E-Paper
Advertisement

French open, Iga Swiatek beat okasa: ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆసక్తికరంగా మ్యాచ్‌లు, ఒసాకపై ఇగా గెలుపు

French open,  Iga Swiatek beat okasa: ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆసక్తికరంగా మ్యాచ్‌లు, ఒసాకపై ఇగా గెలుపు

French open, Iga Swiatek beat okasa: ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచనాలు నమోదు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా మహిళల సింగల్స్ విభాగంలో నాలుగు గ్రాండ్ స్లామ్‌ల విజేత జపాన్ క్రీడాకారిణిని ఒసాక ఇంటి దారి పట్టింది.

రెండో రౌండ్‌లో ఫ్రెండ్ ఓపెన్ రెండుసార్లు విజేత, డిఫెండింగ్ ఛాంపియన్ పోలండ్‌కు ఇగా స్వైటెక్ 7-6, 1-6, 7-5 తేడాతో అతి కష్టం మీద గట్టెక్కింది. ఇరువురు ఆటగాళ్ల మధ్య పోరు నువ్వానేనా అన్నరీతిలో సాగింది. గంట 10 నిమిషాల పాటు హోరాహోరీగా తలపడ్డారు.

తొలి సెట్ నుంచే ఇరువురు ఆటగాళ్ల మధ్య పోరు ఆసక్తి భరితంగా సాగింది. చివరకు టై బ్రేకర్‌కు దారితీసింది. ఇందులో స్వైటెక్‌కు తిరుగులేకుండా పోయింది. దీంతో సెకండ్ సెట్ ఇరువురు ఆటగాళ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒసాక ఈసారి క్రాస్ కోర్టు షాట్స్‌తో స్వైటెక్‌ను బోల్తా కొట్టించింది. ప్రత్యర్థి సర్వీసును బ్రేక్ చేయలేక నిస్సహాయంగా మారిపోయింది. కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయి ఆ సెట్‌లో విజయం సాధించింది.

ఇరువురు ఆటగాళ్లు మ్యాచ్‌లు సమంగా ఉండడంతో మూడో మ్యాచ్ మొదలైంది. ఇందులో ప్రతీ పాయింట్ కోసం ఇద్దరు తలపడ్డారు. గెలుపు వైపు ఒసాక వెళ్తున్న సమయంలో అనూహ్యంగా ప్రత్యర్థి పుంజుకుంది. వరుసగా ఐదు గేమ్‌లు విజయం సాధించి తర్వాత రౌండ్‌లో అడుగుపెట్టింది ఇగా స్వైటెక్.

పురుషుల మరో సింగల్ మ్యాచ్‌లో స్పెయిన్ ఆటగాడు అల్కరాస్ మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. నెదర్లాండ్‌కు చెంది డి జాంగ్‌పై 6-3, 6-4, 2-6, 6-2 తేడాతో ఓడించాడు. కుడి చేతి నొప్పి కారణంగా
అల్కరాస్ ఫోర్ హ్యాండ్ షాట్స్‌‌ను సరిగా ఆడలేదు. ఈ మ్యాచ్‌లో అక్కరాస్ రెండు ఏస్‌లు 35 విన్నర్లు సంధించాడు.
ALSO READ: అంబటి రాయుడు ఫ్యామిలీకి బెదిరింపులు..!

మరో మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు, డిఫెండింగ్ ఛాంపియన్ జకోవిచ్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో ఫ్యాన్స్ ఆటగాడు హర్బర్ట్‌పై 6-4, 7-6, 6-4 తేడాతో విజయం సాధించాడు జకోవిచ్.

 

 

Tags

Related News

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Big Stories

×