E-Paper
Advertisement

IPL 2026 Injury: ఇది IPL కాదు…ఇంజ్యూర్డ్ ప్రీమియర్ లీగ్..ప‌రువు తీస్తోన్న పాకిస్తాన్‌

IPL 2026 Injury: ఇది IPL కాదు…ఇంజ్యూర్డ్ ప్రీమియర్ లీగ్..ప‌రువు తీస్తోన్న పాకిస్తాన్‌
Advertisement

IPL 2026 Injury :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) మరో 8 రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీ నుంచి ఈ మెగా ఈవెంట్ షురూ కాబోతోంది. మొదటి దశలో భాగంగా మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. త్వరలోనే పూర్తిస్థాయి షెడ్యూల్ కూడా విడుదల కానుంది. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి షెడ్యూల్ ఇంకా రిలీజ్ చేయలేదు బీసీసీఐ. అయితే ఎనిమిది రోజుల్లోనే ఇండియన్ ప్రీమియర్ లీ టోర్నమెంట్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో చాలామంది క్రికెటర్లు గాయాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఐపిఎల్ టోర్నమెంట్ కు దూరం అవుతున్నారు. ఇందులో కొంతమంది ప్రారంభ మ్యాచ్లకు దూరమవుతుంటే.. మరి కొంతమంది టోర్నమెంట్ మొత్తం దూరమయ్యే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను ఇంజ్యూర్డ్ ప్రీమియర్ లీగ్ ( Injured Premier League) అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్ నెటిజన్స్ ఈ దారుణానికి పాల్పడుతున్నారు.

Also Read: Kavya Maran: దేశ ద్రోహి అంటూ కావ్య పాప‌ను ట్రోల్ చేస్తున్నారు, కానీ క‌రోనా, తుఫాన్లు వ‌చ్చిన‌ప్పుడు ఇండియాను ఆదుకున్న దేవ‌త !

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో గాయాల బారిన పడ్డ ప్లేయర్లు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలామంది గాయాల బారిన పడ్డారు. ఇందులో మొట్టమొదటగా కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా ( Harshit Rana) గాయం బారిన పడి టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. ఇతని స్థానంలో బ్లెస్సింగ్ ముజారాబానీ రంగంలోకి దిగుతున్నాడు. అటు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు నాథన్ ఎల్లిస్ ( Nathan Ellis ) కూడా లేటెస్ట్ గా మోకాలి నరాల గాయం బారిన పడ్డాడు. దీంతో ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ కూడా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్ లోకి వెళ్లిన సామ్ కరన్ ( Sam Curran) కూడా గజ్జల్లో గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరం అవుతున్నాడని తెలుస్తోంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ( ) ప్రారంభ మ్యాచ్లకు దూరమవుతున్నాడు. జోష్ హేజిల్ వుడ్ ( Josh Hazlewood ) కూడా ప్రారంభం మ్యాచ్ లకు దూరం కాబోతున్నాడు. మతీషా పతిరానకు ఇప్పటివరకు శ్రీలంక NOC ఇవ్వలేదు. అతడు ఫిట్నెస్ సాధిస్తేనే ఐపిఎల్ ఆడతాడు. లేకపోతే కేకేఆర్ కు ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. షార్ట్ కూడా వేలి గాయం కారణంగా ఫస్ట్ ఎడిషన్ మ్యాచ్లకు దూరమయ్యే ప్రమాదం ఉంది. దీంతో చెన్నైకి ఊహించని షాక్ తగిలింది. శ్రీలంక ఆల్రౌండర్ హస రంగా ఇప్పటికే టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. జాక్ ఎడ్వార్డ్స్ కూడా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. ఇలా మెయిన్ క్రికెటర్లందరూ టోర్నమెంట్ నుంచి వైదొలుగుతున్నారు. ఈ అందరూ కూడా బౌలర్లు కావడం, అందరికీ గాయాలు అవ్వడం ఐపీఎల్ కు మైనస్ గా మారింది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటును ఇంజ్యూర్డ్ ప్రీమియర్ లీగ్ అంటూ పాకిస్తాన్ నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

Also Read: Inzamam-ul-Haq: అల్లా మీద ఒట్టు..ఇకపై టీమిండియాకు ఒక్క ట్రోఫీ రాదు, పాకిస్తానే వరుసగా 5 వరల్డ్ కప్ లు గెలుస్తుంది

 

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×