Sai Sudharsan Injury: టీమిండియా జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్న యంగ్ క్రికెటర్ సాయి సుదర్శన్ ( Sai Sudharsan Injury)… శ్రేయాస్ అయ్యర్ తరహా లోనే గాయపడ్డాడు. పరుగు తీస్తుండగా కిందపడ్డ సాయి సుదర్శన్ పక్కటెముక విరిగినట్లు తెలుస్తోంది. దీంతో అతడు దాదాపు ఆరు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు స్పష్టం చేశారట. ఈ న్యూస్ బయటకు రావడంతో సాయి సుదర్శన్ ( Sai Sudharsan ) అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అటు గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్ కూడా టెన్షన్ పడుతున్నారు.
టీం ఇండియాలో ( Team India) ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సాయి సుదర్శన్ కు ( Sai Sudharsan ) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా యంగ్ కుర్రాడు సాయి సుదర్శన్ తీవ్ర గాయంతో బాధపడుతున్నాడు. విజయ్ హజారే టోర్నమెంట్ 2025-26లో భాగంగా తమిళనాడు తరఫున సాయి సుదర్శన్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ లో భాగంగా తాజాగా మధ్యప్రదేశ్ జట్టుతో మ్యాచ్ ఆడాడు. ఈ సందర్భంగా పరుగు తీస్తూ ఒక్కసారిగా కింద పడిపోయాడు సాయి సుదర్శన్. దీంతో పక్కటెముక విరిగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో సాయి సుదర్శన్ రికవరీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పక్కటెముక విరగడంతో అతడు కోలుకోవడానికి దాదాపు 6 వారాల సమయం పడుతుంది అని చెబుతున్నారు.
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ సమయానికి సాయి సుదర్శన్ ( Sai Sudharsan ) కోలుకుంటాడని క్రికెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే గుజరాత్ టైటాన్స్ (Gujarat taitans) అభిమానులు మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నారు. పక్కటెముక విరగడంతో అతడు కోలుకోవడానికి చాలా రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆరు వారాలు కాదు అతడు కోలుకోవాలంటే కనీసం 100 రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. నిజంగానే సాయి సుదర్శన్ ఐపిఎల్ 2026 టోర్నమెంట్ ఆడకపోతే… గుజరాత్ టైటాన్స్ జట్టుకు నిజంగానే ఎదురు దెబ్బ తగిలి ప్రమాదం పొంచి ఉంది. ఆ జట్టు తరుపున ప్రతి సీజన్ లో కూడా అద్భుతంగా రాణించాడు సాయి సుదర్శన్. ఈ నేపథ్యంలోనే 2026 సీజన్ మెగావేళానికి ముందు రూ. 8.5 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకుంది గుజరాత్ టైటాన్స్. ఇది ఇలా ఉండగా, గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడే సాయి సుదర్శన్ ( Sai Sudharsan ) గిల్ తో పాటు ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు. శుభ్ మాన్ గిల్ విఫలమైనా, సాయి సుదర్శన్ బాగా ఆడి, గుజరాత్ టైటాన్స్ ను ఆదుకునేవాడు. మరి అలాంటి సాయి సుదర్శన్ కు గాయం కావడం ఇప్పుడు కలవరపెడుతోంది.
Get well soon Sai Sudarshan❤️🩹 pic.twitter.com/n37kCOvrSa
— Cricket Gyani🏏💡 (@CSyncing) January 2, 2026