E-Paper
Advertisement

గంభీర్‌, అజిత్ అగార్కర్ మ‌ధ్య గొడ‌వ‌లు..డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్నారంటూ వార్త‌లు ?

గంభీర్‌, అజిత్ అగార్కర్ మ‌ధ్య గొడ‌వ‌లు..డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్నారంటూ వార్త‌లు ?
Advertisement

Gambhir VS Agarkar:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ పైన టీమ్ ఇండియా ప్లేయర్లు దృష్టి పెట్టారు. రేపటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ కూడా ప్రారంభం కానుంది. అనంతరం వన్డేలు కూడా నిర్వహించనున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టీమిండియా సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీమిండియా టి20 జట్టుకు కొత్త కెప్టెన్ ను నియామకం చేయాలని ఇప్పటికే బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పూర్తి బాధ్యతలను గౌతమ్ గంభీర్ తో పాటు అజిత్ అగార్కర్ కు అప్పగించింది. దీంతో కొత్త కెప్టెన్ కోసం అన్వేషణ మొదలు పెట్టిన గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ మధ్య గొడవలు ప్రారంభమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

గౌతమ్ గంభీర్ వర్సెస్ అజిత్ అగార్కర్ మధ్య గొడవలు

Advertisement

టి20 కెప్టెన్ గా ఉన్న సూర్య కుమార్ యాదవ్ పైన దాదాపుగా వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐర్లాండ్ తో జరిగే టి20 సిరీస్ నేపథ్యంలో అతన్ని పక్కకు పెట్టి, కొత్త కెప్టెన్ ను నియామకం చేయాలని ఈ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా టి20 కెప్టెన్ గా సంజు శాంసన్ అయితే బెటర్ అని గౌతమ్ గంభీర్ వాదిస్తున్నారట. అతనికి ఐపిఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టును లీడ్ చేసిన అనుభవంతో పాటు.. బ్యాటింగ్ చేయగల సత్తా ఉందని వెల్లడించారట గౌతమ్ గంభీర్. ఓపెనర్ గా కూడా ఆ పనికి వస్తాడని తన అభిప్రాయాన్ని చెప్పారట. అయితే దీన్ని అజిత్ అగార్కర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ టోర్నమెంట్లో దాదాపు నాలుగు సంవత్సరాలుగా అద్భుతంగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ కు అవకాశం ఇవ్వాలని అజిత్ అగార్కర్ ప్రతిపాదనలను సిద్ధం చేశారట. దీంతో గౌతమ్ గంభీర్ అలాగే అది తగర్కర్ మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో అజిత్ అగార్కర్ నిర్ణయం ప్రకారం బీసీసీఐ ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. అంటే టీమిండియా టి20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ అవుతాడని వార్తలు వస్తున్నాయి. అతడైతేనే మంచి భవిష్యత్తు టీమ్ ఇండియాకు ఉంటుందని బీసీసీఐ కూడా స్పష్టం చేస్తుంది అంట. అయితే బీసీసీఐ… అజిత్ అగార్కర్ చెప్పినట్లుగా వింటున్న నేపథ్యంలో.. గౌతమ్ గంభీర్ అలిగినట్లు వార్తలు వస్తున్నాయి.

శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ పదవి..?

Advertisement

చాలా రోజులుగా టి20 టీమ్ ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ విఫలమవుతున్న సంగతి తెలిసిందే. టి20 లలో కెప్టెన్ గా అదరగొడుతున్నప్పటికీ బ్యాటింగ్ లో మాత్రం సూర్యకుమార్ యాదవ్ విఫలమవుతున్నాడు. అందుకే ఈ మార్పు అనివార్యం అయింది. సూర్య కుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు అవకాశం ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

 

Related News

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

Big Stories

Advertisement
×