన ఫోన్‌కు ప్రాణం పోసేది ఇదే. అయితే.. ఈ సౌకర్యం వెనక ఒక భయంకరమైన ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇటీవల కాలంలో పవర్ బ్యాంక్‌లు పేలుతున్న వార్తలు మనం తరచుగా వింటున్నాం. పవర్ బ్యాంక్ ఒక్కసారిగా పేలిపోదు. అది పేలడానికి ముందు కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఆ హెచ్చరికలను మనం ముందుగానే గుర్తిస్తే ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చు.

పవర్ బ్యాంక్ పేలడానికి ముందు కనిపించే 5 ప్రధాన సంకేతాలు:

Advertisement

పవర్ బ్యాంక్‌లలో ఉండే లిథియం-అయాన్ బ్యాటరీలు సున్నితమైనవి. వాటిలో ఏదైనా లోపం ఏర్పడినప్పుడు అవి బాంబులా మారే అవకాశం ఉంది. మీ పవర్ బ్యాంక్‌లో ఈ కింది మార్పులు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.

1. అసాధారణంగా వేడెక్కడం:
మీరు ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు లేదా పవర్ బ్యాంక్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు.. అది కొంచెం వేడెక్కడం సాధారణమే. కానీ.. ముట్టుకోలేనంత వేడిగా ఉంటే మాత్రం అది లోపల కెమికల్ రియాక్షన్ సరిగ్గా జరగడం లేదని అర్థం. ఇది లోపలి సర్క్యూట్ దెబ్బతినడానికి మొదటి సంకేతం.

Advertisement

2. బ్యాటరీ ఉబ్బడం:
పవర్ బ్యాంక్ బాడీ కొంచెం ఉబ్బినట్లుగా లేదా వంగినట్లుగా కనిపిస్తే దానిని వెంటనే వాడటం ఆపేయండి. లోపల గ్యాస్ పేరుకుపోవడం వల్ల బ్యాటరీ ఉబ్బుతుంది. ఇలాంటి స్థితిలో ఉన్న పవర్ బ్యాంక్‌ను ఛార్జింగ్‌కు పెడితే అది వెంటనే పేలిపోయే ప్రమాదం ఉంది.

3. వింత వాసన రావడం:
ఇది చాలా ముఖ్యమైన సంకేతం. మీ పవర్ బ్యాంక్ నుంచి కెమికల్ వాసన లేదా ఏదో కాలుతున్నట్లు వాసన వస్తుంటే.. లోపల బ్యాటరీ సెల్స్ లీక్ అవుతున్నాయని అర్థం. ఈ వాసన వచ్చిన కొద్ది నిమిషాల్లోనే పొగలు రావడం లేదా పేలుడు సంభవించడం జరగవచ్చు. ఈ సంకేతాన్ని చూసి కూడా నిర్లక్ష్యం చేయకూడదు.

4. ఛార్జింగ్‌లో తేడా:
పవర్ బ్యాంక్ చాలా నెమ్మదిగా ఛార్జ్ అవ్వడం లేదా ఛార్జింగ్ పెట్టిన వెంటనే తగ్గిపోవడం వంటివి జరుగుతుంటే.. బ్యాటరీ లైఫ్ అయిపోయిందని అర్థం. పాతబడిన బ్యాటరీలు షార్ట్ సర్క్యూట్‌కు గురయ్యే అవకాశం ఎక్కువ.

5. బాడీపై పగుళ్లు లేదా లీకేజీ:
పవర్ బ్యాంక్ కింద పడటం వల్ల దాని బాడీపై పగుళ్లు వస్తే.. లోపలి బ్యాటరీ సెల్స్ గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపే అవకాశ ఉంటుంది.ఫలితంగా ఇది నిప్పు అంటుకోవడానికి కారణమవుతుంది. అలాగే పవర్ బ్యాంక్ నుంచి ఏదైనా ద్రవం కారుతున్నట్లు అనిపిస్తే దానిని అసలు తాకకూడదు.

Also Read: రూ.5వేలతో ప్రీ బుకింగ్.. శామ్‌సంగ్ ఏఐ టీవీలపై ఊహించని డిస్కౌంట్

ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
బ్రాండెడ్ మాత్రమే వాడండి: ఫుట్‌పాత్‌లపై లేదా తక్కువ ధరకు దొరికే లోకల్ పవర్ బ్యాంక్‌లను అస్సలు కొనకండి. బ్రాండెడ్ పవర్ బ్యాంక్‌లలో ‘ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్’ ఉంటుంది.

రాత్రంతా ఛార్జింగ్ వద్దు: పవర్ బ్యాంక్‌ను రాత్రంతా ఛార్జింగ్‌లో వదిలేయడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి పెరిగి పేలిపోయే అవకాశం ఉంది.

ఎండలో ఉంచకండి: కారు డ్యాష్ బోర్డులపై లేదా నేరుగా ఎండ తగిలే చోట పవర్ బ్యాంక్‌ను ఉంచకూడదు.

ఒరిజినల్ కేబుల్ వాడండి: పవర్ బ్యాంక్ తో పాటు వచ్చిన కేబుల్ లేదా నాణ్యమైన కేబుల్ మాత్రమే వాడండి.

ఎలక్ట్రానిక్ పరికరాలు మన సౌకర్యం కోసం పుట్టినవే అయినా.. వాటిని నిర్లక్ష్యంగా వాడితే ప్రాణాంతకంగా మారుతాయి. పైన తెలిపిన ఏ ఒక్క సంకేతం కనిపించినా.. ఆ పవర్ బ్యాంక్‌ను పాడేయండి. ముఖ్యంగా మూడవ సంకేతం (వింత వాసన) పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండండి.

Also Read: ఇండియాలో మోటరోలా మొదటి ఫోల్డబుల్ ఫోన్ విడుదల.. ఫీచర్లు మామూలుగా లేవుగా!

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×