E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కిడ్నాపర్ల లొకేషన్‌ తెలుసుకున్న రాజ్‌, కావ్య

Brahmamudi Serial Today February 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కిడ్నాపర్ల లొకేషన్‌ తెలుసుకున్న రాజ్‌, కావ్య
Advertisement

Brahmamudi serial today Episode: 

కిడ్నాపర్ల లోకేషన్‌ తెలుసుకుని అక్కడికి వెళ్తారు రాజ్‌, కావ్య, పోలీస్‌. లోకేషన్‌లో ఎంత వెతికినా ఎవ్వరూ కనిపించరు. దీంతో కావ్య అనుమానంగా కిడ్నాప్‌ వీడియో మరోసారి చూస్తుంది. అప్పూ- కళ్యాణ్‌లను వాళ్లు ఇక్కడికి తీసుకురాలేదు.. కావాలనే మనల్ని తప్పుదోవ పట్టించారు. ఆ వీడియోలో ఉన్న కిటికీ, ఇంట్లో ఉన్న కిటికీ సంబంధం లేదు. అంటుంది. అయితే వీడియో ఒక ఫోన్‌ కనిపిస్తుంది. ఆ నెంబర్‌కు కావ్య ఫోన్‌ చేస్తుంది. ఫోన్‌లో యాడ్‌ కంపెనీ గురించి చెప్పగానే.. కావ్య తాము యాడ్‌ చేయించుకోవాలని ఆఫీసు లొకేషన్‌ షేర్‌ చేయమని అడుగుతుంది. ఫోన్‌ లో వ్యక్తి సరే అంటాడు. ఆ లోకేషన్‌ ఆధారంగా కావ్య, రాజ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతారు.

బందీగా ఉన్న అప్పుకు డెలివరీ పెయిన్స్‌ మొదలవుతాయి. దీంతో కళ్యాణ్‌ కంగారు పడతాడు. రౌడీలను బతిమాలుతాడు. మీకు ఎంత డబ్బు అయినా ఇస్తాను.. నా వైఫ్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లనివ్వండి అంటాడు. దీంతో రౌడీలు మాత్రం మిమ్మల్ని మేము వదిలిపెట్టము వదిలిపెడితే మేము బతకలేము అది మా సార్‌ ఆర్డర్‌ అని చెప్తాడు. అయితే కళ్యాణ్‌ మాత్రం మా అన్నయ్య అలాంటి వాడు కాదని మీరు కావాలని మా అన్నయ్య మీద అబాంఢాలు వేస్తున్నారని మీ వెనక ఎవరున్నారని నిలదీస్తాడు. దీంతో రౌడీలు కళ్యాణ్‌ మీద అరుస్తూ.. కోప్పడతారు. ఇక రాజ్‌, కావ్యలు లోకేషన్‌ ఆధారంగా అప్పు, కళ్యాణ్‌లు ఉన్న ప్లేస్‌కు వస్తారు. బయటి నుంచి లోపల ఉన్న అప్పును చూస్తారు. లోపల పెయిన్స్‌ తో బాధపడుతున్న అప్పును చూసి కావ్య బాధపడుతుంది. అప్పుకు డెలివరీ పెయిన్స్‌ వచ్చినట్టు ఉన్నాయి. ఏవండి మనం ఎలాగైనా లోపలికి వెళ్లాలి వెంటనే అంటుంది.

Advertisement

చూట్టూ రౌడీలు కాపలా ఉన్నారు ఎలా వెళ్లగలం.. అదిగో వెనక నుంచి వెళ్దాం పద అని వెళ్తారు. లోపలికి వెళ్లిన రాజ్‌, కావ్యలు అప్పు, కళ్యాణ్ ల కట్లు విప్పుతుంటారు. ఇంతలో రౌడీలు వస్తారు. రౌడీలతో రాజ్‌, కావ్య ఫైట్‌ చేస్తుంటారు. ఫైట్‌ చేస్తూనే రాజ్‌.. అప్పు, కళ్యాణ్‌ ల కట్లు విప్పేస్తాడు. అప్పును తీసుకుని వెళ్లిపోమ్మని కావ్యకు చెప్తాడు. కావ్య అప్పును తీసుకుని వెళ్లిపోతుంది. వెంటనే రౌడీలు  రుద్రాణికి ఫోన్ చేసి కళ్యాణ్ – అప్పూలు తప్పించుకున్నారని చెబుతారు. ఆ మాటలతో రుద్రాణి షాక్ అవుతుంది. రౌడీలు పట్టుకోవడానికి చాలా ట్రై చేశాం కానీ వాళ్లు పారిపోయారని చెబుతారు. దీంతో రుద్రాణి కోపంగా ఒక్కొక్కడు ఎద్దుల్లా ఉన్నారు.. ఇద్దరినీ కాపలా కాయలేకపోయారా…? చేత కాని దద్దమ్మల్లా వాళ్లను విడిచిపెట్టి నాకు ఫోన్‌ చేస్తారా..? మీరేం చేస్తారో నాకు తెలియదు.. వాళ్లు తప్పించుకోకూడదు. వాళ్లు కనుక ఎస్కేప్ అయితే నేను దొరికిపోతాను, కాబట్టి వాళ్లని ఎలాగైనా చంపేయండి. లేదంటే మిమ్మల్ని నేను చంపేయాల్సి వస్తుంది అంటూ రుద్రాణి వార్నింగ్‌ ఇవ్వడంతో రౌడీలు పరుగెత్తుకుంటూ వెళ్లి అప్పూ,  కళ్యాణ్‌లను రౌండప్‌ చేస్తారు.

ఒక రౌడీ కత్తితో అప్పును పొడవబోతుంటే.. రాజ్‌ వచ్చి అడ్డు పడతాడు. ఇంతలో కావ్య కారు తీసుకుని వచ్చి అప్పు, కళ్యాణ్‌ లను కారులో తీసుకుని హాస్పిటల్‌కు వెళ్తుంది. రాజ్‌ మాత్రం రౌడీలతో ఫైట్‌ చేస్తుంటాడు. హాస్పిటల్‌కు వెళ్లిన అప్పుకు డాక్టర్లు డెలివరీ చేస్తుంటారు. అప్పుడే దుగ్గిరాల కుటుంబం మొత్తం హాస్పిటల్‌కు వస్తుంది. ధాన్యలక్ష్మీ కంగారు పడుతూ.. అప్పూకి ఎలా ఉంది అని అడగ్గానే.. నొప్పులు బాగా ఎక్కువయ్యాయని డాక్టర్‌ చెక్‌ చేస్తున్నారు అని కళ్యాణ్ చెప్పగానే.. డాక్టర్‌ ఏం చెప్పారు అంటూ ఇంద్రాదేవి అడుగుతుంది. ఇంకా ఏం చెప్పలేదని కళ్యాణ్‌ చెప్పగానే.. అయ్యో దేవుడా అప్పుకు ఏమీ కాకూడదు అని ధాన్యలక్ష్మీ టెన్షన్‌ పడుతుంటే.. కావ్య ఓదారుస్తూ.. అప్పూకి ఏం కాదు  అంటూ ధైర్యం చెబుతుంది.

Advertisement

దీంతో ధాన్యలక్ష్మీ కోపంగా నువ్వు మాట్లాడొద్దు.. చేసిందంతా చేసి ఇప్పుడు సర్ది చెబుతున్నావా? ఎందుకు ఇదంతా? మీకు వాళ్లు ఏం ద్రోహం చేశారని ఈ కక్ష. మీరే నా కొడుకు కోడల్ని కిడ్నాప్ చేస్తారు.. మళ్లీ మీరే గొప్ప వాళ్లలా హాస్పిటల్‌లో చేరుస్తారు. మీ నాటకాలు మాకు తెలియవా? అంటూ కోప్పడుతుంది. కళ్యాణ్‌ ఆశ్చర్యంగా అన్నయ్య వదిన మమ్మల్ని కిడ్నాప్ చేయడం ఏంటి అమ్మ అంటూ కోప్పడతాడు. దీంతో ధాన్యలక్ష్మీ కోపంగా ఆస్తిలో నీ వాటా నీకు పంచివ్వాల్సి వస్తుందని.. మీ ఇద్దరినీ వీళ్లే కిడ్నాప్ చేయించారు అని చెప్పగానే.. కళ్యాణ్ కోపంగా ధాన్యలక్ష్మీని తిడతాడు. నువ్వు ఎవరిని తప్పుబడుతున్నావో? ఎవరి మీద నిందలు వేస్తున్నావో నీకు అర్ధం అవుతుందా? అన్నయ్య, వదినలని మాట అనే ముందు కాస్త వెనుక ముందు ఆలోచించు అమ్మ.. మమ్మల్ని కిడ్నాప్ చేశారు.. కానీ అన్నయ్య, వదినలు కిడ్నాప్ ఎందుకు చేస్తారు. ఎవరో కావాలని చేశారు..

మాకు ఏమి అర్ధం కాలేదు. ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియదు, డబ్బు వద్దంటారు.. కారణం చెప్పమంటే చెప్పరు. తప్పించుకునే వీలు లేదు.. అప్పూకి నొప్పులు మొదలయ్యాయి, అలాంటి టైంలో అన్నయ్య, వదిన ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడారు. సమయానికి అన్నయ్య, వదిన రాకపోయుంటే అప్పూ, నేను ఏమైపోయేవాళ్లమో. అన్నయ్య వదిన ఎలాంటి వాళ్లో తెలిసికూడా వాళ్ల మీద నిందలు వేస్తున్నావా అంటూ మండిపడతాడు. దీంతో ధాన్యలక్ష్మీ మీరు కిడ్నాప్ అయినట్లు వీడియో పంపారు.. అందులో రాజ్ మిమ్మల్ని కిడ్నాప్ చేశారని చెప్పారు కదా అనగానే..  అన్నయ్యే మమ్మల్ని కిడ్నాప్ చేయించాడని రౌడీలు మాట్లాడుకుంటుంటే మేం విన్నాం. అది ఎవరో చేసిన కుట్ర అని నీకు అర్ధం కాలేదా? ఎవరో మన ఫ్యామిలీని తప్పుదోవ పట్టిస్తే .. అన్నయ్య, వదినల్ని అనుమానింస్తావా..? అంటూ కళ్యాణ్‌  ధాన్యంపై మండిపడతాడు. దీంతో అందరూ ధాన్యలక్ష్మీని తిడతారు. ధాన్యలక్ష్మీ అందరికీ సారీ చెప్తుంది.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×