Big Stories

Ambati Rayudu: అంబటి రాయుడు ఫ్యామిలీకి బెదిరింపులు..!

Ambati Rayudu’s Family gets Death Threats: చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మాజీ బ్యాటర్ అంబటి రాయుడు రాయల్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నెటిజన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా అంబటి రాయుడు కుటుంబానికి, ఆయన భార్య, కూతుళ్లకు బెదిరింపులు వస్తున్నాయని తెలుస్తోంది.

- Advertisement -

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ ప్రకారం.. ఐపీఎల్ 2024 సమయంలో ఆర్సీబీ మరియు విరాట్ కోహ్లీ గురించి రాయుడు పలు వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ కీలకమైన గేమ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించిన తరువాత సీఎస్కే వారి ట్రోఫీలలో ఒకదాన్ని ఆర్సీబీకి వారి నగరంలో పరేడ్ చేయడానికి అందజేయాలని రాయుడు సూచించాడు.

- Advertisement -

తరువాత ఇన్ స్టాగ్రామ్ లో రాయుడు సీఎస్కే యొక్క 5 ఐపీఎల్ ట్రోఫీలను అందరికీ గుర్తు చేశాడు. ఐపీఎల్ 2024 ఫైనల్ లో కేకేఆర్ విజతేగా అవతరించిన సమయంలో ఆ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ ను గెలుచుకున్న విరాట్ కోహ్లీపై స్వైప్ చేస్తూ ఆరెంజ్ క్యాప్ గెలవడం ద్వారా మాత్రమే ట్రోఫీని గెలవలేమని రాయుడు వ్యాఖ్యానించాడు. అప్పటి నుంచి అంబటి రాయుడికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నెటిజన్స్ పలు పోస్ట్ లు పెడుతున్నారు.

అయితే, అంబటి రాయుడు బంధువు అని చెప్పుకునే ఓ వ్యక్తి చేసిన తాజా ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అంబటి రాయుడు కుటుంబానికి బెదిరింపులు వస్తున్నట్లు అతను పేర్కొన్నాడు.

ఐపీఎల్-17 సీజన్ విన్నర్ గా కోల్ కతా నైట్ రైడర్స్ నిలిచిన విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేసి కేకేఆర్ విజయం సాధించింది. కేకేఆర్ కు ఈ విజయం ముచ్చటగా మూడోవది. అయితే, కేకేఆర్ గెలుపు తరువాత మాట్లాడిన టీమిండియా మాజీ బ్యాటర్ అంబటి రాయుడు.. ఆర్సీబీ విషయమై ప్రస్తావింంచారు. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ విషయమై మాట్లాడారు.

ఆరెంజ్ క్యాప్ లతో టైటిల్ గెలవలేమని, సమిష్టి ప్రదర్శనలే ఛాంపియన్ గా నిలబెడుతాయంటూ పరోక్షంగా కోహ్లీపై అంబటి రాయుడు విమర్శలు చేశారు. కాగా, ఈ ఏడాది సీజన్ లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ లో నిష్క్రమించినప్పటికీ ఆ జట్టు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ తన ప్రదర్శనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది సీజన్ లో 15 మ్యాచ్ లు ఆడిన విరాట్ 61.75 సగటుతో 741 పరుగులు తీశాడు. దీంతో ఆయన ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు.

‘ఐపీఎల్ లో ఓ జట్టు గెలవాలంటే సమిష్టి కృష్టి అవసరముంటుంది. అంతే తప్ప ఆరెంజ్ క్యాప్ లతో టైటిల్ గెలవలేం. జట్టులోని చాలామంది ఆటగాళ్లు 300 లేదా 400 పరుగులు చేస్తేనే జట్టు విజయం సాధ్యం అవుతుంది’ అంటూ రాయుడు పేర్కొన్న విషయం తెలిసిందే.

Also Read: రోహిత్ శర్మ సతీమణి ఏం చేసింది? నెటిజన్లు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు?

అదేవిధంగా విరాట్ కోహ్లీపై గతంలో కూడా అంబటి పరోక్షంగా విమర్శలు చేశారు. జట్టు ప్రయోజనాల కంటే వ్యక్తిగత మైలురాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం టీమ్ కు మంచిది కాదంటూ అంబటి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News