E-Paper
Advertisement

ఏజెంటిక్ ఏఐ కేవలం సమాధానాలు మత్రమే కాదు.. పనులు కూడా చేసేస్తుంది!

ఏజెంటిక్ ఏఐ కేవలం సమాధానాలు మత్రమే కాదు.. పనులు కూడా చేసేస్తుంది!
Advertisement

Agentic AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. నిన్నమొన్నటి వరకు మనం చాట్ జిపిటి, లేదా జెమిని వంటి టూల్స్‌ను కేవలం ప్రశ్నలు అడగడానికి, వ్యాసాలు రాయించుకోవడానికి, లేదా సమాచారం తెలుసుకోవడానికి మాత్రమే వాడాం. దీనిని ‘జెనరేటివ్ ఏఐ’ (Generative AI) అంటారు. ఇది మనం ఇచ్చిన కమాండ్‌కు స్పందించి సమాచారాన్ని ఇస్తుందే తప్ప, సొంతంగా ఏ పనీ చేయలేదు. కానీ ఇప్పుడు సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనం వచ్చింది’ఏజెంటిక్ ఏఐ’ (Agentic AI). ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా, చేతల్లో చూపిస్తుంది. అంటే, మనం ఒక లక్ష్యాన్ని చెబితే, దాన్ని పూర్తి చేయడానికి ఏమేం చేయాలో సొంతంగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకుని, ఆ పనిని విజయవంతంగా పూర్తి చేస్తుంది.

Read also-అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సొంత ఫోన్ చూశారా? లుక్ అదిరింది కానీ, అంతలోనే ఊహించని వివాదం!

అసలు ‘ఏజెంటిక్ ఏఐ’ అంటే ఏమిటి?

Advertisement

సాధారణ ఏఐకి మనం ప్రతి అడుగులోనూ ‘ప్రాంప్ట్’ ఇస్తూ గైడ్ చేయాలి. కానీ ఏజెంటిక్ ఏఐకి స్వయంప్రతిపత్తి ఉంటుంది. దీనికి ఒక పనిని అప్పగిస్తే, అది మానవ ప్రమేయం లేకుండా ఈ క్రింది దశల్లో పని పూర్తి చేస్తుంది. ఇచ్చిన పనిని ఎలా చేయాలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. అవసరమైన సాఫ్ట్‌వేర్‌లను, ఇంటర్నెట్‌ను లేదా డేటాబేస్‌లను సొంతంగా వాడుకుంటుంది. పని మధ్యలో ఏదైనా సమస్య వస్తే, దాన్ని అధిగమించడానికి ప్రత్యామ్నాయ నిర్ణయాలు తీసుకుంటుంది. తప్పులు జరిగితే తానే గుర్తించి, సరిచేసుకుని పని పూర్తి చేస్తుంది.

నిజ జీవితంలో దీని అప్లికేషన్లు

సాఫ్ట్‌వేర్ రంగంలో ఒక యాప్‌ను డెవలప్ చేయమని చెబితే, ఏజెంటిక్ ఏఐ కోడింగ్ రాయడమే కాకుండా… ఆ కోడ్‌ను రన్ చేసి, ఎర్రర్స్ ఉంటే వాటిని వెతికి, ఫిక్స్ చేసి, ఫైనల్ ప్రొడక్ట్‌ను సిద్ధం చేస్తుంది. కంపెనీ సేల్స్ డేటాను ఇచ్చి, “వచ్చే నెలలో లాభాలు పెరగాలంటే ఏం చేయాలి?” అని అడిగితే, ఇది గంటల కొద్దీ డేటాను విశ్లేషించి, ఒక పక్కా బిజినెస్ ప్లాన్‌ను రిపోర్ట్ రూపంలో ఇస్తుంది. పాత చాట్‌బాట్‌లు కేవలం ముందే సేవ్ చేసిన సమాధానాలు ఇచ్చేవి. కానీ ఏజెంటిక్ ఏఐ కస్టమర్ సమస్యను అర్థం చేసుకుని, వారి అకౌంట్ వివరాలను తనిఖీ చేసి, అవసరమైతే రీఫండ్ ప్రక్రియను కూడా సొంతంగా పూర్తి చేయగలదు. ఒక టాపిక్‌పై ఆర్టికల్ రాయమంటే, ఇంటర్నెట్‌లో టాప్ వెబ్‌సైట్స్‌ను రీసెర్చ్ చేసి, ఫ్యాక్ట్ చెక్ (Fact check) చేసుకుని, గ్రాఫిక్స్‌తో సహా పూర్తి ఆర్టికల్‌ను డిజైన్ చేస్తుంది.

Advertisement

Read also-జిమ్‌లో మెగాస్టార్ విశ్వరూపం.. ‘మెగా 158’ ఓపెనింగ్ డేట్ ఫిక్స్.. బాబితో మరో క్రేజీ ప్రాజెక్ట్..

టెక్నాలజీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఒక సొంత ‘ఏఐ ఏజెంట్’ ఉంటుంది. మనకు ఇష్టమైన టూర్ ప్లాన్ చేయడం దగ్గరనుంచి, ఆఫీస్ మెయిల్స్ హ్యాండిల్ చేయడం వరకు అన్నీ ఇవే చూసుకుంటాయి. జెనరేటివ్ ఏఐ మనకు ఆలోచనలను ఇస్తే.. ఏజెంటిక్ ఏఐ ఆ ఆలోచనలను నిజం చేస్తుంది. డిజిటల్ ప్రపంచంలో ఇది నిజంగా ఒక అద్భుతమైన తరువాతి విప్లవం!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×