BigTV English

Allu Family – NKR: నితీష్ కుమార్ తో అల్లు అర్జున్ ఫ్యామిలీ..మీరు రెడ్డి మేము రెడ్డినే

Allu Family – NKR: నితీష్ కుమార్ తో అల్లు అర్జున్ ఫ్యామిలీ..మీరు రెడ్డి మేము రెడ్డినే

Allu Family – NKR:  ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( ipl 2025) నేపథ్యంలో చాలా బిజీగా ఉన్న నితీష్ కుమార్ రెడ్డి….. హైదరాబాద్ జట్టును ఛాంపియన్ గా నిలిపేందుకు చాలా కష్టపడుతున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ లందరూ…. మాల్దీవ్స్ ట్రిప్ వెళ్తే.. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి మాత్రం హైదరాబాద్ లోనే కష్టపడుతున్నాడు. జట్టులో ఎలాగైనా… రాణించాలనే కసితో ముందుకు వెళ్తున్నాడు నితీష్ కుమార్ రెడ్డి ( Nitish kumar reddy). ఈ సీజన్లో నితీష్ కుమార్ రెడ్డి పెద్దగా రాణించలేదు. బ్యాట్ జూలిపించలేదు. ఇలాంటి నేపథ్యంలోనే ట్రిప్పుకు వెళ్లకుండా హైదరాబాదులోనే ప్రాక్టీస్ చేస్తున్నాడు తెలుగు కుర్రాడు.


అల్లు అర్జున్ కుటుంబంతో నితీష్ కుమార్ రెడ్డి

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో… నితీష్ కుమార్ రెడ్డి, అల్లు అర్జున్ కుటుంబంతో మెరిశారు. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో తాజాగా ఫోటోలు దిగాడు నితీష్ కుమార్ రెడ్డి. దీనికి సంబంధించిన ఫోటోలను అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నితీష్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ అలాగే స్నేహ రెడ్డి తండ్రి.. కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డికి ఇప్పటికే పరిచయాలు ఉన్నాయని సమాచారం.


ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కొడుకు అలాగే కూతురుతో.. నితీష్ కుమార్ రెడ్డి ఫోటోలు దిగారు. ఓ ప్రైవేట్ పార్టీకి.. అల్లు అర్జున్ కుటుంబం మొత్తం వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి కూడా వెళ్లారని సమాచారం అందుతుంది. ఈ సందర్భంగా.. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ని కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీ కలిసిందని తెలుస్తోంది. ఈ సందర్భంగా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డితో అల్లు అర్జున్ పిల్లలు ఫోటోలు దిగారు. టీ షర్ట్ అలాగే క్యాజువల్ పాయింట్ ధరించిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి.. చాలా సింపుల్ లో కనిపించాడు. అయితే ఈ ఫోటోలను అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో పెట్టడంతో క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను చూసిన క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డి చాలా మంచి కుర్రాడు అని… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున అద్భుతంగా ఆడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

మాల్దీవ్స్ కు వెళ్లిన హైదరాబాద్ ప్లేయర్లు

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య గత నాలుగు రోజుల కిందట చెన్నై వేదికగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో గ్రాండ్ విక్టరీ కొట్టిన హైదరాబాద్ ప్లేయర్లకు కావ్య పాప మంచి ట్రీట్ ఇచ్చారు. వాళ్లందరినీ మాల్దీవ్స్ ట్రిప్ కు తీసుకువెళ్లారు కావ్య పాప. దీంతో అక్కడ చాలా ఎంజాయ్ చేసి హైదరాబాద్ ప్లేయర్లు రిలాక్స్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కానీ తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి మాత్రం…. మాల్దీవ్ కు వెళ్లకుండా… హైదరాబాదులోనే ఉంటూ ప్రాక్టీస్ చేశాడు.

ALSO READ: Trolls on Rishabh Pant : ఒకడికి 27 కోట్లు పెట్టాను.. ఏం పీకడం లేదు…. నువ్వు కోటి రూపాయలకే దుమ్ములేపుతున్నావ్

Related News

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Big Stories

×