BigTV English

GundeNinda GudiGantalu : సత్యం ప్రాణాల మీదకు తెచ్చిన బాలు.. మీనా ప్లాన్ వర్కౌట్ అవుతుందా? సత్యం ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా?

GundeNinda GudiGantalu : సత్యం ప్రాణాల మీదకు తెచ్చిన బాలు.. మీనా ప్లాన్ వర్కౌట్ అవుతుందా? సత్యం ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా?

GundeNinda GudiGantalu : స్టార్ మా లో సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లలో ఒకటి గుండెనిండా గుడిగంటలు. ఈ సీరియల్ కు రోజు రోజుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.. దాంతో ఈ సీరియల్ రేటింగ్ దూసుకుపోతుంది. గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితులకు అందరు మీనాను చూసి జాలి పడుతున్నారు.. మంచి చేయబోయి తన మెడకు ఉచ్చు చుట్టుకుంది. దాని గురించి ఎంత చెప్పినా తన మాటను పట్టించుకొనే వారే లేరు. ఇక హాస్పిటల్ లో సత్యం జీవచ్చవం లాగా పడి ఉండటాన్ని చూసి అందరు బాధతో కుమిలి పోతారు. ఎప్పుడు సంతోషంగా ఓ పెద్ద మనిషి ఇలా అవ్వడానికి కారణం అయిన వారిని బాలు వదిలి పెట్టను అని అంటాడు. ఎలా నిన్నటి ఎపిసోడ్ లో సత్యం ఆపరేషన్ ను చేయిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం..


గత వారం ఎపిసోడ్ లో బాలు పీకలాగా తాగి వచ్చి ఇంటికి చేరుకుంటాడు. సైలెంట్ గా ఉండకుండా తాను రెస్టారెంట్ కు వెళ్లి రవిని చితకబాదానని చెప్తాడు. దీంతో సత్యం ఆగ్రహానికి గురి అవుతాడు. ఇంతలో మనోజ్ కు బాలుకు మధ్య వాగ్వివాదం జరుగుతుంది. ఈ క్రమంలో బాలు.. తన అన్న మనోజ్ పై చేయి చేసుకుంటాడు. అడ్డువచ్చిన మనోజ్ భార్య రోహిణిపై కూడా చేయి చేసుకుంటాడు బాలు.. అది చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఇక కొడుకులు పరువు పోయినా సరిగ్గా లేరని సత్యం బాధపడతాడు. దాంతో అతనికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఇక వెంటనే హాస్పిటల్ కు తీసుకొని వెళ్తారు. కానీ అక్కడ సత్యం పరిస్థితి సీరియస్ అవ్వడంతో ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్ చెబుతాడు. దానికి నాలుగు లక్షలు కావాలని చెప్పడంతో ఇంట్లో వాళ్ళు కంగారు పడిపోతారు.

మీనాకు ఈ విషయం తెలియడంతో వెంటనే హాస్పిటల్ కు చేరుకుంటుంది. కానీ ప్రభావతి, మనోజ్ లు ఎందుకు వచ్చావ్.. నీవల్లే కుటుంబ పరువు రోడ్డున పడిందని,ఆ బాధతోనే హార్ట్ ఎటాక్ వచ్చిందంటూ అవమానిస్తారు. దీంతో తన మామయ్యను చూడకుండానే మీనా అక్కడినుండి వెళ్ళిపోతుంది. బాలు వచ్చేలోగా మీనాను ఇంట్లో వాళ్ళు గేంటెస్తారు.. ఇక బాలు డబ్బుల కోసం చెయ్యని ప్రయత్నం లేదు. సత్యం ను వైద్యులు పరీక్షించి, తనకి మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని, ఆపరేషన్ చేయాలని, ఈ ఆపరేషన్ కు దాదాపు నాలుగు నుండి ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెబుతారు. ఆపరేషన్ కోసం డబ్బు ఎలా సమకూర్చాలో ప్రభావతి ఫ్యామిలీ ఆలోచిస్తుంది. ఈ క్రమంలో ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్లి.. తన నాన్నను గాని, మామయ్యను గాని డబ్బు సమకూర్చమని కోరుతుంది.. కానీ రోహిణి తన తండ్రి గురించి నిజం బయటకు రానివ్వకుండా ఏదోకటి చెప్పి తప్పించుకుంటుంది. ఇక ఇంటి పత్రాలను పెట్టి డబ్బులు తీసుకురావాలని వెళ్లిన బాలుకు అక్కడ పత్రాలు లేకపోవడంతో మళ్లీ బాలు హాస్పిటల్ వచ్చేస్తాడు.


ఈ సమయంలో మనోజ్ పై అనుమానం వ్యక్తం చేస్తాడు. దీంతో మరోసారి బాలుకు మనోజ్ లకు గొడవ జరుగుతోంది. మరోవైపు.. మీనా తన మామయ్య గురించి పూజలు చేస్తోంది. ఈ సమయంలో ఓ పూజారి కంకణం ఇచ్చి తన మామయ్యకు కట్టామని చెబుతాడు. మరో వైపు.. డబ్బు కోసం బాలుకు తన బాస్ వెళ్లగానే అవమానించి పంపిస్తాడు. దానికి బాలు డబ్బులు దొరకలేదు నన్ను ఏదైనా చెయ్యి అని దేవుడిను బయట ఏడుస్తాడు. ఇక అప్పుడే తన కారు కావాలని అన్నారని మెకానిక్ అంటాడు. దేవుడు దారి చూపించాడని సంతోష పడతాడు.. తనకు ఎంతో ఇష్టమైన కారు పోవడంతో బాలు తెగ ఫీల్ అవుతాడు. ఇక హాస్పిటల్ వెళ్లి డబ్బులు కడతాడు. రవి తన చెల్లి మౌనిక కు ఫోన్ చేసి ఇంట్లో పరిస్థితి ఎలా ఉందని అడగగా.. నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందని, అన్నయ్యలు డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతుంది. దీంతో వెంటనే హాస్పిటల్ కి బయలుదేరుతారు. ఈ సమయంలో శృతి ఖర్చులకోసం అంటూ రెండు లక్షల రూపాయల చెక్ ఇచ్చి పంపిస్తుంది. కానీ అక్కడ ఎవరు మాట్లాడారు.. రవిని బాలు గెంటెస్తారు.. ఇక మీనా ఆపరేషన్ అయ్యాక సత్యాంకు కంకణం కట్టాలని లోపలికి వెళ్తుంది. ఇక సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుతుందో చూడాలి..

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Big Stories

×