E-Paper
Advertisement

రూ.15 వేలలోపు బెస్ట్ వాషింగ్ మెషీన్ కావాలా? మీ కోసం పర్ఫెక్ట్ ఛాయిస్

రూ.15 వేలలోపు బెస్ట్ వాషింగ్ మెషీన్ కావాలా? మీ కోసం పర్ఫెక్ట్ ఛాయిస్
Advertisement

Whirlpool 8.2 kg Washing Machine: ప్రతిరోజూ బట్టలు ఉతకడం అనేది ఇంటి పనుల్లో అత్యంత విసిగించే అంశం. ముఖ్యంగా ఇంట్లో ఎక్కువ మంది సభ్యులు ఉన్నప్పుడు లేదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు బట్టలపై పడే మొండి మరకలను వదిలించడం పెద్ద సవాలుగా మారుతుంది. అలాంటి కష్టాలకు స్వస్తి పలికేందుకు ప్రముఖ బ్రాండ్ విజార్డ్ వర్ల్‌పూల్ నుంచి వచ్చిన మోడలే Whirlpool 8.2 kg Sem Washing Machine. కేవలం రూ. 14,590 కే లభించే ఈ వాషింగ్ మెషీన్ విశేషాలు ఇప్పుడు చూద్దాం!

Whirlpool 8.2 kg Washing Machine రివ్యూ:

పెద్ద కుటుంబాలకు లేదా ప్రతి రోజూ ఎక్కువ బట్టలు ఉతికే వారికి చిన్న కెపాసిటీ ఉన్న వాషింగ్ మెషీన్లు సరిపోవు. అందుకే 8.2 kg కెపాసిటీతో వచ్చిన వర్ల్‌పూల్ ఏస్ సూపర్ సోక్ మోడల్ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందుతోంది. తక్కువ విద్యుత్, తక్కువ నీటి వినియోగంతో నాణ్యమైన వాషింగ్ అనుభవాన్ని ఇది అందిస్తుంది.

సూపర్ సోక్ టెక్నాలజీ :

Advertisement

ఈ వాషింగ్ మెషీన్‌లో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని ఫీచర్. బట్టలు ఉతకడానికి ముందే దాదాపు 25 నిమిషాల పాటు డిటర్జెంట్ నీటిలో బట్టలను నానబెడుతుంది. దీని వల్ల కాలర్లు, కఫ్‌లు, బట్టలపై ఉన్న మొండి జిడ్డు లేదా బురద మరకలు ఈజీగా విడిపోతాయి. చేత్తో రుద్దాల్సిన అవసరం లేకుండానే బట్టలు చాలా శుభ్రంగా మారతాయి.

పవర్‌ఫుల్ పల్సేటర్ & స్పిన్ డ్రైయర్:

దీనిలో ఉపయోగించిన పవర్‌ఫుల్ పల్సేటర్ వాషింగ్ టబ్‌లో నీటిని వేగంగా తిప్పుతుంది. దీని వల్ల డిటర్జెంట్ బట్టల ప్రతి పొరలోకి చొచ్చుకుపోయి మురికిని తొలగిస్తుంది. అలాగే డ్రైయర్ (స్పిన్ టబ్) చాలా ఫాస్ట్‌గా తిరగడం వల్ల బట్టల్లో ఉన్న తేమ క్షణాల్లో ఆరిపోతుంది. వర్షా కాలంలో లేదా ఆరుబయట ఎండ లేని సమయంలో కూడా బట్టలు వేగంగా ఎండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

మన్నికైన డిజైన్ & ఈజీ మూవ్‌మెంట్:

Advertisement

ఈ వాషింగ్ మెషీన్ బాడీ తుప్పు పట్టని ప్లాస్టిక్ మెటీరియల్‌తో వస్తుంది. అందుకే తడి ప్రదేశాల్లో లేదా బాత్రూమ్‌లలో పెట్టినా బాడీకి ఎలాంటి ప్రమాదం ఉండదు. అంతేకాకుండా దీనికి ఇచ్చిన పవర్‌ఫుల్ వీల్స్ వల్ల మెషీన్‌ను ఇంట్లో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చాలా ఈజీగా జరుపుకోవచ్చు.

Also Read: రూ. 2వేలలోపు బెస్ట్ BLDC ఫ్యాన్ కావాలా? దీనిపై ఓ లుక్కేయండి

పెద్ద టబ్ & ఇన్-బిల్ట్ స్క్రబ్బర్:

8.2 కిలోల పెద్ద కెపాసిటీ ఉండటం వల్ల ఒకేసారి బెడ్‌షీట్లు, జీన్స్, కాటన్ బట్టలు, భారీ బట్టలను ఈజీగా ఉతకవచ్చు. టబ్ పైభాగంలో ఇచ్చే ఇన్-బిల్ట్ స్క్రబ్బర్ మోచేతులు లేదా కాలర్ల దగ్గర ఉన్న ఎక్కువ మురికిని ఉతికే ముందు తేలిగ్గా రుద్దడానికి అనువుగా ఉంటుంది.

కరెంట్ & వాటర్ సేవింగ్:

సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ల వల్ల ఉన్న ప్రధాన ప్రయోజనం నీటిని, కరెంట్ ను మన అవసరానికి తగినట్లు నియంత్రించుకోవడమే. వర్ల్‌పూల్ మోడల్ తక్కువ కరెంట్‌తోనే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది.

మీరు రూ. 15వేల బడ్జెట్‌లో ఎక్కువ కెపాసిటీ, మొండి మరకలను వదిలించే సూపర్ సోక్ ఫీచర్ , ఎక్కువ కాలం పాడవకుండా ఉండే బ్రాండెడ్ వాషింగ్ మెషీన్ కోసం చూస్తుంటే, Whirlpool 8.2 kg ACE SUPER SOAK కచ్చితంగా ఒక పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్.

Related News

ఇంటి పైకప్పుపై వాటర్ బాటిల్ ట్రిక్.. 30 దేశాల్లో సూపర్ సక్సెస్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌తో కాకుండా.. మెటల్‌‌ తోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

Big Stories

Advertisement
×