E-Paper
Advertisement

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు
Advertisement

Tanveer Ahmed:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ఇటీవల ముగిసిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజంను (Babar Azam) ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులోకి తీసుకోవాలని సవాల్ విసిరారు. ఇండియన్ ఫ్యాన్స్ చాలా మంది బాబర్ ఆజం కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. ఇండియాలో బాబర్ ఆజంకు విపరీతమైన ఫాలోయింగ్ ఉందని చెప్పిన ఆయన… విరాట్ కోహ్లీ ( Virat Kohli) కంటే బాబర్ బెటర్ ఆటగాడు అంటూ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో ఆడేలా బాబర్ ఆజంకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఐపీఎల్ టోర్నమెంటులో బాబర్ ఆజం గనుక ఆడితే మాత్రం, వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కంటే అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేస్తాడని వార్నింగ్ ఇచ్చారు తన్వీర్ అహ్మద్.

Also Read: Short Circuit, Smoke In Team Bus:  గుజ‌రాత్ బ‌స్సు ప్ర‌మాదం వెనుక RCB కుట్ర..వైర్లు క‌ట్ చేసింది కోహ్లీ ఫ్యాన్స్ అంటూ ఆరోప‌ణ‌లు ! 

విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజం గొప్ప ఆటగాడు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో అద్భుతంగా రానించి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ టైటిల్ అందించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా 75 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలో బెంగుళూరు రెండోసారి వరుసగా ఛాంపియన్ అయింది. అయితే ఈ ఇన్నింగ్స్ పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ వర్సెస్ బెంగళూరు మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ టెస్ట్ ప్లేయర్ లాగా ఆడాడు అని మండిపడ్డారు. 75 పరుగులు చేయడానికి చాలా సమయం తీసుకున్నాడని.. ఇలాంటి వాళ్లు టి20లకు పనికిరాని బాంబు పేల్చారు. అందుకే విరాట్ కోహ్లీ కంటే పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజం గొప్పవాడు అంటూ కితాబిచ్చారు.

ఇండియన్ పిచ్ ల పైన పరుగులు చేయడం కాదు… దమ్ముంటే పాకిస్తాన్ వచ్చి తమ మైదానాలలో మ్యాచ్ ఆడాలని విరాట్ కోహ్లీకి సవాల్ విసిరారు. ఇండియాలో ప్రతి స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని ఆరోపణలు చేశారు. అందుకే స్కూల్ కి వెళ్లే 15 ఏళ్ల బుడ్డోడు కూడా అంతర్జాతీయ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడని బాంబు పేల్చారు. ఇక విరాట్ కోహ్లీ మొన్న ఐపిఎల్ సందర్భంగా 600 పరుగులు చేశాడని గుర్తు చేశారు. అదే 600 పరుగులు పాకిస్తాన్ లో చేస్తే.. తాను బట్టలు లేకుండా తిరుగుతానంటూ సవాల్ విసిరారు. ఇండియన్ మైదానాలలో విరాట్ కోహ్లీ అవలీలగా పరుగులు చేస్తున్న నేపథ్యంలో… బాబర్ ఆజం కు ఐపీఎల్ లో ఛాన్స్ ఇవ్వాలని కోరారు. అదే జరిగితే అందరికంటే ఎక్కువ బాబర్ ఆజం పరుగులు చేస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

Also Read:  Inzamam-ul-Haq: ఇది ప‌క్కా ఫిక్సింగే.. కోహ్లీకి గుజ‌రాత్ బౌల‌ర్ల నెమ్మ‌దిగా బంతులు వేశారు Inzamam-ul-Haq !

 

 

 

 

Related News

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

Big Stories

Advertisement
×