E-Paper
Advertisement

ఇంటర్నెట్, సిగ్నల్ లేకపోయినా కాల్స్ మాట్లాడుకోవచ్చు.. Xiaomi 17Tలో మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు!

ఇంటర్నెట్, సిగ్నల్ లేకపోయినా కాల్స్ మాట్లాడుకోవచ్చు.. Xiaomi 17Tలో మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు!
Advertisement

Xiaomi 17T: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమి తమ సరికొత్త మొబైల్ Xiaomi 17Tని జూన్ 4న భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. యూరప్‌లో జరిగిన గ్లోబల్ ఈవెంట్‌ ద్వారా దీని స్పెసిఫికేషన్లు అందరికీ తెలిసినప్పటికీ, ఇండియాలో దీని ధర ఎంత ఉండబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా అందిన లీకుల ప్రకారం, యూరప్ ధరతో పోలిస్తే ఇండియాలో ఈ ఫోన్ చాలా తక్కువ ధరకే లభించనుంది. యూరప్‌లో దీని ధర దాదాపు రూ.83 వేలు ఉండగా, భారత్‌లో మాత్రం రూ.70వేల లోపే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

లీకైన ధర వివరాలు:

తాజా లీక్స్ ప్రాకరం.. Xiaomi 17T బేస్ వేరియంట్ (12GB RAM + 256GB స్టోరేజ్) ధర సుమారు రూ.65,999గా ఉండొచ్చు. అయితే దీనిలో వచ్చే 512GB టాప్ వేరియంట్ ధరపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, వైలెట్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో వినియోగదారులకు లభించనుంది. ఈ ధరతో ఇది మార్కెట్లోని ఇతర బ్రాండ్ల ప్రీమియం ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

పోటీదారులకు గట్టి సవాల్:

Advertisement

ఈ లీకైన ధరను బట్టి చూస్తే Xiaomi 17T మార్కెట్లో Motorola Signature, Vivo X200T, Samsung Galaxy A56 వంటి మోడళ్లతో తలపడనుంది. అయితే వీటన్నింటికంటే ఈ ఫోన్ లో ఉన్న 6,500mAh భారీ బ్యాటరీ, లైకా బ్రాండింగ్‌తో వచ్చే 5x ఆప్టికల్ జూమ్ పెరిస్కోప్ కెమెరా దీనికి పెద్ద ప్లస్ పాయింట్లుగా మారనున్నాయి. ఈ బడ్జెట్లో ఇలాంటి ఫీచర్లు రావడం నిజంగా విశేషమనే చెప్పాలి.

Also Read: ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు వాట్సప్ బంపర్ ఆఫర్.. ఇక యాప్‌లోనే వరల్డ్ కప్ లైవ్ అప్‌డేట్స్!

ఫోన్ లోపలే కూలింగ్ సిస్టమ్:

Advertisement

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.59 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఫోన్ వేగవంతమైన పనితీరు కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అలాగే ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి సరికొత్త కూలింగ్ సిస్టమ్‌ను కూడా జోడించారు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3 సాఫ్ట్‌వేర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.

ఇంటర్నెట్ లేకపోయినా కాల్స్:

ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఇందులో లైకా ట్యూన్డ్ 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ కెమెరా ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 6,500mAh బ్యాటరీతో పాటు 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. వీటన్నింటితో పాటు ఇంటర్నెట్ లేకపోయినా 1.3 కిలోమీటర్ల దూరం వరకు మాట్లాడుకునేందుకు వీలుగా ‘ఆస్ట్రో కమ్యూనికేషన్’ అనే ప్రత్యేక ఫీచర్‌ను కూడా దీనిలో తీసుకువస్తున్నారు.

Also Read: ఈ ఫీచర్లు తెలిస్తే అస్సలు వదలరు.. సింగిల్ ఛార్జ్‌తో 55 గంటలు రన్ అయ్యే వివో కొత్త ఇయర్‌బడ్స్!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×