E-Paper
Advertisement

Hardik Pandya: హార్దిక్ పాండ్యా విధ్వంసం..ఒకే ఓవర్ లో 5 సిక్సులు..7వ వికెట్‌కు వచ్చి సెంచ‌రీ

Hardik Pandya: హార్దిక్ పాండ్యా విధ్వంసం..ఒకే ఓవర్ లో 5 సిక్సులు..7వ వికెట్‌కు వచ్చి సెంచ‌రీ
Advertisement

Hardik Pandya:  టీమిండియా డేంజర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 68 బంతుల్లో సెంచరీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు హార్థిక్ పాండ్యా. ఏడవ వికెట్ కు మహేంద్ర సింగ్ ధోనీ తరహాలో బ్యాటింగ్ కు దిగిన హార్దిక్ పాండ్యా, సెంచరీ చేసి దుమ్ము లేపాడు. విజయ్ హజారే టోర్నమెంటులో ( Vijay Hazare Trophy Elite 2025-26 ) భాగంగా హార్దిక్ పాండ్యా ఈ సూపర్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. విదర్భతో జరిగిన మ్యాచ్ లో 68 బంతుల్లోనే సెంచరీ చేసి అదరగొట్టాడు. అంతేకాదు ఈ మ్యాచ్ లోనే, ఒకే ఓవర్ లో 5 సిక్సర్లతో పాటు ఒక బౌండరీ కూడా సాధించాడు. దీంతో ఆ ఓవర్ లో 34 పరుగులు సాధించాడు హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ). దీంతో హార్దిక్ పాండ్యా ఆడిన ఇన్నింగ్స్ వైరల్ గా మారింది.

Also Read:  Sai Sudharsan Injury: విరిగిన పక్కటెముక.. పెను ప్రమాదంలో సాయి సుదర్శన్..ఐపీఎల్ 2026 నుంచి ఔట్ ?

హార్దిక్ పాండ్యా విధ్వంసం..ఒకే ఓవర్ లో 5 సిక్సులు

Advertisement

విజయ్ హజారే టోర్నమెంట్ 2025-26 లో ( Vijay Hazare Trophy Elite 2025-26 ) భాగంగా మ్యాచులన్నీ చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ టోర్నమెంట్లో మన ఇండియన్ క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే ఇవాళ ఈ టోర్నమెంట్ లో భాగంగా బరోడా వర్సెస్ విదర్భ గ్రూప్ B లో ( Baroda vs Vidarbha, Group B ) భాగంగా మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో బరోడా జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఇందులో నిర్ణీత 50 ఓవర్లు ఆడిన బరోడా జట్టు, 9 వికెట్లు నష్టపోయి 293 పరుగులు సాధించింది. అయితే బరోడా బ్యాటింగ్ చేసే సమయంలో టాప్ ఆర్డర్ మొత్తం దారుణంగా విఫలమైంది. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం ఏడవ వికెట్ కు బరిలోకి దిగి అద్భుతంగా రానించాడు.

ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. ఏడవ వికెట్ కు బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా 92 బంతుల్లో 133 పరుగులు సాధించాడు. ఇందులో 11 సిక్సర్లతో పాటు 8 బౌండరీలు ఉన్నాయి. 144.57 స్ట్రైక్ రేట్ తో రఫ్పాడించాడు. హార్దిక్ పాండ్యా మినహా బరోడా జట్టు ప్లేయర్లు ఎవరూ కూడా రాణించలేదు. ఇక ఈ మ్యాచ్ లో బరోడాపై విదర్భ గెలవాలంటే మరో 197 పరుగులు చేయాల్సి ఉంది. చేజింగ్ లో విదర్బ జట్టు కూడా వికెట్ నష్టపోకుండా అదరగొడుతోంది. ఇప్పటివరకు 12 ఓవర్లు వాడిన విదర్భ ఒక్క వికెట్ నష్టపోకుండా 97 పరుగులు సాధించింది. అమన్ 55 పరుగులు సాధించగా అతని 39 పరుగులతో రాణిస్తున్నాడు. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు ఇలాగే మ్యాచ్ ముందుకు సాగిస్తే ఖచ్చితంగా బరోడాపై విధర్భ విజయం సాధించడం ఖాయం. ఇది ఇలా ఉండ‌గా, టీమిండియా ( Team India) ఆల్ రౌండ‌ర్ హ‌ర్ధిక్ పాండ్యా సెంచ‌రీ చేయ‌డంతో ఆయ‌న ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

Advertisement

Also Read: Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×