Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు తాజాగా ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే ఈ అవార్డుల్లో ఏకంగా రెండు అవార్డులని సొంతం చేసుకొని సత్తా చాటిన సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’.నాస్టాల్జిక్ విలేజ్ డ్రామాగా, ఫ్రెండ్ షిప్, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ‘ఉత్తమ తెలుగు చిత్రం’ కేటగిరీతో పాటు ‘ఉత్తమ మేకప్’ విభాగంలోనూ నేషనల్ అవార్డులను కైవసం చేసుకోవడంతో ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఫణి అడపాక ఎమోషనల్ అవుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
తెలుగు ప్రేక్షకులకే ఈ జాతీయ అవార్డులు అంకితం
దేశంలో ఎన్నో సినిమాలు అవార్డుల కోసం పోటీ పడుతుంటే జాతీయ అవార్డుల రేసులో తమ చిన్న సినిమా ఇలా రెండు కేటగిరీల్లో అవార్డులని దక్కించుకోవడం మాటల్లో చెప్పలేనంటూ ఎమోషనల్ అయిపోయారు. ఒక నిర్మాతగా తొలి దశలోనే ఈ రేంజ్ గుర్తింపు రావడం నిజంగా దేవుడు ఇచ్చిన వరమని,అయితే ఈ గెలుపు క్రెడిట్ అంతా తన ఒక్కడిదే కాదని.. యదు వంశీ విజన్, నటీనటులు న్యాచురల్ యాక్టింగ్ , టెక్నీషియన్స్ యొక్క కష్టం ఇలా అందరు అంకిత భావంతో పని చేయబట్టే ఇది పాజిబుల్ అయిందని చెప్పుకొచ్చారు.ఈ జర్నీలో తనకు తోడుగా నిలిచిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ టీమ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఆయన, మొదటి రోజు నుంచే ఈ చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకే ఈ జాతీయ అవార్డులను అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.
also read:కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు
ఇక ఈ జాతీయ పురస్కారాలు రావడం తమపై బాధ్యత మరింత పెంచిందని స్పష్టం చేశారు ఫణి అడపాక. మారుతున్న ఆడియన్స్ టేస్ట్‌కి తగ్గట్టుగా బిగ్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కోసం కూడా మైండ్ బ్లోయింగ్ కంటెంట్ రెడీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఈటీవీ విన్’ (ETV Win) తో కలిసి కొన్ని ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు, డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, కాలంతో పాటు నిలిచిపోయే కథలతో ముందుకు వస్తామని, తెలుగు సినిమా స్టామినాను నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో తీసికెళ్లడానికి నిరంతరం కృషి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
చిన్న సినిమలాకి పెద్ద ఇన్స్పిరేషన్
ఇక ఫణి అడపాక జర్నీ చూస్తే ..2024 ఫిబ్రవరి 23న థియేటర్లలోకి వచ్చిన’సిద్ధార్థ్ రాయ్’అనే సినిమాతో మొదలైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోలా కొట్టినా,ఆ తర్వాత కోలుకొని నిహారిక కొణిదెల ఆధ్వర్యంలోని ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌తో చేయి కలిపి ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మించే అవకాశం దక్కించుకున్నారు.ఇక పల్లెటూరి వాతావరణం, 90ల నాటి జ్ఞాపకాలు, స్నేహితుల మధ్య భావోద్వేగాలను దర్శకుడు యదు వంశీ అద్భుతంగా ఆవిష్కరించడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.మొత్తంగా చిన్న సినిమాగా వచ్చిన ఈ కమిటీ కుర్రాళ్ళు అటు అటు కమర్షియల్ గానూ, ఇటు అవార్డ్స్ ని దక్కించుకొని చిన్న సినిమలాకి పెద్ద ఇన్స్పిరేషన్ గా నిలిచిందనే చెప్పాలి.