E-Paper
Advertisement

YouTube: యూట్యూబ్ సేవలకు అంతరాయం.. పరిశీలిస్తున్నామన్న నిర్వాహకులు, టెన్షన్ పడిన యూజర్లు

YouTube: యూట్యూబ్ సేవలకు అంతరాయం.. పరిశీలిస్తున్నామన్న నిర్వాహకులు, టెన్షన్ పడిన యూజర్లు
Advertisement

YouTube: ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం ఉదయం భారత్, అమెరికా, యూకే సహా పలు దేశాల్లో యూజర్లు యూట్యూబ్ యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాప్‌ ఓపెన్ చేయగానే సమ్‌థింగ్ వెంట్ రాంగ్ అనే మెసేజ్ కనిపించింది. దీంతో చాలామంది ఆందోళనకు గురయ్యారు.

ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ సేవలకు అంతరాయం

Advertisement

ఆన్‌లైన్ సర్వీసుని పర్యవేక్షించే డౌన్‌ డిటెక్టర్ ప్రకారం.. అమెరికాలో దాదాపు 3.20 లక్షల మందికి పైగానే యూజర్లు ఈ సమస్యపై ఫిర్యాదు చేసినట్టు తేలింది. అందులో 74 శాతం మందికి యాప్‌లో సమస్యలు తలెత్తినట్టు తేలింది. మరో 16 శాతం మందికి వీడియో స్ట్రీమింగ్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయి. బుధవారం ఉదయం 6.30 నుంచి 7.30 గంటల మధ్యలో ఆ సంస్థకు దాదాపు 20 వేల మంది ఫిర్యాదులు చేశారు.

YouTube అనేది గ్లోబల్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్. దీనిద్వారా వినియోగదారులు రకరకాల కంటెంట్‌ను అప్‌లోడ్ చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా రకరకాలుగా ఉపయోగిస్తుంటారు. ఆ వ్యవస్థలో కొన్ని సమస్యల కారణంగా యూట్యూబ్‌లో వీడియోలు కనిపించడం ఆగిపోయాయి. దీని ప్రభావం ఎక్కువగా యూట్యూబ్ హోం పేజ్, యూట్యూబ్ యాప్, యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ కిడ్స్‌పై ప్రభావం చూపినట్టు రిపోర్టులు చెబుతున్నాయి.

Advertisement

టెన్షన్ పడిన యూజర్లు.. ఆపై ఫిర్యాదులు

అంతరాయం నేపథ్యంలో యూజర్లు పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యారు. తమ ఫోన్లలో యూట్యూబ్ కి లాగిన్ కాలేకపోయామని, ఖాతాలు మార్చుకో లేకపోతున్నామని పేర్కొన్నారు. తమ యూట్యూబ్ పేజీ మొత్తం ఖాళీగా కనిపిస్తోందని, కేవలం సైడ్‌బార్ పని చేస్తోందని మరికొందరు స్క్రీన్‌ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో యూట్యూబ్ యాజమాన్యం రియాక్ట్ అయ్యింది. ఈ సమస్య మా దృష్టికి వచ్చిందని, పరిశీలిస్తున్నామని పేర్కొంది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, తదుపరి అప్‌డేట్స్ తెలియజేస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది.సమస్యకు గల కారణాలు, సేవలు ఎప్పుడు పునరుద్ధరించబడతాయన్నది సదరు సంస్థ వెల్లడించలేదు.

ALSO READ: బిఎస్ఎన్ఎల్ కొత్త వార్షిక ప్లాన్‌కు ఫుల్ డిమాండ్

Related News

బెస్ట్ వాషింగ్ మెషీన్ కొనాలా? అమెజాన్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న మోడల్స్!

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

Big Stories

Advertisement
×