Dhanashree Verma: టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహాల్ సతీమణి ధనశ్రీ వర్మ గురించి తెలియని వారు ఉండరు. ఇటీవలే చాహల్ కు విడాకులు ఇచ్చిన ధన శ్రీ వర్మ.. సోషల్ మీడియాలో తెగ ఆక్టివ్ గా ఉంటోంది. ప్రతిరోజు చేసే ఆక్టివిటీని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది ఈ అందాల తార ధన శ్రీ వర్మ. అయితే ఈ నేపథ్యంలోనే… బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో ఉన్న రిలేషన్ ను బయటపెట్టింది. అతనికి తాను వైద్యం అందించినట్లు తాజాగా వెల్లడించింది. దీంతో ధనశ్రీ వర్మ అలాగే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ మధ్య సంబంధం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాలీవుడ్ హీరోకు ట్రీట్మెంట్ ఇచ్చిన ధనశ్రీ వర్మ
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గురించి తెలియని వారు ఉండరు. అయితే అలాంటి రణబీర్ కపూర్ కు చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ వైద్యం అందించినట్లు సోషల్ మీడియాలో వార్త చెక్కర్లు కొడుతోంది. వాస్తవానికి కొరియోగ్రాఫర్ గా ఉన్న ధనశ్రీ వర్మ… గతంలో వైద్యురాలిగా కూడా.. పనిచేశారు. డెంటిస్ట్ ఆసుపత్రిలో ఆమె ప్రాక్టీస్ కూడా చేసేది. అది ధనశ్రీ వర్మ సొంతంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు చెందిన ఆసుపత్రికి బాలీవుడ్ హీరో రన్ బీర్ కపూర్ కూడా వచ్చాడట. ఈ సందర్భంగా అతనికి వైద్యం కూడా చేసిందట. ఈ విషయాన్ని చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ ఓ ఇంటర్వ్యూలో… వెల్లడించడం జరిగింది.
దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు మూడు సంవత్సరాలు పాటు దంత వైద్యురాలిగా ధన శ్రీ వర్మ పని చేశారట. బాంద్రా అలాగే లోకండ్ వాళా రెండు ప్రాంతాల్లో కూడా ఆమె క్లినిక్ పెట్టారట. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది నటీనటులు తన వద్దకు వచ్చేవారని… తాజాగా ధనశ్రీ వర్మ వెల్లడించడం జరిగింది. ఇందులో భాగంగానే రన్ బీర్ కపూర్ కూడా.. వైద్యం తీసుకునేందుకు వచ్చాడట. ఆ సమయంలో స్వయంగా తానే వైద్యం అందించినట్లు కూడా వెల్లడించారు ధన శ్రీ వర్మ. అయితే కొన్ని అనువార్య కారణాలవల్ల ఆమె వైద్య వృత్తిని వదిలేసి డాన్సర్ గా మారింది. ఈ సందర్భంగానే చాహల్ అలాగే ధనశ్రీ వర్మ ప్రేమాయణం నడిచి పెళ్లి దాకా వెళ్ళింది. వీళ్ళిద్దరూ ఇటీవలే విడాకులు కూడా తీసుకున్నారు.
చాహల్ కు విడాకులు ఇచ్చిన ధనశ్రీ వర్మ
2020 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న ధనశ్రీ వర్మ అలాగే చాహల్ ఇద్దరు కూడా 2022 నుంచి దూరంగా ఉన్నారు. చిన్న చిన్న కారణాల వల్ల వాళ్లు విడిపోవలసి వచ్చింది. ఇక 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కంటే ముందే ముంబై కోర్టు వీళ్ళిద్దరికీ విడాకులు మంజూరు చేసింది.
Also Read: David Warner : మహేష్ బాబు-రాజమౌళి సినిమాలో విలన్ గా ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్?