E-Paper
Advertisement

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్
Advertisement

Zebronics Vita Bar 202: ప్రస్తుత కాలంలో ఇంట్లో సినిమాలు చూస్తున్నప్పుడు లేదా మ్యూజిక్ వింటున్నప్పుడు సరైన సౌండ్ లేకపోతే.. ఆ మజానే రాదు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ప్రముఖ టెక్ బ్రాండ్ జెబ్రోనిక్స్ ‘ZEBRONICS Vita Bar 202’ పేరుతో ఒక అద్భుతమైన బ్లూటూత్ సౌండ్‌బార్‌ను విడుదల చేసింది. చూడటానికి అత్యంత ట్రెండీగా, మోడ్రన్ డిజైన్‌తో రూపుదిద్దుకున్న ఈ సౌండ్‌బార్ మీ లివింగ్ రూమ్ లేదా బెడ్‌రూమ్ లుక్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ఇది చాలా కాంపాక్ట్‌గా ఉండటంతో ఎక్కడైనా సర్దుకోవడం చాలా ఈజీ. మీ టేబుల్ లేదా టీవీ స్టాండ్‌పై ఇది ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాలు:

1.డ్యూయల్ డ్రైవర్లు , సౌండ్ పర్ఫార్మెన్స్:

ఈ సౌండ్‌బార్ మెయిన్ హైలైట్ దీనిలోని డ్యూయల్ డ్రైవర్లు. ఇవి అందించే.. 18W పవర్‌ ఫుల్ సౌండ్ అవుట్‌ పుట్ మీ రూమ్‌ను హోరెత్తిస్తుంది. పాటల్లోని బేస్ ,ట్రెబుల్ చాలా స్పష్టంగా వినిపిస్తాయి. మీరు యాక్షన్ సినిమాలు చూస్తున్నప్పుడు వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ అయినా, మెలోడీ సాంగ్స్ అయినా ఈ సౌండ్‌ బార్ ద్వారా అద్భుతమైన ఆడియో ఫీల్ పొందొచ్చు. తక్కువ బడ్జెట్‌లో ఇంత మంచి సౌండ్ క్వాలిటీ లభించడం నిజంగా బెస్ట్ అని చెప్పొచ్చు.

2.బ్యాటరీ బ్యాకప్, ఛార్జింగ్:

Advertisement

ప్రయాణాల్లో లేదా పవర్‌కట్ సమయంలో.. కూడా నిరంతరం ఎంటర్ట్మైన్మెంట్ పంచేందుకు ఇందులో 6 గంటల నిరంతర ప్లేబ్యాక్ కెపాసిటీని అందించారు. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు మీ ఇష్టమైన పాటలను వినొచ్చు. అంతేకాకుండా.. నేటి లేటెస్ట్ టెక్నాలజీకి తగినట్లుగా ఇందులో టైప్-సి ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. త్వరగా ఛార్జ్ అవ్వడం, వేగంగా కనెక్ట్ అవ్వడం దీని మరో పెద్ద ప్లస్ పాయింట్.

3.కనెక్టివిటీ ఆప్షన్లు, టెక్నాలజీ:

ఈ గాడ్జెట్ కేవలం బ్లూటూత్‌కే పరిమితం కాకుండా మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్లతో వస్తుంది. ఇందులో TWS సపోర్ట్ ఉండటం ద్వారా రెండు స్పీకర్లను యాడ్ చేసుకుని మరింత పెద్ద సౌండ్‌ను పొందవచ్చు. దీనితో.. పాటు USB , AUX కేబుల్ సపోర్ట్ కూడా లభిస్తుంది. డివైస్‌పై ఉన్న ఎల్ఈడీ ఇండికేటర్ పవర్ , కనెక్షన్ స్థితిని స్పష్టంగా సూచిస్తుంది. యూజర్లు తమకు నచ్చిన పద్ధతిలో మొబైల్, లాప్‌టాప్ లేదా టీవీకి దీన్ని ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

4.ధర :

అన్ని లేటెస్ట్ ఫీచర్లు కలిగిన ఈ సౌండ్‌బార్ మార్కెట్లో కేవలం రూ.1999 ధరకే లభిస్తుంది.తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే.. ప్రతీ ఒక్కరికీ ఈ సౌండ్‌బార్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

Related News

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

Big Stories

Advertisement
×