T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 ) నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా కీలక ప్రకటన చేసింది. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడే జట్టును తాజాగా ప్రకటించింది ఆస్ట్రేలియా. 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. అయితే, ఈ టోర్నమెంట్ కు డేంజర్ బౌలర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఇద్దరూ దూరం అయ్యారు. అటు ఆస్ట్రేలియా ( Australia) కెప్టెన్ గా మిచెల్ మార్ష్ కొనసాగుతాడు. ఈ మేరకు జట్టును ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. మిచెల్ మార్ష్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా జట్టు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో పాల్గొననుంది. అయితే ఈ టోర్నమెంట్ కంటే ముందు ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి ప్యాట్ కమిన్స్ ను ( Pat Cummins) తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ప్యాట్ కమిన్స్ కు ఇటీవల గాయం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గాయంకు సంబంధించిన ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు ప్యాట్ కమిన్స్. ఈ నేపథ్యంలోనే ప్యాట్ కమిన్స్ స్థానంలో బెన్ ద్వార్షుయిస్ ( Ben Dwarshuis) బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఆస్ట్రేలియా. అయితే, ప్యాట్ కమిన్స్ ( SRH Pat Cummins) లాంటి డేంజర్ బౌలర్, కెప్టెన్ లేకపోవడం ఆస్ట్రేలియా తీరని నష్టం చేకూర్చనుంది. ఇది ఇలా ఉండగా, ప్రస్తుతం ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ ( Australia vs Pakistan) మధ్య టీ20 లీగ్ నడుస్తోంది. ఈ టోర్నమెంట్ రేపటితో ముగియనుంది. ఆ తర్వాత నేరుగా కొలంబోకు వెళ్లనుంది ఆస్ట్రేలియా జట్టు. అటు మిగతా క్రికెటర్లు కూడా ఆస్ట్రేలియా నుంచి కొలంబోకు వస్తారు.
2026 T20 ప్రపంచ కప్ షెడ్యూల్ ( T20 World Cup 2026 ) ఇప్పటికే ఫైనల్ అయింది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 2026 T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. మార్చి 8వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ కొనసాగనుంది. 2026 T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ఇండియా, శ్రీలంగా వేదికగా జరుగనుంది. అటు ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్ లంకలోని కొలంబో వేదికగా ఐర్లాండ్ తో ఆడనుంది.
ఆస్ట్రేలియా జట్టు ( T20 World Cup 2026 ) : మిచెల్ మార్ష్ ( కెప్టెన్), ట్రావిస్ హెడ్, హేజిల్‌వుడ్, ఇంగ్లిస్, బార్ట్‌లెట్, కొన్నోల్లీ, టిమ్ డేవిడ్, డ్వార్షుయిస్, గ్రీన్, ఎల్లిస్, కుహ్నెమాన్, మాక్స్‌వెల్, స్టోయినిస్ & జంపా.
Also Read: Yuvraj Singh: యువరాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోటల్ లో చెప్పులు కూడా !
WORLD CUP SQUAD 🔒
Mitch Marsh will lead our Aussie men's team at the upcoming #T20WorldCup in India and Sri Lanka. pic.twitter.com/DlIaxxnMnG
— Cricket Australia (@CricketAus) January 31, 2026