E-Paper
Advertisement

WhatsApp: షాకింగ్..85 లక్షల ఖాతాలపై వాట్సాప్ నిషేధం!

WhatsApp: షాకింగ్..85 లక్షల ఖాతాలపై వాట్సాప్ నిషేధం!
Advertisement

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వినియోగదారులు ఉన్న సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. మ‌న‌దేశంలోనూ ఎక్కువ మంది వాడుతున్న మెసేజింగ్ యాప్ ఇదే. ఇండియాలో మొత్తం 60 కోట్ల మంది వాట్సాప్ వినియోగిస్తున్నారు. ఎవరి స్మార్ట్ ఫోన్ చూసినా అందులో తప్పకుండా వాట్సాప్ కనిపిస్తుంది. ఇందులో సమాచారాన్ని వేగంగా, సులభంగా చేరవేయెచ్చు. కేవలం సందేశాలను మాత్రమే కాకుండా ఫోటోలు, వీడియోలు సైతం పంపవచ్చు. అలాంటి వాట్సాప్ కు పోటీగా చాలా యాప్స్ వచ్చాయి. హైక్, టెలిగ్రామ్ తో పాటు కొన్ని యాప్స్ రంగంలోకి దిగాయి.

కానీ వాట్సాప్ వాటికంటే అప్డేట్స్‌తో యూజర్స్‌ను మెప్పించడంతో నంబర్ వన్ స్థానాన్ని కోల్పోకుండా ఉంది. వాట్సాప్‌కు సంబంధించి మరో గొప్ప విషయం ఏంటేంటే..ఇది యాడ్స్ ఫ్రీ కావడంతో పాటు వినియోగదారుల సమాచారానికి ఎంతో భద్రతను ఇస్తుంది. ఇప్పుడు ఆ భద్రత కోసమే మరో కీలక నిర్ణయం తీసుకుంది. మ‌న‌దేశంలో చెెడు ఖాతాలు అనిపించిన వాటిపై కొరడా విసిరింది. సెప్టెంబర్ నెలలో మొత్తం 85 లక్ష‌ల ఖాతాల‌ను గుర్తించి వాటిపై నిషేదం విధించింది. ఇవి నియమావ‌ళికి విరుద్ధంగా ఉన్నాయని సోష‌ల్ మెసేజింగ్ యాప్ భావించిన‌ట్టు స‌మాచారం. సెప్టెంబ‌ర్ 1 నుండి 30వ తేదీ వ‌ర‌కు 85,84,000 ఖాతాల‌ను నిషేధించ‌గా వీటిలో 16,58,000 ఖాతాల‌పై ఎలంటి ఫిర్యాదు అంద‌క‌పోయిన‌ప్ప‌టికీ ముందుగానే న‌ఖిలీవిగా గుర్తించి నిషేధించిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

ఇటీవ‌ల కాలంలో వాట్సాప్‌కు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో స్పందిస్తూ సెప్టెంబర్ లో పలు ఖాతాలను బ్లాక్ చేసినట్టు ప్రకటించింది. అదే విధంగా ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక ముందు కూడా పారదర్శకంగా వ్యవహరించడాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. తమ చర్యలకు సంబంధించిన సమాచారాన్ని కూడా భవిష్యత్తులో నివేదికల్లో పొందుపరుస్తామని స్పష్టం చేసింది యూజర్లు తమకు నచ్చని వ్యక్తులను బ్లాక్ చేసే అవకాశం కల్పించామని, అభ్యంతకర కంటెంట్ పై ఫిర్యాదులు చేసే వెసులుబాటు కూడా కల్పించామని తెలిపింది.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×