BigTV English

Samantha: రాజ్ తో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన సమంత.. వీడియో వైరల్!

Samantha: రాజ్ తో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన సమంత.. వీడియో వైరల్!

Samantha: సమంత (Samantha) టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోల సినిమాలలో నటించి మంచి ఆదరణ సొంతం చేసుకున్న సమంత ఇటీవల సినిమాలను కాస్త తగ్గించారు. ఈమె తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలను కాస్త తగ్గించినప్పటికీ ఇటీవల మాత్రం తిరిగి ఇండస్ట్రీలో బిజీ అవుతున్న కేవలం వెబ్ సిరీస్ ల పైన ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్లలో షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సమంత నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సమంత తనని నిర్మాణంలో శుభం అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.


రాజ్ నిడుమోరితో రిలేషన్…

ఇలా నిర్మాతగా నటిగా కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న సమంత తన వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. సమంత నటుడు నాగచైతన్య(Nagachaitanya)కు విడాకులు(Divorce) ఇచ్చిన తర్వాత ఒంటరిగానే ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో సమంత సినీ దర్శకుడు రాజ్ నిడుమోరి(Raj Nidumori)తో కలిసి ప్రేమలో ఉన్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగానే సమంత, రాజ్ ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్లిన జంటగా కలిసి వెళ్లడం, చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని రహస్యంగా నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి.


దుబాయ్ లో సమంత రాజ్ ?

ఇలా నిత్యం రాజ్ తో కలిసి దిగిన ఫోటోలు వీడియోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా సమంత ఇన్స్టాగ్రామ్ ద్వారా మరొక వీడియోని కూడా షేర్ చేయడంతో సమంత తన రిలేషన్ ని ఇలా కన్ఫర్మ్ చేసిందా అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.. మరి సమంత షేర్ చేసిన ఆ వీడియో ఏంటనే విషయానికి వస్తే… తాజాగా సమంత తన బెస్ట్ ఫ్రెండ్ క్రీష బజాజ్ ఫ్యాషన్ షో కోసం దుబాయ్ వెళ్లారు. అయితే దుబాయ్ కి సంబంధించిన ఒక వీడియోని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఇందులో భాగంగా వాట్ ఐసీ vs వాట్ యు సీ అంటూ కొన్ని బెస్ట్ మూమెంట్స్ షేర్ చేశారు.

?igsh=cjJubmJsNXFqcGpi

ఇందులో భాగంగా వాట్ ఐ సీ అంటూ ఆమె ఒకరి చెయ్యిని పట్టుకొని ఎంతో సంతోషంగా ఉన్నట్టు కనిపించారు. అయితే ఆ వ్యక్తి ఎవరనే విషయం కనిపించకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఇలా సమంత చేతిని పట్టుకొని ఉన్న ఆ వ్యక్తి ఎవరు అంటూ కొంతమంది సందేహాలు వ్యక్తం చేయగా మరి కొందరు మాత్రం అక్కడ ఉన్నది రాజ్ అని, సమంత తన రిలేషన్ ని ఇలా కన్ఫర్మ్ చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా సమంత రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇప్పటివరకు మాత్రం సమంత ఈ వార్తలను ఖండించడం లేదు అలాగే ఈ వార్తలపై ఎక్కడ స్పందించిన దాఖలాలు కూడా లేవు. ది ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ సమయం నుంచి సమంత రాజ్ మధ్య పరిచయం ఏర్పడింది అయితే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తుంది.

Also Read: Sandeep Reddy Love Story:  సినిమాటిక్ లెవల్ లో సందీప్ లవ్ స్టోరీ..మొత్తానికి బయట పెట్టాడుగా!

Related News

Sobhita: షూటింగ్ లొకేషన్ లో వంట చేసిన శోభిత.. చైతూ రియాక్షన్ ఇదే!

Lokesh Kangaraj: చేసింది 6 సినిమాలే..22 మంది హీరోలను డైరెక్ట్ చేశా.. గర్వంగా ఉందంటూ!

OG Glimpse: ఎందయ్యా సుజీత్ బర్త్ డే హీరోదా…విలన్ దా ఆ గ్లింప్స్ ఏంటయ్యా?

Madharasi Censor Report: మదరాసి సెన్సార్‌ పూర్తి.. ఆ సీన్స్‌పై బోర్డు అభ్యంతరం, మొత్తం నిడివి ఎంతంటే

Ghaati Censor Report: అనుష్క ‘ఘాటీ’కి సెన్సార్‌ కట్స్.. ఆ సీన్లపై కోత.. మొత్తం మూవీ నిడివి ఎంతంటే!

Anushka Shetty: డాక్యుమెంటరీగా బాహుబలి.. కన్ఫర్మ్ చేసిన స్వీటీ!

Big Stories

×