E-Paper
Advertisement

ILT20 FINAL: పాకిస్తాన్ బౌల‌ర్ ఇజ్జ‌త్ తీసిన పొలార్డ్‌..ILT20 విజేత ఎవ‌రంటే

ILT20 FINAL: పాకిస్తాన్ బౌల‌ర్ ఇజ్జ‌త్ తీసిన పొలార్డ్‌..ILT20 విజేత ఎవ‌రంటే
Advertisement

ILT20 FINAL:  ఇంటర్నేషనల్ లీగ్ టి20 టోర్నమెంట్ ( International League T20, 2025-26 ) విజేతగా డెసర్ట్ వైపర్స్ నిలిచింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా నిన్న ఫైనల్ మ్యాచ్ డెసర్ట్ వైపర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ ( Desert Vipers vs MI Emirates, Final ) జట్ల మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన డెసర్ట్ వైపర్స్ 46 పరుగులు తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. డెసర్ట్ వైపర్స్ విధించిన 182 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ దారుణంగా విఫలమైంది. ఈ నేపథ్యంలోనే 46 పరుగులు తేడాతో విజయం సాధించిన డెసర్ట్ వైపర్స్, తొలిసారి ఇంటర్నేషనల్ లీగ్ టి20 టైటిల్ గెల్చుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ బౌలర్, డెసర్ట్ వైపర్స్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న‌ నిషీమ్ షా ( NASEEM SHAH ), ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ కెప్టెన్ కీర‌న్ పొలార్డ్ ( ) మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ బౌలర్ నిషీమ్ షాపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు కీరాన్ పొలార్డ్ ( Kieron Pollard ). ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే

పాకిస్తాన్ బౌల‌ర్ ఇజ్జ‌త్ తీసిన పొలార్డ్‌

Advertisement

ఇంటర్నేషనల్ లీగ్ టి20 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ నిన్న జరిగింది. ఈ మ్యాచ్ లో డెసర్ట్ వైపర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ ( Desert Vipers vs MI Emirates, Final ) తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో చేజింగ్ చేసే క్రమంలో, ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ కెప్టెన్ కీరాన్ పొలార్డ్ ( Kieron Pollard )కు కోపం తెప్పించాడు పాకిస్తాన్ బౌలర్ నిషీమ్ షా ( NASEEM SHAH ). బౌలింగ్ వేసిన అనంతరం బ్యాటింగ్ చేస్తున్న పొలార్డ్ ను డిస్టర్బ్ చేశాడు నిషీమ్ షా. అయితే వెంటనే రియాక్ట్ అయిన కెప్టెన్ కీరాన్ పొలార్డ్, పాకిస్తాన్ బౌలర్ నిషీమ్ షా పైకి వెళ్లాడు. కాస్త అయితే కొట్టేవాడు కూడా. అంతలోనే ఫీల్డ్ అంపైర్ రంగంలోకి దిగి ఇద్దరి మధ్య గొడవను చల్లార్చడం జరిగింది. ఇక ఆ తర్వాత కీరాన్ పొలార్డ్ వికెట్ ను అదే బౌలర్ నిషీమ్ షా తీయడం జరిగింది. దీంతో వీళ్లిద్దరి మధ్య గొడవ వైరల్ గా మారింది.

ఛాంపియన్ గా నిలిచిన డెసర్ట్ వైపర్స్

ఇంటర్నేషనల్ లీగ్ టి20 2025 – 26 టోర్నమెంట్ విజేతగా డెసర్ట్ వైపర్స్ నిలిచింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన డెసర్ట్ వైపర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 182 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో 18.3 ఓవర్లలో 136 ప‌రుగులకు ఆల్ అవుట్ అయి ఓడిపోయింది.

Advertisement

Also Read:  BCCI-Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్..బీసీసీఐ కీల‌క ఆదేశాలు, రూ.9.20 కోట్లు గంగ‌పాలు

 

 

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×