WFH Gadgets: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న వేడి, కరెంట్ వాడకం దృష్ట్యా ఐటీ నిపుణులు, ఇతర ఉద్యోగులు వీలైనంత వరకు ఇంటి నుంచే పని చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల సూచించారు. అయితే.. ఆఫీసులో ఉండే సౌకర్యాలు ఇంట్లో ఉండవు కాబట్టి, పనిలో ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సమస్యను అధిగమించి, ఇంటినే ఒక ప్రొఫెషనల్ ఆఫీస్‌లా మార్చుకోవడానికి కొన్ని స్మార్ట్ గాడ్జెట్‌లు ఎంతో అవసరం. మీ పనిలో ఎలాంటి ఆటంకం లేకుండా అంతే కాకుండా వర్క్ ఈజీ చేసే గాడ్జెట్‌ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
WFH అనుభవాన్ని మార్చే టాప్ 10 గాడ్జెట్‌లు:
కేవలం ల్యాప్‌టాప్ ఉంటే సరిపోదు. సరైన సెటప్ ఉంటేనే పనిలో వేగం పెరుగుతుంది.
1. నాయిస్-క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్‌లు:
ఇంట్లో పని చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యుల మాటలు లేదా బయట ట్రాఫిక్ శబ్దాలు ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. Active Noise Cancellation (ANC) ఉన్న హెడ్‌ఫోన్‌లు పరిసర శబ్దాలను నియంత్రించి.. మీటింగ్‌లలో మీ గొంతు స్పష్టంగా వినిపించేలా చేస్తాయి.
2. రౌటర్ యూపీఎస్ (Router UPS):
ఇంటి నుంచి పని చేసేవారికి అతిపెద్ద శత్రువు ‘పవర్ కట్’. కరెంట్ పోయిన వెంటనే వై-ఫై ఆగిపోతుంది. ఈ చిన్న బ్యాటరీ బ్యాకప్ పరికరం (Router UPS) కరెంట్ పోయినా మీ రౌటర్‌కు 4 గంటల వరకు నిరంతర కరెంట్ అందిస్తుంది.
3. 4K వెబ్‌క్యామ్:
ప్రొఫెషనల్ మీటింగ్స్ , క్లయింట్ కాల్స్ కోసం ల్యాప్‌టాప్ కెమెరా సరిపోకపోవచ్చు. ఒక 4K వెబ్‌క్యామ్ మిమ్మల్ని హై-డెఫినిషన్ విజువల్స్‌తో ప్రెజెంట్ చేస్తుంది. ఇది మీ ఫ్రొఫెషనల్ ఇమేజ్‌ను మెరుగు పరుస్తుంది.
4. ఎర్గోనామిక్ కీబోర్డ్ & మౌస్:
గంటల తరబడి టైపింగ్ చేయడం వల్ల మణికట్టు నొప్పి రావచ్చు. ‘స్ప్లిట్ ఎర్గోనామిక్’ కీబోర్డులు చేతులను సహజమైన స్థితిలో ఉంచి శారీరక ఒత్తిడిని తగ్గిస్తాయి.
5. ఎయిర్ ప్యూరిఫైయర్:
ముఖ్యంగా ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో గాలి నాణ్యత తక్కువగా ఉంటుంది. ఇంట్లో పని చేసేటప్పుడు గాలి శుభ్రంగా ఉంటే.. అలసట లేకుండా ఉత్సాహంగా పని చేయవచ్చు. స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్లు గాలిలోని కాలుష్య కారకాలను తొలగిస్తాయి.
6. వైర్‌లెస్ ఛార్జింగ్ స్టాండ్:
డెస్క్‌పై వైర్ల గందరగోళం లేకుండా..మీ స్మార్ట్‌ఫోన్‌ను సులభంగా ఛార్జ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫోన్ చూస్తూనే పని చేసుకునే సౌకర్యం ఇందులో ఉంటుంది.
7. స్మార్ట్ పవర్ స్ట్రిప్:
దీనిని వై-ఫై ద్వారా మొబైల్ యాప్‌తో నియంత్రించవచ్చు. మీ డెస్క్ లైట్లు, మానిటర్, ప్రింటర్ వంటి పరికరాలను రిమోట్‌గా ఆన్/ఆఫ్ చేసుకోవచ్చు.
Also Read: మోడరన్ ఉమెన్స్ కోసం టైటాన్ నుంచి సూపర్ స్టైలిష్ వాచ్.. చూస్తే చూపు తిప్పుకోలేరు
8. థండర్‌బోల్ట్ హబ్ :
ల్యాప్‌టాప్‌కు పరిమిత పోర్ట్‌లు ఉన్నప్పుడు, ఈ హబ్ ద్వారా మానిటర్, మౌస్, హార్డ్ డిస్క్ వంటి అనేక పరికరాలను ఒకేసారి కనెక్ట్ చేయవచ్చు.
9. ఏఐ వాయిస్ అసిస్టెంట్ స్పీకర్:
అలెక్సా లేదా గూగుల్ హోమ్ వంటి స్పీకర్లు మీ మీటింగ్ రిమైండర్‌లు, అలారాలు సెట్ చేయడానికి , పని మధ్యలో చిన్నపాటి మ్యూజిక్ వినడానికి తోడ్పడతాయి.
10. ల్యాప్‌టాప్ స్టాండ్:
మీ కళ్ల స్థాయికి ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను సర్దుబాటు చేయడం ద్వారా మెడ, వెన్ను నొప్పులు రాకుండా కాపాడుకోవచ్చు.
ఇంటి నుంచి పని చేయడం అనేది ఇప్పుడు ఒక అవసరం మాత్రమే కాదు.కాబట్టి పైన పేర్కొన్న గాడ్జెట్‌లు మీ పనిని ఈజీ చేయడమే కాకుండా.. ఆఫీస్ వాతావరణాన్ని మీ ఇంటికే తెస్తాయి. తక్కువ పెట్టుబడితో మీ పనిని మెరుగుపరచుకోవడానికి ఇవి బెస్ట్.