E-Paper
Advertisement

WhatsApp New Year 2026: చాటింగ్ ఇక నెక్ట్స్ లెవెల్.. 2026లో వాట్సప్ స్టిక్కర్లు, వీడియో కాల్స్‌లో స్పెషల్ ఎఫెక్ట్స్ వచ్చేశాయ్!

WhatsApp New Year 2026: చాటింగ్ ఇక నెక్ట్స్ లెవెల్.. 2026లో వాట్సప్ స్టిక్కర్లు, వీడియో కాల్స్‌లో స్పెషల్ ఎఫెక్ట్స్ వచ్చేశాయ్!
Advertisement

WhatsApp New Year 2026: కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేళ.. వాట్సప్ తమ వినియోగదారులకు మరింత ఆనందాన్ని పంచేందుకు కొన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చే ఉద్దేశంతో ఈ అప్‌డేట్స్‌ను తీసుకొచ్చినట్లు వాట్సప్ వెల్లడించింది. 2026 థీమ్‌తో స్టిక్కర్ ప్యాక్‌తో పాటు వీడియో కాల్స్‌లో ప్రత్యేక ఎఫెక్ట్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

యూజర్లను ఆకట్టుకునేలా:

సాధారణ రోజుల్లో వాట్సప్ ప్లాట్‌ఫాం మీద రోజుకు సగటున 100 బిలియన్ సందేశాలు, దాదాపు 2 బిలియన్ కాల్స్ చేసుకుంటున్నారని సంస్థ తెలిపింది. అయితే నూతన సంవత్సర వేడుకల రోజున ఈ సంఖ్యలు ప్రతి ఏటా కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయని, ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగవచ్చని అంచనా వేస్తోంది. ఈ భారీ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకునే కొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నట్లు స్పష్టం చేసింది.

మాటల కంటే స్టిక్కర్లతో:

Advertisement

న్యూ ఇయర్ సందర్భంగా వాట్సప్ ప్రత్యేకంగా 2026 స్టిక్కర్ ప్యాక్‌ను విడుదల చేసింది. ఈ స్టిక్కర్లను ఉపయోగించి వ్యక్తిగత చాట్‌లలోనూ, గ్రూప్ చాట్‌లలోనూ నూతన సంవత్సర శుభాకాంక్షలను సులభంగా పంపించవచ్చు. మాటల కంటే స్టిక్కర్లతో భావాలను వ్యక్తపరచాలనుకునేవారికి ఇవి బాగా ఉపయోగపడనున్నాయి.

వీడియో కాల్స్‌లో మరింత ఫన్:

ఇక వీడియో కాలింగ్ అనుభవాన్ని మరింత ఫన్‌గా మార్చేందుకు కొత్త ఎఫెక్ట్స్‌ను జోడిస్తోంది. వీడియో కాల్ చేస్తున్న సమయంలో స్క్రీన్‌పై ఫైర్‌వర్క్స్, రంగుల కన్ఫెట్టి(పుట్టినరోజులు, పండుగలు వంటి వేడుకలలో ఆనందం, ఉత్సాహాన్ని నింపడానికి గాలిలోకి విసిరే చిన్న రంగుల కాగితపు ముక్కలు), మెరిసే నక్షత్రాల వంటి ఎఫెక్ట్స్ కనిపించేలా ఈ ఫీచర్‌ను రూపొందించింది. దీని ద్వారా దూరంలో ఉన్నా కూడా వేడుకల ఉత్సాహాన్ని పంచుకోవచ్చని వాట్సప్ భావిస్తోంది.

వాట్సప్ స్టేటస్‌లోనూ మ్యాజిక్:

Advertisement

అలాగే, ఏదైనా మెసేజ్‌కు కన్ఫెట్టి ఎమోజీని జోడించినప్పుడు ప్రత్యేక యానిమేషన్ కనిపించేలా కొత్త విజువల్ ఎఫెక్ట్‌ను కూడా తీసుకొచ్చింది. దీంతో చాటింగ్ అనుభవం మరింత ఇంటరాక్టివ్‌గా మారనుంది. దీంతోపాటు మొదటిసారిగా వాట్సప్ స్టేటస్ విభాగంలో కూడా యానిమేటెడ్ స్టిక్కర్లు అందుబాటులోకి రానున్నాయి. కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికి న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు ఈ స్టిక్కర్లు ఉపయోగపడతాయని సంస్థ తెలిపింది.

కొత్త ఫీచర్లతో స్మార్ట్ న్యూ ఇయర్:

అంతేకాదు.. నూతన సంవత్సర వేడుకలను ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్లాన్ చేసుకోవడానికి ఈవెంట్ ప్లాన్ ఫీచర్, పోల్స్, లైవ్ లొకేషన్ షేరింగ్, వాయిస్, వీడియో నోట్స్ వంటి టూల్స్‌ను ఉపయోగించుకోవాలని వాట్సప్ యూజర్లకు సూచిస్తోంది. ఈ ఫీచర్లతో కొత్త ఏడాది వేడుకలు మరింత స్మార్ట్‌గా, సులభంగా జరుపుకోవచ్చని తెలిపింది.

Related News

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

Big Stories

Advertisement
×