ఈ రోజులు చాలా మంది దగ్గర కంప్యూటర్స్ ఉంటున్నాయి. ఇంకొంత మంది ల్యాప్ టాప్స్ కూడా ఉపయోగిస్తున్నారు. అయితే, కీ బోర్డ్స్ మీద ఉన్న రెండు కీస్ కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. వాటిలో ఓకటి F కాగా మరొకటి J. ఈ రెండు కీస్ మీద చిన్న గీతల్లాంటి గుర్తులు ఉంటాయి. చాలా మంది ఈ గీతలు గుర్తించకపోవచ్చు. ఇంతకీ ఆ రెండు కీస్ మీద ఎందుకు చిన్న గీతలు ఉంటాయి? వాటితో కలిగే లాభం ఏంటి? ఒకవేళ లాభం ఉంటే, చాలా మంది వాటిని ఎందుకు పట్టించుకోరు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
కీబోర్డ్ పై ఉన్న రెండు కీస్ మీద ఉన్న చిన్న గీతల వెనుక చాలా కథ ఉంది. వాటిలో ముఖ్యమైనది.. వినియోగదారులు కీ బోర్డ్ మీదికి చూడకుండా వేళ్లను సరైన స్థానంలో ఉంచడానికి ఉపయోగపడుతాయి. ఈ గుర్తులు ‘టచ్ టైపింగ్’ టెక్నిక్ లో భాగంగా కొనసాగుతున్నాయి. ఇవి విజువల్ క్యూ కంటే మజిల్ మెమరీపై ఆధారపడే టైపింగ్ పద్ధతి. స్టాండర్డ్ QWERTY కీబోర్డ్ లే అవుట్ లో, ‘F’ ‘J’ కీస్ ఎడమ, కుడి చేతుల చూపుడు వేళ్లు ఉండాల్సిన స్థానాలను నిర్ణయిస్తాయి. మిగిలిన వేళ్లు సహజంగా హోమ్ వరుసలో సెట్ చేయబడతాయి. అంటే ఎడమ చేతికి A-S-D-F, కుడి చేతికి J-K-L- ఉంటాయి. చిన్న గీతలను టైపిస్టులు కేవలం ఒక టచ్ తో హోమ్ రో హ్యాండ్ పొజిషన్లను త్వరగా, కచ్చితంగా కనుగొనడంలో సహాయపడతాయి. ఈ టచ్ టైపింగ్ వేగం, కచ్చితత్వం, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ప్రొఫెషనల్ టైపిస్టులు, తరచుగా టైప్ చేసే వ్యక్తులకు ఈ గుర్తులు ఎంతగానో ఉపయోగపడుతాయి.
⦿ ‘F’ ‘J’ కీస్ టైపింగ్ చేసే వ్యక్తులు కీబోర్డ్ ను చూడాల్సిన అవసరం లేకుండా చేస్తాయి. స్క్రీన్ మీద ఫోకస్ పెట్టడంతో పాటు త్వరగా పని పూర్తి అయ్యేలా చేస్తాయి.
⦿ కొద్ది కాలం తర్వాత స్థిరమైన ఫింగర్ ప్లేస్ అనేది సమర్థవంతంగా టైపింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది.
⦿ సరైన వేలు స్థానం అనేది టైపింగ్ వేగం పెరిగేందుకు కీలకంగా మారుతుంది.
Read Also: బ్రేకప్ అయ్యింది.. లీవ్ కావాలి.. సీఈవోకు ఉద్యోగి మెయిల్!
ఈ చిన్న లైన్స్ అనేవి దాదాపు అన్ని కీబోర్డ్ లలో ఉంటాయి. డెస్క్ టాప్ కంప్యూటర్లతో పాటు ల్యాప్ టాప్ లలోనూ ఉంటాయి. కొన్ని టచ్ స్క్రీన్ కీబోర్డ్ లు, బ్రెయిలీ పరికరాల్లోనూ ఇలాంటి సౌలభ్యం ఉంటుంది. సో, మొత్తంగా ‘F’, ‘J’ కీలపై ఉన్న చిన్న గుర్తులు కేవలం డిజైన్ కాదు. అవి సరైన టైపింగ్‌కు చాలా ముఖ్యమైనవి. వినియోగదారులు త్వరగా, కచ్చితంగా టైప్ చేయడానికి అవకాశం కల్పిస్తాయి.
Read Also: నవంబర్ 1 నుంచి కొత్త ఆధార్ రూల్స్, అలా చేయకపోతే పాన్ కార్డ్ ఔట్!