BigTV English

Trolls on Rishabh Pant : ఒకడికి 27 కోట్లు పెట్టాను.. ఏం పీకడం లేదు…. నువ్వు కోటి రూపాయలకే దుమ్ములేపుతున్నావ్

Trolls on Rishabh Pant : ఒకడికి 27 కోట్లు పెట్టాను.. ఏం పీకడం లేదు…. నువ్వు కోటి రూపాయలకే దుమ్ములేపుతున్నావ్

Trolls on Rishabh Pant :  లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పై  సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఈ సీజన్ లో ఒక ఇన్నింగ్స్ లో మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు రిషబ్ పంత్. ఐపీఎల్ సీజన్ లో రూ.27 కోట్లు అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రిషబ్ పంత్.. తన ఆట మాత్రం ఆరేంజ్ లో లేదనే చెప్పాలి. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రిషబ్ పంత్ కంటే చాలా బెటర్ అని పొగుడుతున్నారు. మొన్న గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ సాధించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు.


Also Read :  Yuzi Chahal: ఆడు మగాడ్రా బుజ్జి… ఇద్దరు లేడీల చూస్తుండగానే సాధించాడు

ఇక సూర్యవంశీని ఇటీవల  లక్నో టీమ్ ఓనర్ సంజీవ్ గొయెంకా కలిశాడు. ఆ ఫోటో ను సోషల్ మీడియాలోపోస్టు చేసి నేను రూ.27కోట్లు పెట్టి ఒకడిని కొన్నాను.. వాడు 10 ఇన్నింగ్స్ లో మొత్తం కలిపి 110 కొట్టాడు. నీకు కోటి కాదు.. 10కోట్లు ఇచ్చినా తక్కువే బుడ్డోడా అన్నట్టు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సీజన్ లో రిషబ్ పంత్ అంతగా క్రికెట్ ఆడటం లేదు. ప్రతీ మ్యాచ్ లో కూడా విఫలమవుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ సూర్యవంశీ మాత్రం ఐపీఎల్ ఆరంగేట్ర మ్యాచ్ లోనే తొలి బంతికే సిక్సర్ బాదాడు. సిక్స్ బాది అందరి  దృష్టిని ఆకర్షించాడు. ఇక తన మూడో మ్యాచ్ లోనే 35 బంతుల్లోనే సెంచరీ సాధించిన తొలి ఇండియన్ గా రికార్డు క్రియేట్ చేశాడు. అంతకు ముందు 37 బంతుల్లో సెంచరీ చేసిన యూసూఫ్ పఠాన్ రికార్డును బ్రేక్ చేశాడు. గత రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ పేరు మారుమ్రోగిపోవడం విశేషం. అతను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం.. చాలా సింపుల్ గా సిక్స్ లు కొట్టడంతో అందరూ అతని ఆటకు ఫిదా అయ్యారు.


గుజరాత్ టైటాన్స్ జట్టు పై కీలక ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేయడంతో సోషల్ మీడియాలో ఇతని పై పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి సూర్యవంశీ తన చిన్నతనంలోనే క్రికెట్ ప్రాక్టీస్ చేశాడట. తన ఇంటికి సమీపంలో ఉన్నటువంటి గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేశాడట. ఆరేళ్ల వయస్సు లోనే వైభవ్ సూర్యవంశీ క్రికెట్ అంటే చాలా ఇష్టంగా చూసేవాడట. ఆరేళ్ల వయస్సు నుంచి ఐపీఎల్ చూడటం ప్రారంభించాడు. 14 ఏళ్లలోనే ఐపీఎల్ లో సెంచరీ చేయడం విశేషం. తన కుటుంబ సభ్యులతో కలిసి స్టేడియానికి కూడా వెల్లాడట. మహేంధ్రసింగ్ ధోనీ కెప్టెన్ ఉన్న రైజింగ్ పుణు సూపర్ జెయింట్స్ జట్టు 2017లో ఉండింది. అయితే ఆ సమయంలో RPS జట్టుకు సపోర్ట్ గా నిలుస్తూ మ్యాచ్ లకు వెళ్లాడట వైభవ్ సూర్యవంశీ. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఐపీఎల్ ఓపెనింగ్ చేస్తున్నాడు. అతని అద్భుతమైన ఫామ్ చూస్తుంటే.. ఇవాళ ముంబై ఇండియన్స్ జట్టు పై కూడా కీలక ఇన్నింగ్స్ ఆడే అవకాశం కనిపిస్తోంది.

?igsh=MWJzYXl1NWlmNm14ZQ==

 

Related News

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

Big Stories

×