E-Paper
Advertisement

ఇలాంటి డివైజ్ కోసమే కదా ఇన్నాళ్లూ వెయిటింగ్.. జస్ట్ 3 సెకెండ్స్‌లో హాట్ వాటర్, ఐస్ క్యూబ్స్ రెడీ!

ఇలాంటి డివైజ్ కోసమే కదా ఇన్నాళ్లూ వెయిటింగ్.. జస్ట్ 3 సెకెండ్స్‌లో హాట్ వాటర్, ఐస్ క్యూబ్స్ రెడీ!
Advertisement

Mijia Dispenser Max: స్మార్ట్ హోమ్ విభాగంలో షావోమీ మరో అద్భుతమైన ప్రయోగానికి తెరలేపింది. రోజువారీ జీవితాన్ని మరింత సులభతరం చేసేలా సరికొత్త ‘మిజియా ఇన్‌స్టంట్ హాట్ వాటర్ డిస్పెన్సర్ మాక్స్ ఐస్ మేకర్ ఎడిషన్‌‌’ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. కేవలం 3 సెకన్లలోనే వేడి నీళ్లను అందించడంతో పాటు.. ఆటోమేటిక్‌గా ఐస్ క్యూబ్స్‌ను తయారు చేయడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం చైనాలో క్రౌడ్‌ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన ఈ గ్యాడ్జెట్ ధర దాదాపు రూ.23,000 వరకు ఉండొచ్చు.

చిటికెలో వేడి నీళ్లు..

ఈ డివైజ్ సహాయంతో వేడి నీళ్ల కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సిన పని లేదు. ఇందులో అమర్చిన 2,050 వాట్ల శక్తివంతమైన హీటింగ్ సిస్టమ్ ద్వారా కేవలం మూడంటే మూడు సెకన్లలోనే నీళ్లు వేడెక్కుతాయి. టీ, కాఫీ లేదా ఇతర వేడి పానీయాలు క్షణాల్లో తయారు చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

Advertisement

Also Read: అద్భుతమైన సోనీ సెన్సార్స్, 4K వీడియో.. రూ.30 వేలలో టాప్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ ఇవే!

స్మార్ట్‌ఫోన్‌తో కంట్రోల్..

ఇది ఒక స్మార్ట్ డివైజ్ కాబట్టి.. దీన్ని Mi Home యాప్ ద్వారా మన మొబైల్ నుంచే సులభంగా ఆపరేట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా 40°C నుండి 90°C మధ్య ఎంత ఉష్ణోగ్రత కావాలో అంతకు సెట్ చేసుకోవచ్చు. ప్యాక్ చేసిన ఫార్ములా మిల్క్ నుండి గ్రీన్ టీ వరకు దేనికైనా సరిపోయేలా నీటి వేడిని మనమే స్వయంగా మార్చుకునే వీలుంది.

స్వచ్ఛమైన ఐస్ క్యూబ్స్..

Advertisement

వేడి నీళ్లతో పాటు చల్లని పానీయాల కోసం ఐస్ క్యూబ్స్‌ను కూడా ఇది ఆటోమేటిక్‌గా తయారు చేస్తుంది. నీటిని నిరంతరం సర్క్యులేట్ చేసే టెక్నాలజీ వల్ల, గాలి బుడగలు లేకుండా చాలా క్లియర్‌గా ఉండే ఐస్ ముక్కలు తయారవుతాయి. దీని స్టోరేజ్ బాక్స్‌లో ఒకేసారి 40కి పైగా ఐస్ క్యూబ్స్ దాచుకోవచ్చు. కేవలం ఒక బటన్ నొక్కితే చాలు.. ఐస్ ముక్కలు నేరుగా బయటకు వచ్చేస్తాయి.

ఆటోమేటిక్ క్లీనింగ్..

ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ షావోమీ ఇందులో UV యాంటీ బాక్టీరియల్ లైటింగ్‌ను అందించింది. దీనివల్ల నీరు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటుంది. అంతేకాదు.. లోపలి పైపులను, ఐస్ స్టోరేజ్ ఏరియాను ఎక్కువ ఉష్ణోగ్రతతో ఆటోమేటిక్‌గా క్లీన్ చేసుకునే సదుపాయం కూడా ఇందులో ఉంది. మన ఇంటి అవసరాలకు ఇదొక పర్‌ఫెక్ట్ ఆల్‌రౌండర్ గ్యాడ్జెట్ అని చెప్పొచ్చు.

Also Read: ACల కంటే పవర్‌ఫుల్ గ్యాడ్జెటా? కరెంట్ ఆదా చేస్తూ ప్రకృతిని కాపాడే ఈ Heat Pumps కథేంటి?

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×