Wobble 1 Smartphone: టెక్ ప్రపంచంలో సరి కొత్త ఫోన్లు మార్కెట్ లో విడుదల అవుతూనే ఉంటాయి. అందులో వున్న ఫీచర్లు, తక్కువ ధరతో వినియోగదారులను ఆకట్టుకునే విధంగా కంపెనీలు ఫోన్లను విడుదల చేస్తుంటారు. అందులో వొబుల్ 1 ఫోన్. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ సౌకర్యంతో రాబోతున్న 5జి స్మార్ట్‌ఫోన్. వినియోగదారుడి అవసరాన్ని బట్టి రెండు నానో సిమ్‌లు లేదా ఒక సిమ్‌తో పాటు మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం ఇచ్చే హైబ్రిడ్ సిమ్ స్లాట్ కూడా ఇందులో భాగమే. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ఈ ఫోన్‌లో మోటో ఏఐ ఇచ్చే సహకారం మొత్తం వాడుక అనుభవాన్ని మరింత సులభంగా మారుస్తుంది.
అమోలేడ్ డిస్‌ప్లే
ఇప్పుడు ఈ ఫోన్‌లో అత్యంత ఆకర్షణీయమైన అంశం డిస్‌ప్లే. 6.7 అంగుళాల అమోలేడ్ స్క్రీన్, బిలియన్ రంగులను ప్రదర్శించగల సామర్థ్యం, 1080 x 2400 పిక్సెల్స్ స్పష్టత, 120Hz రిఫ్రెష్ రేట్ అన్నీ అనుభవాన్ని సినిమాటిక్ స్థాయికి తీసుకెళ్తుంది. ఫోన్‌ను పట్టుకుని స్క్రోల్ చేసినా, వీడియోలు, గేమింగ్ ఆడినా గ్లాసీగా కనిపిస్తుంది. పంచ్-హోల్ కెమెరా ఉంచిన తీరు డిస్‌ప్లేపై ఎక్కడా లాగ్ లేకుండా చేస్తుంది. వీడియోలు ఎక్కువగా చూసే వారికి ప్రత్యేకంగా నచ్చే అంశం.
మెడియటేక్ డిమెంసిటీ 7400 చిప్‌సెట్
పర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో మెడియటేక్ డిమెంసిటీ 7400 చిప్‌సెట్ 8జిబి ర్యామ్‌తో కలిసి పనిచేస్తుంది. ఇది యాప్‌లు తెరవడం నుంచి అనేక యాప్‌లు ఒకేసారి నడపడం వరకు సాఫీగా సాగుతుంది. 2.6GHz వేగంతో నడిచే ఆక్సా-కోర్ ప్రాసెసర్ ప్రతిరోజు పనుల్లో ఆలస్యం లేకుండా పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఇచ్చే సెక్యూరిటీ ఫీచర్లు, పనితీరును మరింత సులభంగా మారుస్తుంది. మోటొ ఏఐ ఉండటం వల్ల వాయిస్‌తో పనులు చెప్పగానే స్పందించే ఫెసిలిటీ అమర్చారు. వినియోగదారుడి వాడుక అలవాట్లను గమనించి తగిన సూచనలు ఇవ్వడం, అవసరమైనప్పుడు ఆటోమోటిక్‌గా కొన్ని పనులు నిర్వహించడం వంటివి మొత్తం అనుభవాన్ని మరింత స్మార్ట్‌గా మారుస్తాయి.
కెమెరా 8ఎంపి అల్ట్రా వైడ్ లెన్స్
కెమెరా విభాగంలో వొబుల్ 1 మంచి సామర్థ్యాన్ని అందిస్తుంది. వెనుక భాగంలో ఉన్న 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ లైటింగ్ తక్కువగా ఉన్న సందర్భాల్లో కూడా ఫొటోలు స్పష్టంగా రాబట్టే సామర్థ్యం కలిగిస్తుంది. ఒఐఎస్ సహాయంతో వీడియోలు తీయగానే చేయి కదులుతున్నా కూడా క్లారిటీని అందిస్తుంది. దీనితో కలిపి ఇచ్చిన 8ఎంపి అల్ట్రా వైడ్ లెన్స్ పెద్ద ఫ్రేమ్ అవసరమయ్యే సందర్భాల్లో, ముఖ్యంగా గ్రూప్ షాట్లు లేదా ఓపెన్ ఏరియా కవరేజ్ తీసేటప్పుడు మరింత వివరంగా బంధించేందుకు సహకరిస్తుంది.
వీడియో రికార్డింగ్
వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే, 1080p 60fps నుంచి 4K 30fps వరకు ఎంపికలు ఇవ్వడం కంటెంట్ తయారుచేసే వారికి నిజంగా ఉపయోగం అనే చెప్పాలి. ఫ్రంట్ భాగంలోని 32ఎంపి కెమెరా స్పష్టమైన సెల్ఫీలు మాత్రమే కాదు, ఫుల్ హెచ్‌డి వీడియో రికార్డింగ్ వల్ల వీడియో కాల్స్ సమయంలో ఫేస్ క్లారిటీగా కనిపిస్తుంది.
5000mAh సామర్థ్యంతో బ్యాటరీ
బ్యాటరీ విషయానికి వస్తే, 5000mAh శక్తి ఉన్న ఈ ఫోన్ సాధారణ వినియోగం నుంచి కొంచెం అధిక వినియోగం వరకూ రోజంతా నిలబడే సామర్థ్యం ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు అనుకూలంగా ఉండటం, బాక్స్‌లోనే ఇచ్చే 33W ఛార్జర్ వల్ల ఛార్జింగ్ సమయం తగ్గిపోతుంది. కనెక్టివిటీ పరంగా 5జి నుంచి డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.4, యుఎస్‌బి-సి పోర్ట్ వరకు ప్రతీ అంశం అందులో భాగమే. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యాక్సిలరోమీటర్, మాగ్నటోమీటర్, జైరోస్కోప్ వంటి సంస్కరణలు ఫోన్‌ను బహుముఖంగా మార్చుతాయి.
ఇండియాలో ధర ?
ఈ ఫోన్ 8 జిబి రామ్ ప్లస్ 128 జిబి వేరియంట్ కోసం ఇండియాలో రూ. 19,990 నుండి ప్రారంభమవుతుందని టాక్. వొబుల్ 1 మిడ్ రేంజ్ విభాగంలో ఈ స్థాయి ఫీచర్లు ఇవ్వడం ఈ మోడల్‌ని మరింత ఆకర్షణీయంగా నిలబెడుతుంది. నవంబర్ 19, 2025న విడుదల కానున్న ఈ మిడ్ రేంజ్ మొబైల్, అధునాతన సదుపాయాలు ఉన్నప్పటికీ వినియోగదారుడి బడ్జెట్‌కి భారంగా కాకుండా రూపొందించబడింది.