E-Paper
Advertisement

Window vs Split vs Studio AC: రూమ్ చిన్నదా.. బడ్జెట్ తక్కువనా.. సామాన్యులకు వీటిలో ఏది పర్ఫెక్ట్ ఏసీ?

Window vs Split vs Studio AC: రూమ్ చిన్నదా.. బడ్జెట్ తక్కువనా.. సామాన్యులకు వీటిలో ఏది పర్ఫెక్ట్ ఏసీ?
Advertisement

Window AC vs Split AC vs Studio AC: వేసవిలో ఏసీలకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భానుడి భగ భగల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఏసీలను ఆశ్రయిస్తుంటారు. అయితే కొత్తగా ఏసీ కొనాలని భావించే వారికి సంప్రదాయ విండో, స్ప్లిట్ ఏసీలతో పాటు కొత్తగా స్టూడియో ఏసీలు అందుబాటులో వచ్చాయి. మరి వీటిలో ఏది తక్కువ బడ్జెట్‌లో లభిస్తుంది? మీ గదికి ఏది వేగంగా కూలింగ్ ఇస్తుంది? వంటి విశేషాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

విండో ఏసీ.. బడ్జెట్ ఫ్రెండ్లీ ఛాయిస్

తక్కువ ఖర్చుతో ఏసీ కొనాలనుకుంటే ‘విండో ఏసీ’ (Window AC) బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇవి స్ప్లిట్ ఏసీల కంటే చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఒకే యూనిట్ కావడం వల్ల ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ అద్దె ఇంట్లో ఉంటూ తరచూ ఇళ్లు మారుతుంటే.. ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. 100 నుండి 120 చదరపు అడుగులు ఉండే చిన్న గదులకు విండో ఏసీలు.. సమర్థవంతంగా కూలింగ్ ను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇతర ఏసీలతో పోలిస్తే.. వీటిలో నాయిస్ కాస్త ఎక్కువగా రావడం ఇబ్బంది పెట్టవచ్చని పేర్కొంటున్నారు.

స్ప్లిట్ ఏసీ.. కూలింగ్‌కు కేరాఫ్

Advertisement

ప్రస్తుతం అత్యధిక మంది ప్రజలు.. ‘స్ప్లిట్ ఏసీ’ (Split AC) లనే వినియోగిస్తున్నారు. వీటిలో ఇండోర్, అవుట్‌డోర్ అని రెండు యూనిట్లు ఉంటాయి. ఇవి చిన్న గదులతో పాటు పెద్ద రూమ్స్ ను సైతం అత్యంత వేగంగా, మూలమూలల సమర్థవంతగా కూల్ చేసేస్తాయి. దీని కంప్రెషర్ బయట ఉండటం వల్ల గదిలో అస్సలు శబ్దం రాదు. మెరుగైన కూలింగ్ తో పాటు ప్రశాంతమైన నిద్రను కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. అయితే విండో ఏసీలతో పోలిస్తే.. వీటి ధర, ఇన్ స్టాలేషన్ ఖర్చులు ఎక్కువనే చెప్పాలి. అయితే లేటెస్ట్ టెక్నాలజీ స్ప్లిట్ ఏసీలు.. విద్యుత్ ను పొదుపుగా వినియోగిస్తూ పవర్ బిల్లును గణనీయంగా తగ్గిస్తుండటం విశేషం. తద్వారా మీరు అదనంగా పెట్టిన డబ్బును రాబోయే 1-2 ఏళ్లల్లోనే రాబట్టుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

స్టూడియో ఏసీ

స్టూడియో అపార్ట్‌మెంట్లు, ఓపెన్ సింగిల్ రూమ్స్ (బెడ్‌రూమ్, కిచెన్ కలిపి ఉండేవి) కోసం ప్రత్యేకంగా ‘స్టూడియో ఏసీ’ (Studio/Portable/AI Convertible AC) లను వాడుతున్నారు. స్టూడియో రూమ్‌లలో వంట చేయడం వల్ల ఒకవైపు వేడి, పడుకునే చోట మరో రకమైన ఉష్ణోగ్రత ఉంటుంది. దీనిని తట్టుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కన్వర్టిబుల్ స్ప్లిట్ ఏసీలు లేదా పోర్టబుల్ ఏసీలను స్టూడియో ఏసీలుగా పిలుస్తున్నారు. ఇవి గదిలోని హీట్ లోడ్‌ను బట్టి కూలింగ్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తాయి. వీటిలో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉండటం వల్ల ధర చాలా ఎక్కువగా ఉంటాయి.

Advertisement

Also Read: రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ఫైనల్గా గదికి ఏది బెస్ట్?

బడ్జెట్ తక్కువగా ఉండి, గది చిన్నదైతే విండో ఏసీ తీసుకోవడం బెటర్. అలా కాకుండా తక్కువ శబ్దం, అట్రాక్టివ్ లుక్‌తో పాటు వేగవంతమైన కూలింగ్ కావాలనుకుంటే స్ప్లిట్ ఏసీ బెస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు. అదే మీది ఓపెన్ కిచెన్‌తో కూడిన మోడరన్ స్టూడియో రూమ్ అయితే.. స్మార్ట్ ఫీచర్లు ఉన్న ఇన్వర్టర్ స్ప్లిట్/స్టూడియో ఏసీని ఎంచుకోవడం బెటరని స్పష్టం చేస్తున్నారు. మెుత్తంగ మీ అవసరం, అభిరుచి, బడ్జెట్ కు తగ్గట్లు ఉన్న ఏసీని మీరే ఎంచుకోండి.

Also Read: ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×