E-Paper
Advertisement

Viral Reels Strategy: రీల్స్, షార్ట్స్‌‌లోని మూవీ క్లిప్స్‌ పోస్టుల్లో సినిమా పేర్లు ఎందుకు చెప్పరు? ఇంత కుట్ర ఉందా?

Viral Reels Strategy: రీల్స్, షార్ట్స్‌‌లోని మూవీ క్లిప్స్‌ పోస్టుల్లో సినిమా పేర్లు ఎందుకు చెప్పరు? ఇంత కుట్ర ఉందా?
Advertisement

Viral Reels Strategy: సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ గానీ యూట్యూబ్ షార్ట్స్ గానీ చూస్తున్నప్పుడు మనకు బాగా నచ్చిన ఏదైనా మూవీ క్లిప్ కనిపిస్తే, అబ్బా.. సీన్ బాగుందే, ఏ సినిమా ఇది? అని వెంటనే క్యాప్షన్ చెక్ చేస్తాం. తీరా చూస్తే అక్కడ సినిమా పేరు ఉండదు. పోనీ కామెంట్ సెక్షన్ చూద్దామంటే, అక్కడ వందల మంది మూవీ నేమ్ బ్రో? అని అడుగుతుంటారు కానీ ఎవ్వరూ చెప్పరు. వీళ్లకు సినిమా పేరు రాయడానికి అంత బద్ధకమా లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? అంటే.. అవుననే చెప్పాలి. ఇది కేవలం మర్చిపోయి చేసే పని కాదు, దీని వెనుక పక్కా అల్గారిథమ్ లెక్కలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు సింపుల్‌గా తెలుసుకుందాం రండి..

కామెంట్లతో పెరిగే క్రేజ్..

క్రియేటర్లు సినిమా పేరు చెప్పకపోవడానికి మెయిన్ రీజన్ ఎంగేజ్‌మెంట్. సోషల్ మీడియా అల్గారిథమ్ ఒక వీడియోను పది మందికి చూపించాలంటే, ఆ వీడియోకు ఎన్ని లైకులు, ముఖ్యంగా ఎన్ని కామెంట్లు వచ్చాయనేది చూస్తుంది. ఒక క్లిప్ చూసి పేరు తెలియకపోయేసరికి, నెటిజన్లు సహజంగానే కామెంట్ బాక్స్‌లో మెసేజులు చేస్తారు. ఇలా వందల సంఖ్యలో కామెంట్లు రావడం వల్ల ఆ వీడియో చాలా పాపులర్ అని అల్గారిథమ్ భావిస్తుంది. ఫలితంగా ఆ వీడియోను మరింత మందికి ప్రమోట్ చేస్తుంది. అంటే.. మన కామెంట్లే వారి వ్యూస్ పెరగడానికి పెట్టుబడి అన్నమాట.

Advertisement

Also Read: బ్యాటరీతో పనిచేసే ఇండెక్షన్ స్టవ్.. జస్ట్ రీఛార్జ్ చేస్తే చాలట, ఎక్కడైనా వండేసుకోవచ్చు!

కాపీరైట్ భయం..

మరో ముఖ్యమైన కారణం కాపీరైట్ ఇబ్బందులు. సాధారణంగా పెద్ద సినిమా కంపెనీలు తమ కంటెంట్‌ను ఇతరులు వాడుకుంటే స్ట్రైక్స్ వేస్తుంటాయి. సినిమా పేరును ట్యాగ్ చేసినా లేదా క్యాప్షన్‌లో రాసినా, ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ టూల్స్ ద్వారా ఆ వీడియోలను గుర్తించడం యజమానులకు చాలా ఈజీ అయిపోతుంది. అందుకే నేరుగా పేరు చెప్పకుండా తప్పించుకోవడానికి కొందరు ఈ ట్రిక్ ఉపయోగిస్తారు. టెక్నాలజీ పెరిగాక ఇది పెద్దగా వర్కవుట్ కాకపోయినా, ఇప్పటికీ చాలామంది క్రియేటర్లు దీన్నొక రక్షణ కవచంలా వాడుకుంటుంటారు.

స్మార్ట్ స్ట్రాటజీ..

Advertisement

కంటెంట్ క్రియేటర్లు మనలో క్యూరియాసిటీని పెంచడమే కాకుండా.. ఏదైనా సీన్ ఇంట్రెస్టింగ్‌గా ఉండి, ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలనే ఆత్రుత మనలో పెరిగినప్పుడు.. పేరు తెలియకపోతే ఆ వీడియోను మళ్లీ మళ్లీ చూడటం లేదా సేవ్ చేసుకోవడం లాంటివి చేసేలా మనల్ని ప్రేరేపిస్తుంటారు. ఇలాంటి యాక్టివిటీ పెరిగే కొద్దీ ఆ రీల్ వైరల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వ్యూయర్స్ చిరాకు పడుతున్నారని తెలిసినా, పేజీ గ్రోత్ కోసం క్రియేటర్లు ఈ దారినే ఎంచుకుంటున్నారు. ఇది చిన్న విషయమే అనిపించినా, సోషల్ మీడియాలో వ్యూస్ పెంచుకోవడానికి ఇదొక స్మార్ట్ బిజినెస్ ప్లాన్ అయిపోయింది.

Also Read: బెస్ట్ బడ్జెట్ ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్.. స్మార్ట్ ఫీచర్లు ఎక్కువ.. కరెంట్ వాడకం తక్కువ!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×