Irumudi 2: మాస్ మహారాజ రవితేజ హీరోగా శివా నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ఇరుముడి (Irumudi). డివోషనల్ థ్రిల్లర్ సినిమాగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకొని దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదలైన పది రోజుల వ్యవధిలోనే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్లు చిత్ర నిర్మాతలు అధికారకంగా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను మీడియా వారు అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఇరుముడి సినిమా సీక్వెల్ గురించి మైత్రి నిర్మాతలను ప్రశ్నించారు. ఇప్పటివరకు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి ఎలాంటి సీక్వెల్ సినిమాలు రాలేదు ఒకవేళ ఇరుముడి సినిమా సీక్వెల్ వస్తే రామ్ చరణ్(Ramcharan) తో చేస్తారా? అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు నిర్మాత మాట్లాడుతూ.. ఆ విషయం డైరెక్టర్ గారే చెప్పాలి. చరణ్ గారు నటిస్తారంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, అంతకంటే అదృష్టం కూడా ఉండదంటూ నిర్మాత తెలిపారు.
రామ్ చరణ్ అయ్యప్ప స్వామి భక్తుడు అనే విషయం తెలిసిందే. ఇలా రామ్ చరణ్ అయ్యప్ప మాల వేయడంతో ఇరుముడి సినిమాలో మల్లెపూల పల్లకి సాంగ్ లో రామ్ చరణ్ నటించిన బోతున్నారని వార్తలు కూడా బయటకు వచ్చాయని ప్రశ్నించడంతో ఈ ప్రశ్నకు దర్శకుడు శివా నిర్వాణ(Shiva Nirvana) మాట్లాడుతూ.. రామ్ చరణ్ ఆ పాటలో భాగం అవ్వాలి అనేది ఆర్గానిక్ గా జరిగి ఉంటే అదొక అద్భుతం అయ్యేదని తెలిపారు. నిజానికి మాకు అలాంటి ఆలోచన అసలు రాలేదు ఆ సినిమా కథను కథలాగే చేసుకుంటూ వెళుతున్నాము.
#RamCharan in #Irumudi Sequel? pic.twitter.com/1jt16BAuwP
— Movies4u Official (@Movies4u_Officl) September 2, 2026
ఒకరోజు సోషల్ మీడియాలో మల్లెపూల పల్లకి పాటలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారనే పోస్ట్ చూశాను. సోషల్ మీడియాలో ఇలాంటివన్నీ కామన్ అనుకున్నాను కానీ ఈ వార్త బాగా ప్రచారం అవడమే కాకుండా మీడియా మిత్రులు కూడా నన్ను ప్రశ్నించడంతో వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చామని తెలిపారు. ఇరుముడి సినిమా సీక్వెల్ జరిగితే అదొక అద్భుతమని, అలాంటివి చేయాలని రాసిపెట్టి ఉంటే కచ్చితంగా చేస్తామని శివ నిర్వాణ తెలిపారు. ఇరుముడి హిట్ అయింది కదా అని వెంటనే సీక్వెల్ రాయలేమని, అందుకు అనుగుణంగా ఉన్న పాయింట్ దొరికితే అప్పుడు ఆలోచిస్తాను అంటూ ఇరుముడి సీక్వెల్ సినిమా గురించి అందులో రామ్ చరణ్ నటించడం గురించి ఈ సందర్భంగా డైరెక్టర్ శివ నిర్వాణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒకవేళ నిజంగానే ఇది జరిగితే రామ్ చరణ్ అభిమానులకు మాత్రం పూనకాలు రావటం గ్యారెంటీ అని చెప్పాలి. ఇక ఇరుముడి సినిమాలో రవితేజ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవితేజ సినీ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఈ చిత్రం నిలిచిపోయింది.
Also Read: లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!