E-Paper
Advertisement

Best Time To Buy Smartphone: స్మార్ట్‌ఫోన్ ఏ టైమ్‌లో కొనుగోలు చేస్తే డబ్బులు మిగులుతాయి?.. ఈ టిప్‌తో వేలకు వేలు ఆదా!

Best Time To Buy Smartphone: స్మార్ట్‌ఫోన్ ఏ టైమ్‌లో కొనుగోలు చేస్తే డబ్బులు మిగులుతాయి?.. ఈ టిప్‌తో వేలకు వేలు ఆదా!
Advertisement

Best Time To Buy Smartphone: కొత్త ఫీచర్లు, పవర్‌ఫుల్ కెమెరా, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ ఫోన్ కొనే విషయంలో చాలా మంది తొందరపడి నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా ఫోన్ స్లో అవుతుందనే కారణంతో వెంటనే స్టోర్‌కి వెళ్లి కొత్తది కొనేయడం వల్ల అనవసరపు ఖర్చు పెరుగుతుంది. నిజానికి, ఫోన్‌ను ఎప్పుడు కొనాలి అన్నది తెలుసుకుంటే అదే డివైస్‌ను తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రీ ఆర్డర్ బెస్ట్ ఆప్షన్:

కొత్తగా విడుదలైన ఫోన్‌ను వెంటనే కొనుగోలు చేయాలని చూస్తున్నవాళ్లు ప్రీ-ఆర్డర్ ఇచ్చేయడం బెస్ట్ ఆప్షన్. ఈ దశలో కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, ఫ్రీ యాక్సెసరీస్ వంటి అదనపు లాభాలు ఇస్తుంటాయి. లాంచ్ అయిన కొద్ది రోజులకే ఈ ఆఫర్లు ఆగిపోతాయి కాబట్టి.. ముందే ఆర్డర్ పెట్టడం లాభదాయకంగా మారుతుంది.

ఆ టైంలో ధరలు పడిపోతాయి:

Advertisement

కొత్త ఫోన్ మార్కెట్‌లోకి వచ్చిన వెంటనే గత మోడల్ ధర గణనీయంగా తగ్గిపోతుంది. ఫీచర్లలో పెద్దగా మార్పులు లేకపోయినా, ధరలో మాత్రం మంచి తేడా ఉంటుంది. తాజా మోడల్ అవసరం లేకపోతే, పాత మోడల్ కొనడం ద్వారా మంచి డీల్‌ను సొంతం చేసుకోవచ్చు.

పండుగ సీజన్లో భారీ డిస్కౌంట్స్:

భారతదేశంలో పండుగల సీజన్ ఫోన్ కొనుగోలుకు అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. రక్షాబంధన్ నుంచి దీపావళి వరకు జరిగే సేల్స్‌లో, ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో, ప్రీమియం ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్లు లభిస్తాయి.

ఏడాది చివర్లో బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు:

Advertisement

ఇక నవంబర్ చివర్లో వచ్చే బ్లాక్ ఫ్రైడే సేల్ కూడా ఇప్పుడు ఇండియాలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఏడాది చివర్లో స్టాక్ క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లు ఆకర్షణీయమైన ఆఫు అందుబాటులో ఉంటాయి. ఈ సమయంలో కొనుగోలు చేస్తే అధిక మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది.

తొందరపాటు వద్దు:

అలాగే, ఉత్పత్తి నిలిపివేసిన ఫోన్ మోడళ్లపై కూడా అదిరిపోయే డీల్స్ ఉంటాయి. రిటైలర్లు ఆ స్టాక్‌ను త్వరగా అమ్మేయాలనుకునే సమయంలో, కొంచెం తెలివిగా ఎంపిక చేస్తే చాలా తక్కువ ధరకు మంచి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. మొత్తానికి, ఫోన్ కొనుగోలు విషయంలో తొందరపడటం కంటే.. సరైన సమయాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఒకసారి క్యాలెండర్ చూసి ప్లాన్ చేసుకుంటే.. అదే ఫోన్‌ను తక్కువ ధరకు కొనడం అసాధ్యమేమీ కాదు. తెలివిగా షాపింగ్ చేస్తే.. టెక్నాలజీతో పాటు సేవింగ్స్ కూడా మీ సొంతమవుతుంది.

 

Related News

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

శాంసంగ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఆ పాపులర్ ఫోన్ల ధరలు విపరీతంగా పెంపు!

Big Stories

Advertisement
×