BCCI-Mustafizur Rahman: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( IPL 2026) ప్రారంభానికి అంటే ముందు కేకేఆర్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అందరూ ఊహించినట్లుగానే బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ ( Mustafizur Rahman ) పైన వేటు వేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India ). కేకేఆర్ జట్టు నుంచి ముస్తాఫిజుర్ రహమాన్ ను రిలీజ్ చేయాలని కీలక ఆదేశాలు ఇచ్చింది బీసీసీఐ. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల నేపథ్యంలో ముస్తాఫిజుర్ రహమాన్ ను ఐపీఎల్లో ఆడించకూడదని డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముస్తాఫిజుర్ రహమాన్ పై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. దీంతో ఐపీఎల్ 2026 టోర్నమెంటులో ముస్తాఫిజుర్ రహమాన్ ఆడబోడన్నమాట. కాగా మొన్నటి ఐపిఎల్ మినీ వేలంలో ముస్తాఫిజుర్ రహమాన్ ను 9.20 కోట్లకు కొనుగోలు చేసింది కేకేఆర్.
Also Read: Ravichandran Ashwin: టీ20 వరల్డ్ కప్ 2026 కంటే సీరియల్స్ చూడటం బెటర్..టీమిండియా ఆడటం దండగే
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు నలుగురు హిందువులను బంగ్లాదేశ్ లో ముస్లింలు చంపేశారు. ఈ సంఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో ఇండియా వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. బంగ్లాదేశ్ ముస్లింలకు వ్యతిరేకంగా ఇండియాలో హిందువులు నిరసనలు తెలుపుతున్నారు. అటు మోడీ ప్రభుత్వం పై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను కాపాడాలని కోరుతున్నారు. అయితే హిందువులపై బంగ్లాదేశ్ లో దాడులు జరుగుతున్నప్పటికీ.. ముస్తాఫిజుర్ రహమాన్ లాంటి ప్లేయర్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ( Indian Premier League Tournament ) ఎలా ఆడిస్తారని కూడా తీవ్రస్థాయిలో క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
ముస్తాఫిజుర్ రహమాన్ ను కొనుగోలు చేసిన కేకేఆర్ జట్టు, సహా యజమాని షారుఖ్ ఖాన్ పై కూడా విమర్శలు చేస్తున్నారు. షారుక్ ఖాన్ దేశద్రోహి అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ముస్తాఫిజుర్ రహమాన్ అంశంపై తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India ) నిర్ణయం తీసుకుంది. అతన్ని ఐపిఎల్ టోర్నమెంటులో ఆడించకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేకేఆర్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. 9.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కేకేఆర్.. ఇప్పుడు తీవ్రంగా నష్టపోయింది. బిసిసిఐ ( BCCI) తీసుకున్న నిర్ణయంతో ముస్తాఫిజుర్ రహమాన్ స్థానంలో ( BCCI-Mustafizur Rahman) మరో ప్లేయర్ ను తీసుకోనున్నారు. ఇది ఇలా ఉండగా ముస్తాఫిజర్ రహమాన్ ను ఆడించకూడదని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా హిందూ సంఘాలు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక పైన పాకిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్ ప్లేయర్లను కూడా ఇండియాకు రానివ్వకూడదని కోరుతున్నారు. మన టీమ్ ఇండియా కూడా బంగ్లాదేశ్ లో పర్యటించకుండా చూడాలని సూచనలు చేస్తున్నారు.
Also Read: Sai Sudharsan Injury: విరిగిన పక్కటెముక.. పెను ప్రమాదంలో సాయి సుదర్శన్..ఐపీఎల్ 2026 నుంచి ఔట్ ?
🚨 NO MUSTAFIZUR RAHMAN IN IPL 🚨
– BCCI Secretary has confirmed that board has asked KKR to release Mustafizur from the IPL squad. [India Today] pic.twitter.com/FRegqPbkR6
— Johns. (@CricCrazyJohns) January 3, 2026