E-Paper
Advertisement

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!
Advertisement

XElectron Projector: ఈ రోజుల్లో ఇంట్లోనే థియేటర్ వాతావరణాన్ని ఆస్వాదించడానికి చాలామంది ప్రాజెక్టర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రముఖ టెక్ బ్రాండ్ ‘ఎక్స్‌ఎలెక్ట్రాన్’ (XElectron) బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లతో కూడిన సరికొత్త ‘ఆండ్రాయిడ్ 14’ ప్రాజెక్టర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి ఇది ఒక సరికొత్త ఛాయిస్‌గా మారనుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్

ఈ ప్రాజెక్టర్ ప్రత్యేకత ఏంటంటే.. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 (Android 14) ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. దీనివల్ల ప్రాజెక్టర్ యుజర్ ఇంటర్‌ఫేస్ చాలా స్మూత్‌గా, వేగంగా ఉంటుంది. అంతేకాకుండా యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి ప్రముఖ స్ట్రీమింగ్ యాప్‌లు ఇందులో ముందే ఇన్‌స్టాల్ అయి వస్తాయి. కాబట్టి మీరు ఏ విధమైన ఎక్స్‌టర్నల్ డివైజ్‌లు కనెక్ట్ చేయకుండానే నేరుగా ఫేవరెట్ సినిమాలు, షోలను వీక్షించవచ్చు.

థియేటర్ రేంజ్ సౌండ్..

Advertisement

సాధారణంగా బడ్జెట్ ప్రాజెక్టర్లలో సౌండ్ క్వాలిటీ అంతగా ఉండదు, కానీ ఎక్స్‌ఎలెక్ట్రాన్ ఈ విషయంలో కాంప్రమైజ్ ఏమాత్రం రాజీ పడలేదు. ఇందులో 20W శక్తివంతమైన స్పీకర్లను అందించారు. ఇవి హోమ్ థియేటర్ రేంజ్ అనుభూతిని అందిస్తాయి. దీంతో అదనంగా బ్లూటూత్ స్పీకర్లు, సౌండ్ బార్లను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు.

ఫాస్ట్ కనెక్టివిటీ కోసం వైఫై 6!

వీడియోలు ఎలాంటి బఫరింగ్ లేకుండా వేగంగా ప్లే అవ్వడానికి ఇందులో WiFi 6 టెక్నాలజీని అందించారు. పాత వైఫై వెర్షన్లతో పోలిస్తే ఇది ఫాస్ట్ గా ఉంటుంది. దీనివల్ల HD, 4K కంటెంట్‌ను కూడా ఎటువంటి బఫరింగ్ లేకుండా హై-స్పీడ్‌లో స్ట్రీమ్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: ‘ఆమెతో ఏడాదిగా రిలేషన్.. ఆధారాలు ఉన్నాయి’.. సూసైడ్ నోట్‌లో ట్రెయినీ ఐపీఎస్ సంచలనాలు!

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలోనే..

అధునాతన సాఫ్ట్‌వేర్, మెరుగైన ఆడియో, లేటెస్ట్ వైఫై టెక్నాలజీ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నప్పటికీ ఎక్స్‌ఎలెక్ట్రాన్ దీనిని సామాన్యులకు అందుబాటులో ఉండేలా అత్యంత సరసమైన ధరకే తీసుకొచ్చింది. రూ.6,990 కే దీనిని సేల్ చేస్తోంది. అమెజాన్ లో ఈ ప్రాడక్ట్ ను కొనుగోలు చేయవచ్చు. దీనిపై ఏడాది వారంటీ కూడా అందుబాటులో ఉంది. ఇంట్లోనే మినీ థియేటర్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి, బడ్జెట్‌లో మంచి ప్రాజెక్టర్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: మంత్రి ఉత్తమ్ తీపికబురు.. మేడిగడ్డ బ్యారేజీ కదలికలపై తుది రిపోర్టు రెడీ!

Related News

అమ్మో..ఈ మిక్సర్ గ్రైండర్స్ ఇంత స్మార్టా? మీ టైమ్, మనీ ఆదా చేసే టాప్ 5 మిక్సర్లు ఇవే!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

Big Stories

Advertisement
×