E-Paper
Advertisement

WhatsApp Calls: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ ఫీచర్‌తో మీ బీపీ అమాంతం తగ్గిపోతుంది..

WhatsApp Calls: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ ఫీచర్‌తో మీ బీపీ అమాంతం తగ్గిపోతుంది..
Advertisement

WhatsApp Calls: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, తన ప్లాట్‌ఫారమ్‌లో వాయిస్, వీడియో కాల్స్ నాణ్యతను పెంచేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే, బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలను నియంత్రించే ‘బిల్ట్-ఇన్ నాయిస్ క్యాన్సలేషన్’ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.11.8లో ఈ ఫీచర్ కనిపించింది. ఇది ఎలా పని చేస్తుంది అంటే?.. మనం ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు లేదా బయట గాలి ఎక్కువగా వీస్తున్నప్పుడు కాల్ మాట్లాడితే, అవతలి వ్యక్తికి మన మాటలకంటే చుట్టూ ఉన్న శబ్దాలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. వాట్సాప్ తీసుకువస్తున్న ఈ కొత్త టెక్నాలజీ, మైక్రోఫోన్ ద్వారా వచ్చే శబ్దాలను రియల్ టైమ్‌లో విశ్లేషిస్తుంది. ఇది వినియోగదారుడి గొంతును మాత్రమే గుర్తించి, చుట్టూ ఉండే ట్రాఫిక్ హోరు, గాలి శబ్దం లేదా ఇతర అనవసరమైన శబ్దాలను ఫిల్టర్ చేస్తుంది. దీనివల్ల అవతలి వ్యక్తికి మీ మాటలు చాలా స్పష్టంగా వినిపిస్తాయి.

Read also-Self Balancing Scooter: ఈ స్కూటర్ గానీ మార్కెట్లోకి వస్తే ఆడవాళ్లుకు పండగే.. ప్రమాదాలే జరగవు!

ఫీచర్లు ఇవే..

Advertisement

కాల్ ప్రారంభం కాగానే ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా పనిచేయడం మొదలుపెడుతుంది. ఇది యాక్టివేట్ అయినప్పుడు స్క్రీన్ మీద ఒక నోటిఫికేషన్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ యూజర్లు ఈ ఫీచర్‌ను వద్దనుకుంటే, కాల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మాన్యువల్‌గా ఆఫ్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఏదైనా మ్యూజిక్ లేదా చుట్టూ ఉన్న వాతావరణ శబ్దాలను అవతలి వారికి వినిపించాలనుకున్నప్పుడు దీనిని ఆఫ్ చేయవచ్చు. ఈ నాయిస్ ఫిల్టరింగ్ ప్రక్రియ అంతా మీ ఫోన్‌లోనే జరుగుతుంది. దీనివల్ల వాట్సాప్ భద్రతకు (End-to-End Encryption) ఎలాంటి ముప్పు ఉండదు. డేటా సర్వర్లకు వెళ్లే ముందే ఆడియో క్లియర్ చేయబడుతుంది.

Read also-Dhurandhar Runtime: ‘ధురంధర్ ది రివేంజ్’పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్.. ఇది వేరే లెవెల్…

యూజర్లకు వరం

Advertisement

ఐఫోన్ (iOS) వినియోగదారులకు ఇప్పటికే సిస్టమ్ లెవల్‌లో ‘వాయిస్ ఐసోలేషన్’ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇవి అన్ని మోడల్స్ లో ఉండవు. వాట్సాప్ నేరుగా తన యాప్‌లోనే ఈ ఫీచర్‌ను తీసుకురావడం వల్ల ఆండ్రాయిడ్ యూజర్లకు భారీ ఊరట లభించనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. త్వరలోనే బీటా టెస్టర్లకు, ఆ తర్వాత సాధారణ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. దీనివల్ల వాట్సాప్ కాల్స్ నాణ్యత మరింతగా పెరగడం ఖాయం. దీంతో మాటలు సరిగా వినపడక చాలా సార్లు చిరాకు పడే వారికి బిగ్ రిలీఫ్‌గా ఉంటుంది. దీంతో వినపడటంలేదు అని ఫోన్ మాట్లాడేటప్పుడు బీపీ తెచ్చుకుని ఫోన్లు పగులగొట్టే వారికి ఇది ఎంతగానో ఉపయేగపడుతుంది.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×